Vyooham: బెజవాడ ముద్దుబిడ్డ వర్మ ..వనికిపోయిన టిడిపి…వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రోజా

Vyooham Pre-release Event: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏమి చేసినా అది సెన్సేషన్ కన్నా ఎక్కువ వివాదం అవుతూ ఉంటుంది. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన వర్మ ఇప్పుడు మాత్రం వివాదాలను సృష్టించే సినిమాల వైపే మొగ్గు చూపుతున్నారు..

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 24, 2023, 11:49 AM IST
Vyooham: బెజవాడ ముద్దుబిడ్డ వర్మ ..వనికిపోయిన టిడిపి…వ్యూహం  ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రోజా

Roja Speech at Vyooham: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ముఖ్యంగా టాలీవుడ్ లో ఈయనకు ప్రత్యేక స్థానం ఉంది. నాగార్జునతో రామ్ గోపాల్ వర్మ తీసిన శివా సినిమా అప్పట్లో ట్రెండ్ సెట్టింగ్ సినిమా గా నిలిచింది. కాగా ఆ తరువాత టాలీవుడ్ కి ఎన్నో సూపర్ హిట్లు  ఇచ్చిన వర్మ ఈమధ్య కూడా రక్త చరిత్ర లాంటి చిత్రం తీసి పంపించారు. అయితే ఆ తర్వాత ఎన్నో సంవత్సరాల పాటు వర్మకి చెప్పుకోదగిన సినిమాలు ఏవి లేవు.

మంచి సినిమాలు తీయగలిగే డైరెక్టర్ అయి ఉంది కూడా.. ఆయన సినిమాల మీద కన్నా వివాదాల మీద ఎక్కువ కాన్సెంట్రేట్ చేస్తూ ఉండడంతో.. ఆయన చిత్రాలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాయి. ఎక్కడున్నారో సారి వర్మ వివాదాలకు దారితీస్తూ తీసిన చిత్రం వ్యూహం. ఈ సినిమా డిసెంబర్ 29న విడుదలకు సిద్ధమవుతోంది. టిడిపికి వ్యతిరేకత ప్రచారం కలిగిన చిత్రం లాగా వస్తుంది అన్న రూమర్ ఉన్న ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న విజయవాడలో నిర్వహించారు ఈ సినిమా మేకర్స్.

కాగా ఈ చిత్రం ఈవెంట్ నిన్న జరగగా వ్యూహం సినిమా షాట్-4ను ఏపీ మంత్రి రోజా రిలీజ్ చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. 
ఈ ఈవెంట్‌లో వైసీపీ మంత్రి రోజాతో పాటు మల్లాది విష్ణు, ఎంపీ నందిగం సురేశ్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఇందులో భాగంగా రోజా ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ముందుగా ఈ సినిమా వ్యూహకర్త రామ్ గోపాల్ వర్మ  కి అభినందనలు తెలిపారు. ఇక ఆ తరువాత రోజా ఈ సినిమా గురించి మాట్లాడుతూ..’బెజవాడ గడ్డ మీద పుట్టిన ముద్దుబిడ్డ రామ్ గోపాల్ వర్మ. బెజవాడ నుంచి ముంబై వరకూ, శివ నుంచి కంపెనీ వరకూ సినిమాలు తీసి తన సత్తాను చూపిన వ్యక్తి వర్మ. ఆర్జీవీ అంటేనే ఒక సంచలనం. 'వ్యూహం' టైటిల్ ప్రకటించగానే సైకిల్ పార్టీ షేకైపోయింది. చంద్రబాబు కుట్రలు కుతంత్రాలకు జగన్ మోహన్ రెడ్డికి మధ్య జరిగిన సంఘర్షణే ఈ సినిమా. ఎందుకూ పనికిరాని పప్పు లోకేష్‌గాడు కూడా పవన్ సీఎంగా పనికిరాడని చెప్పాడు. కానీ సెంట్రల్ జైలుకెళ్లి బాబుకి మద్దతు పలికి తనతో పాటు తన వర్గానికి పవన్ వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు ఎన్నో కుట్రలు చేశాడు. ఎలాగైనా వ్యూహం సినిమాను ఆపాలనుకుంటున్నారు. అయితే ఈ సినిమాని ఆపలేరు, 2024లో జగనన్న విజయాన్ని కూడా ఆపలేరు' అని మంత్రి రోజా చెప్పుకొచ్చారు.

ఇక ప్రస్తుతం రోజా చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి.

Also read: Corona New Variant Jn.1: దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు, 17 రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదు

Also read: Vitamin D: విటమిన్ డి ఎక్కువైతే ఏమౌతుంది, ఎలాంటి అనారోగ్య సమస్యలెదురౌతాయి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News