Sankranthiki Vasthunam Box Office Collections: విక్టరీ వెంకటేష్ నటించిన తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాని డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ముఖ్యంగా కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ మూవీగా వచ్చిన ఈ సినిమా సంక్రాంతికి మంచి విజయాన్ని అందుకుంది. థియేటర్ లో నవ్వులు పూయిస్తున్న ఈ సినిమా మొదటి రోజు.. నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.
ఇప్పటికే ఈ సినిమా విడుదలై రెండు వారాలు.. అవుతున్నప్పటికీ.. బాక్స్ ఆఫీస్ దగ్గర.. ఈ సినిమా హవా ఇంకా తగ్గడం లేదు. రోజుకొక సరికొత్త రికార్డులతో దూసుకుపోతున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇప్పుడు తాజాగా బాహుబలి 2 రికార్డులను బ్రేక్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా 13వ రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే.. రూ.6.77 కోట్లు షేర్ చేయగా.. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 సినిమా విడుదలై 13 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 6.77 కోట్ల షేర్ కంటే తక్కువ కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది.
దీంతో ఈ చిత్రం పైన వెంకటేష్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు సంక్రాంతికి వస్తున్నాం సినిమా 276 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని రాబట్టిందట. అందుకు సంబంధించి చిత్ర బృందం అధికారికంగా ఒక పోస్టర్ ద్వారా తెలిపింది. దీన్నిబట్టి చూస్తూ ఉంటే మరో రెండు మూడు రోజులలో రూ 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను కూడా రాబట్టబోతోంది. మొదటి రోజే నాలుగైదు కోట్ల రూపాయల గ్లాస్ కలెక్షన్స్ రాబట్టి వెంకటేష్ కెరియర్ లోనే అత్యధికంగా కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. వెంకటేష్ కు జోడీగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ అద్భుతంగా నటించారు. మొత్తానికి వెంకటేష్ భారీ బ్లాక్ బాస్టర్ని ఈ ఏడాది అందుకున్నారని చెప్పవచ్చు.
Also Read: Supreme Court: వైఎస్ జగన్‌కు బిగ్ రిలీఫ్ ఆర్ఆర్ఆర్ పిటీషన్ కొట్టివేసిన సుప్రీంకోర్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి