Zee Real Heroes Awards 2024: జీ రియల్ హీరోస్ అవార్డ్ 2024 అనేది ప్రతి ఏటా విభిన్నరంగాల్లో ప్రతిభా పాటవాలు చూపించిన వ్యక్తులకు ఇచ్చే భారీ సత్కార కార్యక్రమం. భారతీయ చలనచిత్ర పరిశ్రమ నుంచి అనుపమ్ ఖేర్, అజయ్ దేవగణ్, అమోఘ్ లీలా దాస్, కుమార్ సాను, పంకజ్ త్రిపాఠి, కార్తీక్ ఆర్యన్ వంటి సెలెబ్రిటీలు అవార్డు గ్రహీతల్లో ఉన్నారు. ఎవరెవరికి ఏ అవార్డ్ దక్కిందో తెలుసుకుందాం..
కుమార్ సాను
బాలీవుడ్ మెలోడీ కింగ్ కుమార్ సానుకు లైఫ్‌టైమ్ ఎఛీవ్‌మెంట్ అవార్డ్ దక్కింది. 2009లో ఇతనిని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఇది కాకుండా ఒకే రోజు రికార్డు సంఖ్యలో పాలు పాడినందుకు 1993లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో పేరెక్కింది
పంకజ్ త్రిపాఠి, అజయ్ దేవగణ్, కార్తీక్ ఆర్యన్
పంకజ్ త్రిపాఠికి మెగా పెర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించగా అజయ్ దేవగణ్ సైతం అదే అవార్డు దక్కించుకున్నారు. ఇక కార్తీక్ ఆర్యన్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ పొందాడు. నాటి మేటి నటుడు అనుపమ్ ఖేర్‌కు భారతీయ సినిమాకు అందించిన అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ గుర్తింపు లభించింది.
REAL HEROES AWARD: Thank you @ZeeNews for honouring me with this prestigious award for my #OutstandingContribution to #IndianCinema. And to get it from the dynamic #ChiefMinister of Maharashtra Shri #DevendraFadnavis ji was great. With every award comes a bigger responsibility of… pic.twitter.com/f7f0ExQQUF
— Anupam Kher (@AnupamPKher) January 15, 2025
ఈ వేడుకలో పాల్గొన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేశారు. విజేతల్ని అభినందించారు. జీ రియల్ హీరోస్ అవార్డ్స్ 2024 కార్యక్రమం ద్వారా వివిధ రంగాల్లో ప్రతిభావంతుల్ని గుర్తిస్తుంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.