టాలీవుడ్ లో ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ అంటే ఓ బ్రాండ్… దిల్ రాజు నిర్మాణంలో ఈ బ్రాండ్ నుండి వచ్చే సినిమాలపై ఆడియన్స్ లో హై ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. ఈ బ్యానర్ కి ఓ అరుదైన రికార్డు కూడా ఉంది. 2017 లో SVC బ్యానర్ నుండి ఏకంగా 6 సినిమాలు విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించాయి.
ఆ మేజిక్ ను ఈ ఏడాది మరోసారి రిపీట్ చేయబోతున్నారు దిల్ రాజు. ఈ ఏడాది ఆరంభంలో నిర్మాతగా మళ్ళీ ఆయన చక్రం తిప్పారు. ప్రస్తుతం ఈ ప్రొడ్యూసర్ ఊపు చూస్తుంటే ఈ ఇయర్ డబుల్ హ్యాట్రిక్ గ్యారెంటీ అనిపిస్తోంది.
సంక్రాంతి కానుకగా విడుదలైన F2 దిల్ రాజు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ ఎనర్జీతో ఈ ఏడాది కూడా వరుసగా సినిమాలు రిలీజ్ చేసి నిర్మాతగా మరో చెక్కుచెదరని రికార్డు అందుకోవాలని చూస్తున్నారు రాజు.
మహేష్ నటిస్తోన్న ‘మహర్షి’ ఏప్రిల్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు రాజు ఒక నిర్మాత. ఈ సినిమా తర్వాత 96 తెలుగు రీమేక్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శర్వానంద్-సమంత జంటగా నటించనున్న ఈ బ్యూటిఫుల్ లవ్ ఎంటర్టైనర్ సినిమా మార్చి నుండి షూటింగ్ మొదలుకానుంది.
ఇలా బ్రహ్మాండమైన లైనప్ రెడీ చేసిన ఈ టాప్ ప్రొడ్యూసర్, ఈ ఏడాది మరో రెండు సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఆ సినిమాల డిస్కషన్ జరుగుతోంది. త్వరలోనే ఆ వివరాలు కూడా బయటకు రాబోతున్నాయి.
2017 లాగే ఈ ఏడాది కూడా దిల్ రాజు వరుస విజయాలతో బ్లాక్ బస్టర్ నిర్మాతగా మరో రికార్డు అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తోంది ‘జీ సినిమాలు’.