Sobhita Movies:
2016 లో వచ్చిన రామన్ రాఘవ్ 2.0 అనే సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ తో శోభిత నటిగా పరిచయం అయింది. అయితే 2017 లో విడుదలైన గూఢచారి చిత్రం ఆమెకు మాంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వచ్చిన మేజర్ మూవీ తో ఈమె ఖాతాలో మరొక భారీ సక్సెస్ నమోదయింది. ఆ తర్వాత పలు రకాల వెబ్ సిరీస్ లు చేసిన ఈ బ్యూటీ తన ఇమేజ్ను అంతకంత పెంచుకుంటూ వచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కు
హాలీవుడ్ సినిమాలలో కూడా ఆఫర్లు వస్తున్నాయి.
మంకీ మాన్ అనే హాలీవుడ్ చిత్రంలో శోభిత నటించిన విషయం తెలిసిందే .ఈ నేపథ్యంలో అభిమానులు ఈ మూవీ కూడా శోభిత ఖాతాలో మరొక సక్సెస్ ను అందిస్తుంది అని ఆశిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభితను ఆమె జీవితానికి నిజమైన అర్థం ఏమిటి అని ప్రశ్నించగా.. తనదైన శైలిలో అద్భుతమైన జవాబుని ఇచ్చింది. శోభిత లైఫ్ లో ఎటువంటి లక్ష్యం ఉండాలి అని అనుకోవడం లేదట.. జీవితం అంటేనే ఒక తీరం నుంచి మరొక తీరం కి వెళ్తూ ఉండే పయనం అంటూ ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మనం జీవితంలో ఏం చేసిన అది మనకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉండాలి.. నాకు పెద్ద పెద్ద లక్ష్యాలు ఏమీ లేవు.. ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న వ్యక్తి లాగా నేను ఉండలేను అని శోభిత అంది. అంతేకాదు చాలా సందర్భాలలో తనకు తెలియకుండానే చాలా విషయాల నుంచి డిస్ కనెక్ట్ అవుతానని ఆమె అంది. జీవితంలో తాను ఎక్కువగా ఆశించేది మాతృత్వం కోసమే అని శోభిత ఎమోషనల్ గా చెప్పింది. నిజానికి అది ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఆ అదొక అద్భుతంగా ఫీలవుతానని ఆమె తెలిపింది.
ఒక బిడ్డకు అమ్మ అవ్వడం.. అమ్మ అని పిలిపించుకోవడం ఎంతో బాగుంటుందని. దానికోసం ఆమె ఎదురు చూస్తోందని శోభిత వెల్లడించిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శోభిత పర్సనల్ లైఫ్ కు సంబంధించి గత కొద్దికాలం గా సోషల్ మీడియాలో ఎన్నో రకాల రూమర్స్ వస్తున్నాయి. నాగచైతన్య, శోభిత ప్రేమలో ఉన్నట్టు అంతేకాకుండా సమంత నాగచైతన్యతో విరిపోవడానికి కారణం కూడా శోభితనే అన్నట్టు ఎన్నో వార్తలు వినిపించాయి. అయితే వాటిని ఆమె బృందం మొదటి నుంచి తీవ్రంగా ఖండిస్తూ వచ్చింది. అయితే నాగచైతన్య, శోభిత ఫోటోలు కూడా కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటి గురించి వీరిద్దరూ కూడా రెస్పాన్స్ అవ్వకపోవడం అప్పట్లో అందరిని ఆశ్చర్యపరిచింది. కాగా ఈ పర్సనల్ విషయాలకు పక్కన పడితే వృత్తిపరంగా మాత్రం ప్రస్తుతం శోభిత వరుస క్రేజీ ఆఫర్లతో బాగా బిజీగా ఉంది.
Also Read: ఒక్క ఎంపీ సీటైనా గెలవండి.. కేటీఆర్‌కు సీఎం రేవంత్ ఓపెన్ ఛాలెంజ్
Also Read: రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకానికి గైడ్ లైన్స్.. అర్హులు మాత్రం వీళ్లే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
నేను కోరుకునేది అదే.. అమ్మ అవ్వాలి అనుకుంటున్నాను.. శోభిత ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు..