Sankranthi releases 2025: సందేహాలు కలిగిస్తున్న పెద్ద సినిమాలు.. వర్కౌట్ అయ్యేనా..?

Upcoming Telugu movies 2025: ప్రస్తుతం తెలుగులో రాబోతున్న భారీ బడ్జెట్ సినిమాలు అన్నీ కూడా.. ప్రేక్షకులకు ఎన్నో అనుమానాలను తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా పుష్ప2, గేమ్ చేంజర్, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలు సైతం.. కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాయి. మరి ఆ పరిస్థితులు ఏమిటో ఒకసారి చూద్దాం.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Oct 15, 2024, 09:10 AM IST
Sankranthi releases 2025: సందేహాలు కలిగిస్తున్న పెద్ద సినిమాలు.. వర్కౌట్ అయ్యేనా..?

Telugu big budget movies 2025:  2025వ సంవత్సరం ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడానికి సంక్రాంతి పండుగను పెద్ద సినిమాలు ఎంచుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ప్రభాస్, రామ్ చరణ్ , చిరంజీవి, అల్లు అర్జున్,  పవన్ కళ్యాణ్ ఇలా చాలామంది పెద్ద హీరోలు తమ సినిమాలను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇకపోతే ఒకప్పుడు ఆ సినిమాలపై మంచి అంచనాలు ఉండగా.. ఇప్పుడు అదే అంచనాలు కాస్త అనుమానాలుగా మారిపోయాయి. మరి ఈ హీరోలు సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని.‌ అందుకుంటారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 

అసలు విషయంలోకి వెళితే,  డిసెంబర్లో పుష్ప 2 విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.  అయితే పవన్ కళ్యాణ్ -  అల్లు అర్జున్ మధ్య విభేదాలు అంటూ అభిమానులు గొడవ పడుతున్న నేపథ్యంలో ఈ ప్రభావం పుష్ప 2 మీద పడే అవకాశం కనిపిస్తోంది.

ఇక రామ్ చరణ్ గత కొన్ని సంవత్సరాల క్రితం గేమ్ ఛేంజర్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్నానంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు శంకర్ ఇండియన్ 2 సినిమా పరాజయం కావడంతో గేమ్ ఛేంజర్ పై అంచనాలు కోల్పోతున్నారు అభిమానులు. దీనికి తోడు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు , పోస్టర్ అన్నీ కూడా సినిమాపై అంచనాలను పెంచలేకపోయాయి. ఇక డిసెంబర్ లోనే విడుదల కావాల్సిన ఈ సినిమా 2025 జనవరి 10వ తేదీన సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. 

ఇక పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా 2019లోనే ప్రకటించినా.. ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ పూర్తికాలేదు.  క్రిష్ దర్శకత్వంలో ఏఎం రత్నం నిర్మించనున్న  ఈ సినిమా మొదట స్ట్రెయిట్ ఫిలిం గా గుర్తించబడి అత్యంత హైప్ అందుకుంది. కానీ  దర్శకుడు ఈ ప్రాజెక్టును వదులుకోవడంతో ఏం రత్నం కొడుకు బాధ్యతలు స్వీకరించారు.. ఇక వచ్చే ఏడాది మార్చి 28వ తేదీన విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. క్రిష్ తప్పుకోవడంతో అంచనాలు కూడా తగ్గిపోయాయి. 

ఇక మరొకవైపు ప్రభాస్ రాబోయే చిత్రం రాజా సాబ్. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ స్థాయిలో ఆశలు పెట్టుకున్నారు. కానీ గత కొన్ని సినిమాలు డిజాస్టర్లు కావడం ముఖ్యంగా పక్కా కమర్షియల్ కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఇలాంటి సినిమా ఎందుకు అంగీకరించాడు అంటూ ఒక వర్గం అభిమానులు ప్రభాస్ ను ప్రశ్నిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. 

అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా విశ్వంభర సినిమాను విడుదల చేయబోతున్నారు. అంజి సినిమా తర్వాత ఆధ్యాత్మిక శైలికి మళ్ళీ తిరిగి రావడం ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగిస్తున్నా.. నిన్న విడుదలైన టీజర్ మాత్రం ప్రేక్షకులలో నిరాశ మిగిల్చింది. ఈ చిత్రాన్ని మేలో విడుదల చేయాలని భావిస్తున్నారట. ఏదిఏమైనా ఒకప్పుడు చాలా ఆశాజనకంగా కనిపించిన భారీ ప్రాజెక్టులు ఇప్పుడు రిస్క్ గా కనిపించడం గమనార్హం.

Read more: Chiranjeevi: అది మా బాధ్యత.. చంద్రబాబు పెట్టిన పోస్ట్‌కు మెగాస్టార్ సంచలన రిప్లై.. మాములుగా లేదుగా..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News