Srimanthudu- Koratala siva : ఏ సినిమా తీసుకున్న ఏమున్నది గర్వకారణం అన్నట్టు.. ప్రతి సినిమా స్టోరీ వెనక ఎంతో మంది దర్శక, నిర్మాతల మేథోమదనం ఉంటుంది. ఒక వ్యక్తి బుర్రలో పుట్టిన స్టోరీ అతనిదే అని నిరూపించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రీసెంట్‌గా ఓ సినిమా పెద్ద సినిమాను తెరకెక్కించిన దర్శకుడును పక్కన పెట్టి సదరు నిర్మాత ఆ సినిమాను తానే డైరెక్ట్ చేసానంటూ పేరు కూడా వేసుకున్నాడు. పాపం సదరు నిర్మాతపై పోరాడే ఆర్ధిక స్థోమత సహా ఇండస్డ్రీలో అతన్ని సపోర్ట్ చేసే వర్గం గట్రా లేకపోవడంతో అతను లైమ్ లైట్‌లోకి రాలేకపోయాడు. అటు సుమంత్ సత్యం సినిమాలో చూపించనట్టు.. తాను రచించిన కథను వేరే ఎవరో తన పేరు వేసుకున్నట్టు .. శ్రీమంతుడు సినిమా కథ విషయంలో అదే జరిగింది. తాజాగా ఈ సినిమా విషయంలో స్థానిక కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కొరటాల శివ క్రిమినల్ కేసు ఎదుర్కొవాల్సిందేనని స్పష్టం చేయడం సంచలనం రేపింది. పక్కొడి స్టోరీలను దొంగతనం చేసే కొరటాల శివ లాంటి దర్శకులకు ఇది చెంపపెట్టు అని చెప్పాలి. శ్రీమంతుడు సినిమా కథను స్వాతి పత్రికలో ప్రచురించిన స్టోరీ ఆధారంగా కాపీ చేశారని రచయత శరత్ చంద్ర గతంలోనే హైదరాబాద్‌లోని నాంపల్లి క్రిమినల్ కోర్టును ఆశ్రయించారు. ఆయన వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు డైరెక్టర్ కొరటాల శివ కాపీ చౌర్యానికి పాల్పడ్టు నిర్దారణ చేసి అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
నాంపల్లి కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ కొరటాల శివ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. శ్రీమంతుడు సినిమా కథ కాపీ అనే విషయం స్పష్టం చేస్తూ రచయత శరత్ చంద్ర కోర్టుకు తగిన ఆధారాలను కోర్టుకు సమర్పించారు. మరోవైపు శరత్ చంద్ర తన రచనను రచయతల సంఘంలో రిజిస్టర్ చేయించారు. ఈ సందర్బంగా రచయత సంఘం ఇచ్చిన రిపోర్ట్‌ను పరిగణలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు.. నాంపల్లి కోర్టు ఉత్తర్వులను సమర్ధించింది. దీంతో దర్శకుడు కొరటాల శివ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
కొరటాల శివ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాల ధర్మాసనం విచారణ చేపట్టింది. సినిమా రిలీజైన 8 నెలల తర్వాత రైటర్ శరత్ చంద్ర కోర్టును ఆశ్రయించారని చెప్పారు. స్థానిక కోర్టు, హైకోర్టు తమ వాదనలను వినిపించుకోలేదని కొరటాల తరుపునా వకాల్తా పుచ్చుకున్న నిరంజన్ రెడ్డి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. అయితే స్థానిక కోర్టు తీసుకున్న నిర్ణయం సరైనదేననిన తన తీర్పులో స్పష్టం చేస్తూ సుప్రీం తీర్పు ఇచ్చింది. కొరటాల శివ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకొని విచారించాడానికి ఏమి లేదని అపెక్స్ కోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా పిటిషన్‌ను మీరు వెనక్కి తీసుకుంటారా..? తామే పిటిషన్‌ను డిస్మిస్ చేయమంటారా ? అని కోర్టు లాయర్ నిరంజన్ రెడ్డిని ప్రశ్నించింది. ఈ సందర్భంగా తామే పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్టు చెప్పడంతో కోర్టు అందుకు అనుమతి ఇచ్చింది.
శ్రీమంతుడు సినిమా కథ విషయానికొస్తే.. వేల కోట్ల ఆస్తి కలిగిన రవికాంత్ (జగపతి బాబు) కుమారుడు.. హర్షవర్ధన్ (మహేష్ బాబు) తన తండ్రి పుట్టి పెరిగిన దేవరకోట గ్రామాన్ని, అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకొని ఆ గ్రామాన్ని దత్తత తీసుకుంటాడు. ఆ తర్వాత ఆ ఊరిలో హీరోకు ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి ? దాన్ని ఎలా ఎదుర్కొన్నాడనేదే ఈ సినిమా స్టోరీ. ఈ మూవీ 2015లో బాహుబలి 1 తర్వాత సెకండ్ హైయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.
Also read: AP Speaker: ఎమ్మెల్యేలతో స్పీకర్ విచారణ నేడే, అనర్హత వేటు పడేనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook