Sankranthi Releases 2024: కొత్త సంవత్సరం లో సంక్రాంతి పండుగ మరింత రంజుగా మారబోతుంది. పండగకు పోటా పోటీగా సినిమాలు తగ్గేదే లేదు అన్నట్టు బాక్స్ ఆఫీస్ వద్ద తలపడడానికి సిద్ధంగా ఉన్నాయి. అగ్ర హీరోల సినిమాలతో పాటుగా చిన్న హీరో తేజ సజ్జా హనుమాన్ మూవీ కూడా ఈసారి సంక్రాంతి బరిలో దిగుతోంది. ఎప్పటికప్పుడు ప్రమోషన్స్ తో యాక్టివ్ గా ఉన్న ఈ చిత్ర బృందం ఇప్పటికే మూవీ పై మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఒకవైపు సోషల్ మీడియా హ్యాండిల్స్ లో క్రేజీ అప్డేట్స్ ఇస్తూ మరోపక్క ఇంటర్వ్యూలతో హోరెత్తిచేస్తోంది హనుమాన్ టీమ్.
చిన్న సినిమా అయినా ప్రమోషన్ లకు సంబంధించిన ఈవెంట్లను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ చిత్రంపై ఓ రేంజ్ ఆసక్తిని కలిగించింది. కానీ ఈ చిత్రం జనవరి 12న గుంటూరు కారంతో పోటీగా బరిలోకి దిగడం పై సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్ జరుగుతుంది. మహేష్ బాబు తాకిడి తట్టుకునే కెపాసిటీ ఈ ఫాంటసీ మూవీకి లేదు అనేది కొంతమంది అభిప్రాయం. ఈ విషయాన్ని చిత్ర బృందం కూడా గమనించారో ఏమో తెలియదు కానీ.. మొత్తం పైన పోటీ తట్టుకోవడానికి సరికొత్త వ్యూహంతో రెడీ అవుతున్నారు. మరి ఆ ప్లాన్ ఏమిటో ఒకసారి చూద్దాం.
లేటెస్ట్ గా సినిమాలకు సంబంధించి ప్రీమియం షోల సందడి ఏ రేంజ్ లో ఉందో మన అందరికీ తెలుసు. గత రెండు సంవత్సరాలుగా చాలా సినిమాలు ముందు రోజు సాయంత్రం లేదా రాత్రి.. ప్రీమియం షోల పేరట షోలు వేయడం.. వాటి ద్వారా లబ్ధి పొందడం కామన్ అయిపోయింది. అయితే ఈసారి హనుమాన్ చిత్రం ఈ ట్రెండ్ ను మరింత వినూత్నంగా ఉపయోగించుకోబోతోంది. హనుమాన్ మూవీ కి ప్రస్తుతం ఉన్న మార్కెట్ క్రేజ్ ను అనుసరించి జనవరి 10 రాత్రికే షో వేస్తే ప్రేక్షకులు కచ్చితంగా ఎగబడి వస్తారు. ఎలాగో నెక్స్ట్ డే మహేష్ బాబు డామినేషన్ ఉంటుంది కాబట్టి.. చేసేదేమీ లేదు.
మహేష్ బాబు గుంటూరు కారం విడుదల కావడానికి కన్నా ముందే ఎర్లీ ప్రీమియం వేయడం ద్వారా కనీసం తమ కంటెంట్ ఏ రేంజ్ లో ఉందో ప్రేక్షకులకు రీచ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే హనుమాన్ టీమ్ ఈ పద్ధతి అనుసరించడానికి ఫిక్స్ అయిపోయిందట. వీరు ఆశించినట్లుగానే తమ కంటెంట్ ప్రజలకు నచ్చి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మహేష్ బాబు సినిమా సక్సెస్ అయిన ఎంతో కొంత వీళ్ళకి కూడా వసూళ్లు వస్తాయి. అదృష్టం కొద్ది మహేష్ బాబు సినిమాకి యావరేజ్ టాక్ కానీ వస్తే ఇక హనుమాన్ చిత్రానికి తిరుగులేకుండా పోతుంది.
అందుకే అన్ని క్యాలిక్యులేషన్స్ కరెక్ట్ గా వేసుకున్నాక చిత్ర బృందం ఈ మాస్టర్ గేమ్ మొదలుపెట్టినట్లు అర్థమవుతోంది. అంతేకాదు హైదరాబాదులో వేసే ప్రీమియం షోకు టాలీవుడ్ సెలబ్రిటీస్ ని మొత్తం పిలవాలని అనుకుంటున్నారట. అప్పుడు తాము తమ సోషల్ మీడియా పేజీల్లో వేసే పోస్టుల ద్వారా కూడా ఈ సినిమాకి మంచి ప్రమోషన్ జరుగుతుంది. మొత్తానికి ఈ ఐడియాస్ ద్వారా చిన్న చిత్రమైన గట్టి చిత్రమని నిరూపించుకుంటుంది హనుమాన్. ఇక విడుదల తర్వాత ఎటువంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
Also Read: Ayodhya Rammandir Features: అయోధ్య రామమందిరం ఎలా ఉంటుంది, ప్రత్యేకతలేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter