Kushi Collection Day 1: బాక్సాఫీస్ వ‌ద్ద భారీ ఓపెనింగ్స్ రాబట్టిన 'ఖుషి'.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

Kushi Movie: విజ‌య్ దేవ‌ర‌కొండ, సమంత కాంబోలో తెరకెక్కిన సినిమా ఖుషి. తొలి రోజు పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ మూవీ ఫస్ట్ డే ఎంత వసూలు చేసిందంటే..  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 2, 2023, 04:09 PM IST
Kushi Collection Day 1: బాక్సాఫీస్ వ‌ద్ద భారీ ఓపెనింగ్స్ రాబట్టిన 'ఖుషి'.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

Kushi box office collection day 1: విజ‌య్ దేవ‌ర‌కొండ నయా మూవీ 'ఖుషి'(Kushi Movie). శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత హీరోయిన్ గా నటించింది. సెప్టెంబరు 01న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో తొలి రోజు ఊహించని కలెక్షన్లను సాధించింది. విజయ్ కెరీర్‌లో మెుదటి రోజు అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన సినిమాగా ఇది నిలిచింది. మెుత్తంగా ఈ మూవీ ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా 27 కోట్ల గ్రాస్‌ను, 16 కోట్ల షేర్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు వెల్లడించాయి. తెలుగు రాష్ట్రాల్లో 15 కోట్ల 90 ల‌క్ష‌ల గ్రాస్‌ను, 10 కోట్ల‌కు వ‌ర‌కు షేర్‌ కలెక్షన్స్ ను ఖుషి మూవీ కొల్లగొట్టింది. ఈ చిత్రానికి అత్య‌ధికంగా నైజాం ఏరియాలో ఐదున్న‌ర కోట్ల క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. ఓవ‌ర్‌సీస్‌లో నాలుగున్న‌ర కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. 

ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. 53 కోట్లుగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఉండగా.. 52 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం. వీకెండ్ కావడంతో మూవీ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ మూవీలో విజయ్, సామ్ కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు హీష‌మ్ అబ్దుల్ వ‌హాబ్ సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రంలో జయారం, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కుటుంబ కట్టుబాట్లను, ఆచారాలను ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట కథతో ఖుషి మూవీని తెరకెక్కించాడు శివనిర్వాణ. 'లైగర్' డిజాస్టర్ తర్వాత ఈ మూవీతో విజయ్ సాలిడ్ హిట్ కొట్టాడు.

Also Read: Bhagavanth kesari: 'భగవంత్ కేసరి' ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. మాస్ స్టెప్పులతో ఇరగదీసిన బాలయ్య, శ్రీలీల..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News