Sai Pallavi Sister Engagement Viral Videos: నేచురల్ నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన హీరోయిన్ సాయి పల్లవి. యాక్షన్ తో పాటు సాయి పల్లవి డాన్స్ కూడా ఇరగదీస్తుంది. మరి మాస్ సాంగ్స్ కి సాయి పల్లవి వేసే డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొద్ది కాలంగా సెలెక్టివ్ సినిమాలు చేస్తూ కాస్త బ్రేక్ తీసుకుంటున్న సాయి పల్లవి ఇంట్లో పెళ్లి భాజలు మోగుతున్నాయి. సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్ రీసెంట్ గా సోషల్ మీడియాలో తనకు కాబోయే భర్తను పరిచయం చేసి అందరిని సర్ప్రైజ్ చేసింది.
రీసెంట్ గా వీళ్ళ ఎంగేజ్మెంట్ కూడా ఎంతో ఘనంగా జరిగింది. ఈ వేడుకలలో సాయి పల్లవి తో పాటు ఆమె చెల్లెలు కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా ఆడి పాడి ఎంజాయ్ చేశారు. ఈ ఎంగేజ్మెంట్ నుంచి నిన్న మొన్నటి వరకు ఎన్నో వీడియోలు ఫోటోలు బయటకు రాగా నిన్న పూజా షేర్ చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే ఈసారి ఈ వీడియోలో అక్కని సైడ్ చేసి చెల్లెలు తెగ పాపులర్ అయిపోయింది. మాస్ బీట్ సాంగ్ కి కిర్రాక్ స్టెప్స్ వేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈ వీడియోలో సాయి పల్లవి పూజతో పాటు పూజారి కాబోయే భర్త అలానే సాయి పల్లవి ఫ్యామిలీ మొత్తం చెప్పులు వేశారు. నిశ్చితార్థం సందర్భంగా ఫ్యామిలీ మొత్తం కలిసి సరదాగా వేసిన డాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పూజ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసిన ఈ వీడియో లో ఫుల్ జోష్ తో ఉన్న పెళ్లికూతురు, పెళ్లి కొడుకు తో కలిసి మన సాయి పల్లవి కూడా మాస్ స్టెప్పులు ఇరగదీసింది.
కాగా చెల్లి ఎంగేజ్మెంట్ లో కూడా సాయి పల్లవి ఎప్పటిలాగా ఎంతో సింపుల్ గా కనిపించింది. ఎంగేజ్మెంట్ కు సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలను పట్టి అక్కచెల్లెళ్ల మధ్య ఎంత ప్రేమ ఉందో ఇట్టే అర్థమవుతోంది.
ఇక ప్రస్తుతం పూజ షేర్ చేసిన రీల్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నేటిజెన్లు పూజా డాన్స్ ను తెగ పొగిడేస్తున్నారు. సాయి పల్లవి సిస్టర్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా.. అక్కే అనుకుంటే చెల్లి డాన్సులు ఇంకా కేక.. లాంటి కామెంట్స్ తో ఆన్లైన్ నింపేస్తున్నారు. మొత్తానికి ఒక్క వీడియోతో సాయి పల్లవి సిస్టర్ సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది.
Also read: Old Pension Scheme: ఉద్యోగులకు గుడ్‌న్యూస్, తిరిగి పాత పెన్షన్ విధానం అమలు
Also Read: Niharika Vs Chaitanya: నిహారిక ఇంటర్యూపై మాజీ భర్త చైతన్య స్పందన.. తనను నిందించొద్దని హితవు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
SaiPallavi: సాయి పల్లవి.. పూజా కన్నన్.. ఊర మాస్ డాన్స్.. వైరల్ అవుతున్న కొత్త వీడియో