Sai Pallavi Sister Pooja Kannan Birthday సాయి పల్లవి తాజాగా ఓ పోస్ట్ వేసింది. సోషల్ మీడియాలో సాయి పల్లవి ఎక్కువ యాక్టివ్‌గా ఉండదన్న సంగతి తెలిసిందే. అయితే సాయి పల్లవి అప్పుడప్పుడు వేసే పోస్టులు, షేర్ చేసే ఫోటోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా సాయి పల్లవి తన చెల్లి పుట్టిన రోజు సందర్భంగా పోస్ట్ వేసింది. తన చెల్లి పూజా కన్నన్ బర్త్ డే సందర్భంగా సాయి పల్లవి ఓ వీడియోను షేర్ చేసింది. అందులో పూజా కన్నన్ చేసిన అల్లరి కనిపిస్తోంది.
హ్యాపీ బర్త్ డే మై మంకీ.. మంచి సోదరి కావాలనే తపనతో, నువ్ నన్ను మంచి మనిషిగా మార్చావ్.. నువ్ నాకు ఎన్నో మంచి విషయాలు నేర్పావ్.. థాంక్యూ చెల్లె.. నువ్వే నా వెలుగు, నా ప్రేమ, నా సంతోషానివి.. ఐ లవ్యూ.. అని సాయి పల్లవి విషెస్ చెబితే..పూజా కన్నన్ ఇలా రిప్లై ఇచ్చింది. ఓ మై గాడ్.. ఐ లవ్యూ సో మచ్.. ఐ మిస్ యూ అంటూ ఎమోషనల్ అయింది.
సాయి పల్లవి స్టార్ హీరోయిన్ అవ్వడంతో సాయి పల్లవి సోదరిగా పూజా కన్నన్ మీద కూడా ప్రేక్షకుల కన్ను పడింది. మేకర్లు సైతం సాయి పల్లవి చెల్లితో సినిమా తీయాలని అనుకున్నారు. అలా పూజా కన్నన్ ఓ సినిమా కూడా చేసింది. కానీ అది అంతగా క్లిక్ అవ్వలేదు. తెలుగులోకి ఆ సినిమాను డబ్ కూడా చేయలేదు. దీంతో పూజ కన్నన్ సినిమాల విషయంలో వెనక్కి తగ్గినట్టు అనిపిస్తోంది.
Also Read: IT Raids on Mythri : మైత్రీ కార్యాలయంలో రెండో రోజూ ఐటీ దాడులు.. వందల కోట్లపై ఆరా
ఇప్పుడు సాయి పల్లవి సినిమా కెరీర్ కూడా అగమ్యగోచరంగా కనిపిస్తోంది. విరాటపర్వం డిజాస్టర్‌గా నిలిచింది. వెన్నెల పాత్రలో సాయి పల్లవి అద్భుతంగా నటించింది. కానీ ఈ సినిమా కమర్షియల్‌గా ఎటువంటి విజయాన్ని కూడా అందుకోలేకపోయింది. సాయి పల్లవి చేసిన గార్గి సినిమాకు ప్రశంసలు దక్కాయి. కానీ కలెక్షన్లు అంతగా రాలేదనిపిస్తోంది. ఇప్పుడు సాయి పల్లవి సినిమాలకు దూరంగా ఉందని తెలుస్తోంది. ఆమె ఏ కథలను కూడా ఎంచుకోవడం లేదని, తన ప్రపంచంలో తాను బతికేస్తోందని సమాచారం అందుతోంది.
Also Read: Mrunal Thakur : 'సీత'ను రొమాంటిక్‌గానే చూడాలనుకుంటున్నారా?.. నెటిజన్ల కోరిక ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Sai Pallavi Sister : నువ్వే నన్ను మనిషిగా మార్చావ్ కోతి.. చెల్లికి సాయి పల్లవి స్పెషల్ విషెస్
నెట్టింట్లో పోస్ట్ వేసిన సాయి పల్లవి
చెల్లెలి బర్త్ డేకు స్పెషల్ విషెస్
సాయి పల్లవిని మిస్ అవుతున్న పూజ