Sai Pallavi Birthday సాయి పల్లవి బర్త్ డే (మే 9) సందర్భంగా సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే సాయి పల్లవి చెల్లి పూజా కన్నన్ తాజాగా ఓ పోస్ట్ వేసింది. ఇందులో తన అక్క మీద ప్రేమను కురిపించింది. ఈ సందర్భంగా పూజ చెప్పిన విషయాలు, వేసిన జోక్స్, అక్క మీద చూపించిన ప్రేమ వైరల్ అవుతోంది. ఇక అక్కతో క్లోజ్‌గా ఉన్న ఫోటోను పూజ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతోంది.
ఈ రోజు నిన్ను మిస్ అవుతున్నాను.. నువ్ నా పక్కనే లేవని, నేను నీ పక్కన లేను.. ఎంతగానో మిస్ అవుతున్నా.. నిన్ను ఇరిటేట్ చేయడం మిస్ అవుతన్నా.. నిన్ను గిచ్చడం, నీ మొహం ఎర్రగా అవ్వడం చూడలేకపోవడం కూడా మిస్ అవుతున్నా.. నీతో కూర్చుని నవ్వుకోవడం మిస్ అవుతున్నాను.. మిస్ యూ.. నా కంటే ముందు పుట్టి..నా మీద పడాల్సిన నిందలను నువ్వు మోస్తున్నందుకు థాంక్స్..
నీ మీద పడుకునే అవకాశం ఇస్తావ్.. దానికి థాంక్యూ.. నీ కోసం నువ్వు తీసుకునే డ్రెస్సులు చివరకు నా కప్ బోర్డులకు వస్తాయ్.. ఈ జోకులన్నీ పక్కన పెట్టేస్తే.. నువ్ నా కోసం చేసిన త్యాగాలను ఎప్పటికీ మరువలేను.. ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను.. నన్ను బాధపెట్టే విషయాల నుంచి ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటున్నందుకు థాంక్స్.. నాలోని బెస్ట్ ఇచ్చేందుకు ఎప్పుడూ నన్ను ప్రోత్సహిస్తూనే ఉంటావ్.. అక్కగా నువ్ నాకు దొరకడం లక్కీ.. ప్రేమకు, స్వచ్చతకు నువ్వే ప్రతిరూపం.. హ్యాపీ బర్త్ డే బెస్ట్ ఫ్రెండ్.. మనం కొన్ని మంచి, డీసెంట్ ఫోటోలను దిగాలి.. అంటూ పూజా కన్నన్ పోస్ట్ వేసింది.
Also Read: Samantha : రాత్రంతా అదే పని.. ఉదయమంతా ఇలా.. సమంత పోస్ట్ వైరల్
ఇక చెల్లి చూపించిన ప్రేమకు సాయి పల్లవి స్పందించింది. ఐ లవ్యూ అంటూ కామెంట్ పెట్టేసింది. సాయి పల్లవి ఇప్పుడు శివ కార్తికేయన్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉంది. అందుకే ఇంట్లో లేనట్టుగా కనిపిస్తోంది. ఇక ఇంట్లో తన అక్క లేదని, బర్త్ డేను దగ్గరగా ఉండి సెలెబ్రేట్ చేసుకోలేకపోతోన్నామని సాయి పల్లవి చెల్లి బాధపడుతున్నట్టుగా ఉంది.
Also Read: Rakul Preet Pics : రకుల్ ప్రీత్ అందాల ప్రదర్శన.. నాభి అందాల విందు.. పిక్స్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
HBD Sai Pallavi : నీ చెల్లిగా పుట్టినందుకు నేను లక్కీ.. మిస్ అవుతున్నా.. సాయి పల్లవి సిస్టర్ స్పెషల్ విషెస్
నెట్టింట్లో సాయి పల్లవి ఫ్యాన్స్ సందడి
లేడీ పవర్ స్టార్ బర్త్ డే స్పెషల్
అక్కపై ప్రేమను కురిపించిన పూజ