Mangai: బోల్డ్ చిత్రంలో అలాంటి పాత్ర.. నా భర్త వల్ల చేశా: హీరోయిన్

Bold Movie: పెళ్లయితే హీరోయిన్స్ కి ఛాన్సులు రావు అనేది ఒకప్పటి మాట. ప్రస్తుతం పెళ్లయిన తర్వాత కూడా ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక హీరోయిన్ పెళ్లయిన తర్వాత తాను నటిస్తున్న బోల్డ్ సినిమా గురించి అలానే తన భర్త గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి..

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 5, 2024, 09:00 AM IST
Mangai: బోల్డ్ చిత్రంలో అలాంటి పాత్ర.. నా భర్త వల్ల చేశా: హీరోయిన్

Anandi: హీరోయిన్స్ కి పెళ్లి అయిపోతే సినిమా ఛాన్సులు రావడం తగ్గిపోతాయని చాలామంది అనుకునేవారు. కానీ ప్రస్తుత తరంలో ఆ ఆలోచన పూర్తిగా మరుగున పడిపోయింది. సమంతా, కాజల్ లాంటి వారు పెళ్లయిన తర్వాత కూడా సినిమాల్లో రాణిస్తున్నారు. కానీ పెళ్లయిన తర్వాత హీరోయిన్ లకు రిస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల వాళ్లు కొన్ని సినిమాలు ఒప్పుకోరు అని అందరి ఉద్దేశం. ముఖ్యంగా పెళ్లయిన హీరోయిన్స్.. భర్త ఫీల్ అవుతారని కొన్ని సన్నివేశాలు చేయరు. కొన్ని సినిమాల్లో అయితే అస్సలు నటించారు. కానీ కొంతమంది మాత్రం ఇలాంటివి ఏవి పట్టించుకోరు. హీరోయిన్ ఆనంది కూడా ఇప్పుడు ఇదే దారి ఫాలో అవుతోంది. 

సమాజానికి సందేశాన్నిస్తూ, కాస్త బోల్డ్ గా తెరకెక్కిన సినిమాలో నటించడానికి సై అనేసింది ఈ పెళ్లయిన హీరోయిన్. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఇలాంటి బోల్డ్ సినిమాలో నటించడానికి తన భర్త కారణం అంటోంది ఆనంది. 

అసలు విషయానికి వస్తే ప్రస్తుతం ఆనంది నటిస్తున్న చిత్రం మంగై. మంగై అంటే పడుచు పిల్ల అని అర్థం. మున్నార్ నుంచి చెన్నైకి ఒంటరిగా ప్రయాణిస్తున్న ఓ పడుచు అమ్మాయి తన ప్రయాణంలో, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది.. ఆమెకు వచ్చిన సమస్యలు ఏంటనేది ఈ సినిమా కథ. ఒక అమ్మాయిని.. మగాడు చూసే కోణంలో ఈ సినిమా ఉంటుందని మేకర్స్ ఈ చిత్రం ప్రారంభమైన దగ్గర నుంచి చెబుతూ వస్తున్నారు. 

ఇక ఈ మధ్య విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా ఇదే విషయాన్ని తెలియజేసింది. సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ తోనే స్టోరీ ఏంటనేది చాలామందికి అర్థమైంది. ఓ అందమైన అమ్మాయి పెదవులు, కళ్ళు, ఇతర శరీర భాగాల్ని అబ్బాయిలందరూ మొబైల్ ఫోన్ పట్టుకొని ఫొటో తీస్తున్నట్టుగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు ఈ సినిమా మేకర్స్. 

రెగ్యులర్ హీరోయిన్ పాత్రలు కాకుండా, మంచి సినిమాలు మంచి పాత్రలు.. ఎంచుకుంటూ ఉంటుంది హీరోయిన్ ఆనంది. బస్ స్టాప్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరోయిన్ ఆ తరువాత  జాంబీరెడ్డి,  శ్రీదేవి సోడా సెంటర్ లాంటి సినిమాల్లో నటించింది. తమిళంలో కూడా ఈ హీరోయిన్ కి మంచి పేరు ఉంది. కాగా ఈ తమిళ సినిమా మంగై తనకు మంచి గుర్తింపు తెచ్చిపెడుతుందని.. అయితే ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం తన భర్త అని చెప్పుకొచ్చింది ఈ హీరోయిన్. 

ఈమధ్య ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆనంది ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "స్క్రిప్ట్ విన్న తర్వాత అసలు ఈ సినిమా చేయకూడదని అనుకున్నాను. ఎందుకంటే, ఈ చిత్రంలో చాలా షాకింగ్ విషయాలున్నాయి. బోల్డ్ డైలాగ్స్ కూడా చాలానే ఉన్నాయి. ఇవన్నీ ప్రేక్షకులకు విజ్ఞానాన్ని అందించేవే అయినప్పటికీ నేను ఈ చిత్రం బోల్ట్ కంటెంట్ వల్ల నటించకూడదని అనుకున్నాను. కానీ నా భర్త ఈ సినిమా చెయ్యమని ప్రోత్సహించారు. ఓ నటిగా ఆలోచించమని చెప్పారు. ఆయన ప్రోత్సాహంతో కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి మరీ ఈ సినిమా చేశాను.” అని అసలు విషయం బయట పెట్టింది ఈ హీరోయిన్.

మరి ఈ సినిమా తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యి రిలీజ్ అవుతుందో లేదో చూడాలి. 

Also Read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

Also Read: PM Modi: లక్షదీవుల్లో ప్రధాని మోదీ స్నార్కెలింగ్‌ సాహసం.. నెట్టింట పిక్స్ వైరల్‌

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News