Venu Swamy Controversy: నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుంటారు.. అని జ్యోతిష్యం చెప్పడంతో పాపులర్ అయ్యాడు వేణు స్వామి. అయితే ఏదో ఒక్కటి జరిగింది కదా అని.. ఇక సినిమా వారి గురించి మొత్తం ఆయనకే తెలుసు అన్నట్టు.. ఇష్టం వచ్చినట్టు.. సెలబ్రిటీల గురించి చెబుతూ పలు వీడియోలు విడుదల చేశారు. గత కొద్దికాలం కిందట.. అసలు ప్రభాస్ కు ఇక విజయాలే రావు అంటూ కూడా జ్యోతిష్యం చెప్పాడు. ఇక ఈ మధ్య విడుదలైన కల్కి సినిమా బ్లాక్ బస్టర్ సాధించాడు తో.. ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో వేణు స్వామి పై విమర్శలు చేశారు.
అయినా వేణు స్వామి ఏమాత్రం మారలేదు…సెలబ్రిటీలపై ఇంకా జాతకాలు చెబుతూనే ఉన్నారు. ఈ మధ్య జరిగిన అక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాళ ఎంగేజ్మెంట్ రోజున.. వారి జాతకాలను విశ్లేషణ చేస్తూ.. వీరిద్దరు కూడా ఇంకో మూడు సంవత్సరాల్లో విడిపోతారు అని.. అది కూడా ఒక అమ్మాయి వల్ల అంటూ ఒక వీడియో విడుదల చేశారు. అసలు ఇలా సెలబ్రిటీల పర్సనల్ విషయాలు.. నలుగురిలో మాట్లాడకూడదు అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా.. తన ఇష్టం వచ్చినట్టు వీడియోలు షేర్ చేస్తూ ఉన్నారు. సినీ సెలబ్రిటీలపైనే కాకుండా కొంతమంది పొలిటికల్ వారి పైన కూడా.. పలుమార్లు ఇలా జాతకాలు చెప్పాడు వేణు స్వామి.
ఇక వీటిపై స్పందిస్తూ..తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్.. కలిసి తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ శ్రీమతి నీరెళ్ల శారద గారికి.. వేణు స్వామి పై పిర్యాదు చేసారు.
ఈ విషయం పై స్పందించిన ఛైర్ పర్సన్ శ్రీమతి నీరెళ్ల శారద గారు.. వేణుస్వామి పైన అలానే అతని జాతకాలను టెలికాస్ట్ చేసిన యూట్యూబ్ చానల్స్ పైన తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా వేణు స్వామిని పిలిపించి.. వీటి పైన వివరణ కూడా అడుగుతామని తెలియజేశారు..
ఈ కార్యక్రమంలో.. తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ అసోసియేషన్ ప్రెసిడెంట్
లక్షినారాయణ, జనరల్ సెక్రటరీ వై.జె.రాంబాబు,
ట్రైజరర్ సురేంద్ర కుమార్ నాయుడుతో పాటు తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ నుండి ప్రెసిడెంట్ ప్రేమమాలిని వనం, మెంబెర్స్ సువర్ణ, సెక్రటరీ వేదుల మూర్తి తదితరులు పాల్గొన్నారు..
Also Read: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..
Also Read: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter