Trinadha Rao Nakkina’s Controversy: టాలీవుడ్‌లో తన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్‌తో పేరు తెచ్చుకున్న దర్శకుడు త్రినాథరావు నక్కిన. ఈ దర్శకుడు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. అలాంటి దర్శకుడికి, ఎవరితో ఎలా మాట్లాడాలి, హీరోయిన్ల గురించి ఏమి చెప్పాలి, ఏ సందర్భంలో ఏమి మాట్లాడాలో తెలుసుకోవడం..అనేది తప్పదని చెప్పవచ్చు. కానీ ఈ దర్శకుడు మాత్రం కొన్నిసార్లు.. విభిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటారు అనేది ఎంతో మంది వాదన. ఇక ఇలానే.. ఇటీవల ఓ ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు.. కొంతమందికి ఇబ్బందికరంగా మారాయి.
ఈ మధ్య జరిగిన 'మజాకా' సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఈ దర్శకులు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెద్ద దుమారం రేపుతున్నాయి. ఇందులో హీరో సందీప్ కిషన్, హీరోయిన్లు రీతూ వర్మ.. కాగా ..అన్షు, రావు రమేశ్ ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమా సంక్రాంతి సీజన్లో రిలీజ్ అవ్వాల్సి ఉన్నప్పటికీ, సంక్రాంతికి ఎన్నో సినిమాలు రిలీజ్ లు ఉండటంతో.. విడుదల కుదరలేదు. కానీ, ట్రైలర్ రిలీజ్ చేశారు ఈ చిత్ర యూనిట్. ఇక ఈ ఈవెంట్‌లో త్రినాథరావు నక్కిన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
త్రినాథరావు మాట్లాడుతూ, "అన్షు లాంటి హీరోయిన్ని నేను చిన్నప్పుడే చూసాను. 'మన్మథుడు' సినిమాలో ఆమెని చూసి, ఆ అమ్మాయి లడ్డూలా ఉందని అనుకున్నాను. ఇప్పటికీ ఆమె అలానే ఉందా? కొంచెం సన్నబడ్డారు. కొంచెం తినండి. ఇక్కడ అన్నీ కొంచెం ఎక్కువ.. ఉండాలి అని చెప్పాను. ఫర్లేదు కొంచెం ఇంప్రూవ్ అయింది. నెక్ట్స్ టైమ్ ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది,” అని చెప్పుకొచ్చారు ఈ దర్శకుడు. ఇక ఈ వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతమె ఎంతో మందిని ఆగ్రహానికి గురి చేస్తున్నాయి.
ఈ క్రమంలో ఇప్పుడు ఈ విషయంపై.. మహిళా కమిషన్ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినిమా డైరెక్టర్ నక్కిన త్రినాథ రావు వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్నా మీరు తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరేళ్ళ శారదా. త్రినాథ రావు వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్..త్రినాథ రావు కు త్వరలోనే నోటీసు జారీ చేస్తాం అని తెలిపారు.
హీరోయిన్ అన్షూ పై త్రినాథ రావు.. చేసిన వ్యాఖ్యలపై చాలా సీరియస్ అయిన మహిళా కమిషన్ చైర్మన్ నేరేళ్ళ శారదా త్వరలోనే ఆయనపై కేసు వేయనున్నట్లు తెలుస్తోంది.
మరి ఈ వివాదం ఇంకెంత దూరం పోతుందో.. అలానే ఇప్పటికన్నా ఈ దర్శకుడు ఇలా మాట్లాడుకోవడం తగ్గించుకుంటారో లేదో చూడాలి.
Also Read: Kateri Halwa: సంక్రాంతి స్పెషల్.. అందరు తప్పకుండా తినే కాటేరీ హల్వా ఇలా ఈజీగా చేసుకొవచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.