Kaliyugam Pattanamlo: ‘కలియుగం పట్టణంలో’ నుంచి 'జో జో లాలీ అమ్మ' సాంగ్ రిలీజ్

Jo Jo Lali Amma Lyrical Song: కలియుగ పట్టణం మూవీ రిలీజ్‌కు సిద్ధమైంది. మార్చి 22న ఆడియన్స్‌ ముందుకు రానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. తాజాగా సినిమా నుంచి 'జో జో లాలీ అమ్మ' అంటూ సాగే సాంగ్‌ను ప్రముఖ దర్శకుడు వశిష్ట విడుదల చేశారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 27, 2024, 08:11 PM IST
Kaliyugam Pattanamlo: ‘కలియుగం పట్టణంలో’ నుంచి 'జో జో లాలీ అమ్మ' సాంగ్ రిలీజ్

Jo Jo Lali Amma Lyrical Song: టాలీవుడ్‌లో ప్రస్తుతం న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్ కనిపిస్తోంది. కొత్తగా వస్తున్న టీమ్ విభిన్న కథలతో ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోంది. కొత్త దర్శక నిర్మాతలు, హీరోలు డిఫరెంట్ కాన్సెప్ట్‌లను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తిక్, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘కలియుగం పట్టణంలో’ అనే ఓ డిఫరెంట్ మూవీ రాబోతోంది. ఈ మూవీకి రమాకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌లు కలిసి సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. మార్చి 22న రాబోతోన్న ఈ మూవీలో చిత్రా శుక్లా ప్రధాన పాత్రను పోషిస్తున్నారు.

Also Read: SIP Investment: నెలకు 1000 రూపాయలు పెట్టుబడితో 1-2 కోట్లు సంపాదించడం ఎలా

టాలీవుడ్‌లో ఇది వరకు ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమాలు రాలేదని మేకర్స్ చెబుతున్నారు. సరికొత్త పాయింట్‌తో సినిమాను రూపొందించామని.. మంచి సందేశాన్ని ఇస్తూ కుటుంబ సమేతంగా అలరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రీసెంట్‌గా విడుదల చేసిన మూవీ రిలీజ్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా 'జో జో లాలీ అమ్మ' సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సాంగ్‌తో మూవీలో మదర్ సెంటిమెంట్ ఉంటుందని చెప్పేశారు మేకర్స్. ఈ పాటను ప్రముఖ దర్శకుడు వశిష్ట రిలీజ్ చేశారు. పాట చాలా బాగుందని చిత్రయూనిట్‌ను అభినందించారు. సినిమా పెద్ద హిట్ అవ్వాలని యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News