Actor Sarath Babu Hospitalised: వరుసగా సినీ ప్రముఖులు అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ పాలవుతున్న ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లోని టాప్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన ఎర్నేని నవీన్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. గురువారం రాత్రి ఆయనకు ఆరోగ్య సమస్యలు ఒక్కసారిగా తలెత్తడంతో కుటుంబ సభ్యుల దగ్గరలోనే ఉన్న ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.
ఆయనకు హైబీపీ రావడంతో ఒక్కసారిగా అస్వస్థతకు గురైనట్లుగా డాక్టర్లు వెల్లడించారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. తాజాగా సీనియర్ నటుడు శరత్ బాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. నిజానికి కొంతకాలంగా శరత్ బాబు అనారోగ్య సమస్యలతో అస్వస్థత నేపథ్యంలో బెంగళూరులోనే ప్రైవేట్ హాస్పిటల్లో ఐసీయూలో ఉండే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే బెంగళూరు ఆసుపత్రిలో ఆయన కొంతవరకు కోలుకున్నారని మెరుగైన చికిత్స కోసం ఆయనను హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ కి తరలిస్తే బాగుంటుందని తెలియడంతో హైదరాబాద్ తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లు ప్రత్యేక కేర్ తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇక ఆయనను ఐసీయూ నుంచి జనరల్ వార్డ్ లోనికి షిఫ్ట్ చేశామని కూడా డాక్టర్లు వెల్లడించారు. ఇక ఆయన అనారోగ్య విషయం తెలిసిన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉండగా ప్రస్తుతానికి జనరల్ రూమ్ కి షిఫ్ట్ చేశారని వార్త తెలిసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక దక్షిణాదిలో దాదాపు అన్ని భాషల్లోనూ శరత్ బాబు నటించారు. తెలుగు సినిమాలతో నటన ప్రస్థానం మొదలు పెట్టి తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్లో శరత్ బాబు అనేక లీడ్ క్యారెక్టర్లు చేశారు. 1973 వ సంవత్సరంలో సినీ రంగ ప్రవేశం చేసిన శరత్ బాబు ఇప్పటివరకు దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. 1981, 88, 89 సంవత్సరాల్లో మూడు సార్లు ఉత్తమ సహాయం అందుకున్నారు. ప్రస్తుతానికి నరేష్ పవిత్ర జంటగా నటిస్తున్న మళ్లీ పెళ్లి అనే సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారని చెబుతున్నారు. ఈ అంశానికి సంబంధించిన క్లారిటీ అయితే రావాల్సి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook