Sonu Sood: ప్రముఖ నటుడు సోనూ సూద్ మరో అరుదైన గౌరవం.. సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సన్మానం..

Sonu Sood: టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సహా ప్యాన్ ఇండియా చిత్రాల్లో హీరో, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సోనూ సూద్. అప్పట్లో కరోనా సమయంలో ఈయన చేసిన సేవలు దేశ వ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత తన ఛారిటీ ద్వారా పరిమితంగా ఆపన్నులను ఆదుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో సోనూ సూద్ సేవలకు గాను మరో అవార్డు వచ్చి చేరింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 27, 2024, 05:05 AM IST
Sonu Sood: ప్రముఖ  నటుడు సోనూ సూద్  మరో అరుదైన గౌరవం.. సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సన్మానం..

Sonu Sood: సోనూ సూద్ .. ప్యాన్ ఇండియా విలన్ కమ్ హీరో కమ్ క్యారెక్టర్ గా సుపరిచితుడు. తాజాగా సామాజికంగా ఈయన చేస్తోన్న సేవలకు గాను  సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 28వ తేదీన 'సంకల్ప్ దివాస్' కార్యక్రమం జరగనుంది. మానవతావాది, వ్యాపారవేత్త లయన్ డాక్టర్ వై. కిరణ్, ప్రతి  యేడాది నవంబర్ 28న 'సంకల్ప్ దివాస్'ను నిర్వహిస్తున్నారు. అదే ఆనవాయితీని ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నారు.

సమాజ సేవే లక్ష్యంగా 'సుచిరిండియా ఫౌండేషన్'ను నిర్వహిస్తోంది సుచిరిండియా గ్రూప్. ఈ సంస్థ కొన్నేళ్లుగా ఎన్నో గొప్ప సేవా 00 కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో సమాజానికి తమ వంతు సేవ చేస్తుంది. అలాగే సమాజానికి విశేష సేవ చేస్తున్న ప్రముఖులని గుర్తించి, వారిని సత్కర్తించడంలోనూ సుచిరిండియా ఫౌండేషన్ ముందు వరుసలో ఉంది. సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే 'సంకల్ప్ దివాస్'కి ఎంతో  ప్రత్యేకత ఉంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రముఖుల సేవలను గుర్తించి వారిని 'సంకల్ప్ కిరణ్ పురస్కారం'తో సత్కరిస్తూ వస్తున్నారు. దాదాపు 20 యేళ్లుగా  ప్రతి ఏడాది గొప్ప మానవతావాదులను గుర్తించి వారిని సత్కరిస్తున్నారు.

వారిలో అన్నా హజారే, కిరణ్ బేడీ, సుందర్‌లాల్ బహుగుణ, సందీప్ పాండే, జోకిన్ అర్పుతం, మేరీ కోమ్ వంటి ఎందరో ప్రముఖులు ఉన్నారు. ఈ ఇయర్ 'సంకల్ప్ దివాస్'లో ప్రముఖ నటుడు సోనూసూద్ ను 'సంకల్ప్ కిరణ్ పురస్కారం'తో సత్కరించనున్నారు. నవంబర్ 28వ తేదీన సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్, లలితా కళాతోరణంలో భారత్-బల్గేరియా రాయబార కార్యాలయ అంబాసిడర్ హెచ్.ఈ. నికోలాయ్ యాంకోవ్ ఛీఫ్ గెస్ట్ గా  'సంకల్ప్ దివాస్' కార్యక్రమం ఘనంగా జరగనుంది.

లయన్ డాక్టర్ వై. కిరణ్  ప్రతి ఆలోచన, ప్రతి అడుగు సమాజ సేవ గురించే ఉంటుంది. ఆయన ఆలోచన నుంచి పుట్టినదే 'సంకల్ప్ దివాస్'. 'సుచిరిండియా ఫౌండేషన్' తలపెట్టిన 'సంకల్ప్ దివాస్' ప్రోగ్రామ్  యొక్క ముఖ్య ఉద్దేశం.. ఆపదలో ఉన్న వారిని ఆదుకొని, వారికి మంచి జీవితాన్ని ప్రసాదించడమే.  ప్రస్తుతం అన్నార్తులకు  ఆకలిని తీర్చే నిత్యావసర వస్తువులను అందిస్తోంది. దాంతో పాటు  భవిష్యత్ కి బాటలు వేసే వస్తులను అందించడం 'సంకల్ప్ దివస్' చేస్తోంది.

అనాథ పిల్లలను, బాల కార్మికులను, పేద విద్యార్థులను గుర్తించి వారి చదువుకి కావాల్సిన సహాయ సహకారాలను అందించడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశ్యం.ముఖ్యంగా  దివ్యాంగులకు అవసరమైన పరికరాలను అందించి.. వారు వైకల్యాన్ని అధిగమించి జీవితంలో ముందుకు సాగేలా చేయడంతో ముందుంది. ఒంటరి పేద మహిళలకు కుట్టు మిషన్లు లేదా ఇతరత్రా వృత్తుల్లో సహాయం చేస్తోంది.  అలాగే వారు రూపొందించిన వస్తువులు, నేసిన వస్త్రాలను వారే స్వయంగా విక్రయించుకునే విధంగా ఎగ్జిబిషన్ లను వంటివి ఏర్పాటు చేస్తోంది. వారి కాళ్లపై వాళ్లు నిలబడేలా చిరు వ్యాపారులుగా తీర్చిదిద్దుతుంది. ఇలా కేవలం సహాయం చేసి ఊరకోకుండా వారికి అడుగడుగునా అండగా నిలుస్తూ వస్తోంది. అంతేకాదు వారి మెరుగైన జీవితాన్ని అందిస్తుంది సంకల్ప్ దివాస్. అలాగే ప్రముఖుల సేవలను గుర్తించి వారిని సత్కరించడం ద్వారా, సమాజానికి సేవ చేయాలనే ఆలోచనను రేకిత్తిస్తోంది.

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News