/telugu/photo-gallery/how-to-make-easy-and-delicious-bakery-style-plum-cake-here-pr-ocess-of-making-rv-187168 Plum Cake: క్రిస్మస్‌కు ఇంట్లోనే ప్లమ్‌ కేక్ చేసుకుందాం.. తయారీ విధానం ఇలా Plum Cake: క్రిస్మస్‌కు ఇంట్లోనే ప్లమ్‌ కేక్ చేసుకుందాం.. తయారీ విధానం ఇలా 187168

vinaro bhagyamu vishnu katha Review కిరణ్ అబ్బవరం సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూనే వస్తున్నాయి. రాజా వారు రాణి వారు అనే సినిమా తప్పా ఇంకో పెద్ద హిట్ పడలేదు అతని ఖాతాలో. కరోనా టైంలో వచ్చిన ఎస్ఆర్ కళ్యాణమండపం కమర్షియల్ హిట్ అయింది. ఇక మళ్లీ ఇంత వరకు హిట్ కొట్టలేకపోయాడు. ఇప్పుడు వినరో భాగ్యము విష్ణు కథ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా కథ, కథనాలు ఏంటి? ఎలా ఉందనేది ఓ సారి చూద్దాం.

కథ
చిన్నప్పుడే తల్లి తండ్రిని పోగొట్టుకున్న విష్ణు (కిరణ్ అబ్బవరం) తాత పెంపకంలో పెరుగుతాడు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనే సామెతను బాగా వంట పట్టించుకుని చిన్ననాటి నుంచి తన చుట్టుపక్కల వారికి కూడా సహాయపడుతూ ఉంటాడు. అలాంటి విష్ణు జీవితంలోకి నెంబర్ నైబర్ అనే కాన్సెప్ట్ తో ప్రవేశిస్తుంది దర్శన(కాశ్మీరీ పరదేశి). ఆమె యూట్యూబ్ ఛానల్ క్రేజ్ కోసం నెంబర్ నైబర్ అనే కాన్సెప్ట్ కోసం విష్ణుతో పాటు శర్మ (మురళీ శర్మ)ను కూడా కలిసి వీడియోస్ చేస్తూ ఉంటుంది.  అయితే శర్మ చెప్పిన ఒక మాటను సీరియస్‌గా తీసుకొని లైవ్ మర్డర్ ప్రాంక్ చేయాలని భావించి సదరు ప్రాంక్ చేయగా అందులో నిజంగానే శర్మ మరణిస్తాడు. దీంతో దర్శన జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తాను ప్రేమించిన దర్శన జైలుకు వెళితే విష్ణు ఏం చేశాడు? దర్శన నిజంగానే శర్మను షూట్ చేసిందా? అసలు విష్ణు దర్శనను కాపాడి బయటకు తీసుకు వచ్చాడా? అనేవి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు
విష్ణు పాత్రలో కిరణ్ అబ్బవరం మన పక్కింటి కుర్రాడిలా సహజంగా నటించాడు. ఎమోషనల్ సీన్స్ బాగానే చేశాడు. ఇక ఫైట్స్ విషయంలో కాస్త ఎక్కువ మోతాదులా అనిపిస్తుంది. దర్శనగా కాశ్మీర పర్వాలేదనిపిస్తుంది. అందం, నటన ఇలా అన్నింట్లో ఓకే అనిపిస్తుంది. మురళీ శర్మ మాత్రం అందరినీ నవ్వించేస్తాడు. ప్రథమార్థంలో ఒక మురళీ శర్మను చూస్తే ద్వితీయార్థంలో ఇంకో యాంగిల్‌ను చూపించారు. మురళీ శర్మ ఓవరాల్‌గా అదరగొట్టేశాడనిపిస్తుంది. శ్రీనివాసులు పాత్రలో శుభలేఖ సుధాకర్, రాజన్‌గా శరత్‌ లోహితన్య ఇలా అందరూ కూడా తమ తమ పరిధి మేరకు నటించేశారు.

