అక్కినేని నాగార్జున నటించిన ‘ఆఫీసర్’ మూవీ జూన్ 1 న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఇక తన నెక్ట్స్ మూవీపై దృష్టి పెట్టారు నాగ్ ...ఈ నేపథ్యంలో నాగ్ తన నెక్ట్స్ మూవీ ధనుష్ డైరెక్షన్ లో నటిస్తారని టాక్. అయితే ఈ విషయంలో నాగార్జున నుంచి కానీ.. ధనుష్ వైపు నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
రీసెంట్ గా ‘పా పాండి’ సినిమాకు దర్శకత్వం వహించి ధనుష్ సెన్సిబుల్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. నాగ్ వైపు మొగ్గు చూపడానికి ఇదే కారణమని టాలీవుడ్ వర్గాలు నుంచి సమాచారం. ఆ మధ్య ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సీక్వెల్ ‘బంగార్రాజు’ ప్లాన్ చేస్తానని చెప్పిన నాగార్జున.. మరి ధనుష్ సినిమా తరవాతే ఈ సీక్వెల్ గురించి ఆలోచిస్తాడా..? అనేది ఇంకొన్ని రోజుల్లో తెలిసిపోతుంది.