Shankar About Game Changer: ఒకప్పుడు దర్శకుడు శంకర్ అంటే.. ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎంతగానో ఇష్టపడేవారు. పాన్ ఇండియా సినిమా అంటే ఏమిటో తెలియక ముందే.. ఈ దర్శకులు తీసిన చిత్రాలు నేషనల్ లెవెల్ లో అన్ని భాషల వారిని అలరించేవి. అయితే ప్రస్తుతం మాత్రం ఈ డైరెక్టర్ టైం బాగోలేదు.
శంకర్ ఈ మధ్య తీసిన సినిమాలు అన్నీ కూడా అపజయాలు చవిచూశాయి. నిజంగా రోబో, శివాజీ తర్వాత శంకర్ తీసిన ఏ సినిమా కూడా విజయం సాధించలేదు. కాగా ఈ మధ్య కమల్ హాసన్ తో శంకర్ తీసిన ఇండియన్ 2 సినిమా ఘోరపరాజయం చవిచూసింది. ఇక సంక్రాంతి సందర్భంగా వచ్చిన..గేమ్ చేంజెర్ పరిస్థితి కూడా ఇలానే ఉంది.
ఈ చిత్రం షూటింగ్ దాదాపు ఐదేళ్లు తీసిన శంకర్.. ఇప్పుడు ఈ సినిమా తనకే నచ్చలేదు అంటూ ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ వదిలారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడొచ్చు శంకర్ ఈ చిత్రం.. తనకు సంతృప్తిని ఇవ్వలేదని తెలియజేశారు.
"గేమ్ ఛేంజర్ చిత్రం ఔట్పుట్తో.. నేను సంతృప్తిగా లేను. ఇంతకంటే.. ఈ సినిమా బాగా చేసుండాల్సింది. నేను అనుకున్న దాని ప్రకారం ఈ సినిమా నిడివి.. దాదాపు 5 గంటల వరకు ఉండాలి. సమయాభావం వల్ల.. చాలా సీన్స్ ట్రిమ్ చేయాల్సి వచ్చింది. దీంతో ఈ చిత్ర కథ నేను అనుకున్న విధంగా రాలేదు" అంటూ శంకర్ చెప్పారు.
కాగా రామ్ చరణ్, ఎస్జే సూర్యలు.. మాత్రం చాలా బాగా నటించారని.. శంకర్ ప్రశంసించారు. ఈ చిత్రం గురించి సోషల్ మీడియాలో వచ్చిన రివ్యూలు తాను చూడలేదని.. మంచి రివ్యూలు వచ్చినట్లు మాత్రం తాను విన్నానన్నారు. కాగా ఇప్పటికే చాలా దగ్గరలో ఈ సినిమా కలెక్షన్స్ పడిపోయిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత..అసలు రామ్ చరణ్ తన కెరీర్లో పీక్ టైమ్‌ని శంకర్‌కి ఇస్తే.. చివరకు ఈ దర్శకుడు ఇలాంటి సినిమా తీశారంటూ మెగా అభిమానుల సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా జరగాల్సిన నష్టం జరిగాక దర్శకుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంలో లాభమేముంది అంటూ ఎంతోమంది నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
ఇదీ చదవండి: Prabhas Marriage: ప్రభాస్ మ్యారేజ్ ఫిక్స్.. డార్లింగ్ చేసుకోబోయేది ఈమెనే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.