విశ్లేషణ
పక్క నంబర్‌కు ఫోన్ చేసి పరిచయం పెంచుకోవడం అనే పాయింట్ ఈ సినిమాను మలుపు తిప్పుతుంది. పాయింట్ వినడానికి కొత్తగా అనినిస్తుంది. ఆ పాయింట్ చుట్టూ కథ ఎలా తిరిగింది.. నైబర్ నంబర్‌కు ఫోన్ చేయడం వల్ల ఏం జరిగింది అనే పాయింట్‌ను బాగానే ఉపయోగించుకున్నాడు. ఈక్రమంలో రాసుకున్న కథనం, చివర్లో ఇచ్చిన ట్విస్ట్‌ బాగుంటుంది. అయితే ప్రథమార్థం ఎంటర్టైన్‌గా అనిపిస్తుంది. మురళీ శర్మ, కాశ్మీరి ట్రాక్ అందరినీ నవ్విస్తుంటుంది. అలా ఇంటర్వెల్ కార్డ్‌తో ఓ ట్విస్ట్‌ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరుస్తారు.

ద్వితీయార్థంలో కథ కొన్ని చోట్ల సిల్లీగా అనిపిస్తుంది. ఇంకొన్ని చోట్ల నత్తనడకన సాగుతుంది. నైబర్ నంబర్‌ కాన్సెప్ట్ దేశ విదేశాలకు చేరుకుంటుంది. ఇవన్నీ కాస్త సిల్లీగా అనిపిస్తాయి. లాజిక్‌కు దూరంగా కనిపిస్తాయి. కానీ సినిమా ఫ్లోలో అవన్నీ ఓకే అనిపిస్తాయి. చివర్లో ఇచ్చిన ట్విస్ట్ సినిమాకు బూస్ట్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. ఈ విషయంలో దర్శకుడు మెప్పిస్తాడు. ఇక సీక్వెల్ పార్ట్ కోసం లైన్‌ కూడా రెడీ చేసుకున్నట్టుగానే అనిపిస్తుంది.

ఈ సినిమాలో డైలాగ్స్ చాలా చోట్ల చప్పట్లు కొట్టిస్తాయి. కొన్ని చోట్ల ఉపన్యాసం, ప్రవచనాల్లా అనిపించినా కూడా అందరినీ మెప్పిస్తాయి. పాటలు పర్వాలేదనిపిస్తాయి. ఇక ఆర్ఆర్ మాత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. యాక్షన్ సీక్వెన్స్‌లో అయితే అవసరానికి మించి కొట్టినట్టుగా అనిపిస్తుంది. ఎడిటింగ్‌, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇలా అన్నీ కూడా చక్కగా కుదిరాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

రేటింగ్ : 2.75

చివరగా .. వినరో (చూడరో) భాగ్యము విష్ణు కథ

Also Read:  Aditya Roy Kapoor Lady Fan : మీద మీదకు వచ్చి ముద్దు పెట్టబోయిన ఆంటీ.. స్టార్ హీరో పరిస్థితి ఎలా అయిందంటే?

Also Read: Samantha Ruth Prabhu on Rana : ఆగలేకపోతోన్నా!.. వెంకీమామా, రానాలపై సమంత ప్రేమ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Section: 
English Title: 
vinaro bhagyamu vishnu katha Movie Review and Rating
News Source: 
Home Title: 

vinaro bhagyamu vishnu katha Review : వినరో భాగ్యము విష్ణు కథ రివ్యూ.. కిరణ్ అబ్బవరం పాస్ అయ్యాడోచ్

vinaro bhagyamu vishnu katha Review : వినరో భాగ్యము విష్ణు కథ రివ్యూ.. కిరణ్ అబ్బవరం పాస్ అయ్యాడోచ్
Caption: 
kiran Abbavaram (source : Twitter)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

థియేటర్లో వినరో భాగ్యము విష్ణు కథ

సక్సెస్ కొట్టేందుకు వచ్చిన కిరణ్ అబ్బవరం

కథ, కథనాలు ఏంటంటే?

Mobile Title: 
vinaro bhagyamu vishnu katha Review : వినరో భాగ్యము విష్ణు కథ రివ్యూ
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Friday, February 17, 2023 - 23:12
Request Count: 
113
Is Breaking News: 
No