రంగస్థలం మూవీ ఫస్ట్ రివ్యూ.. రేటింగ్ వచ్చేశాయోచ్ !!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, సమంత అక్కినేని మొదటిసారి జంటగా కలిసి నటించిన రంగస్థలం సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే వున్నాయి. 

Last Updated : Mar 30, 2018, 10:46 AM IST
రంగస్థలం మూవీ ఫస్ట్ రివ్యూ.. రేటింగ్ వచ్చేశాయోచ్ !!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, సమంత అక్కినేని మొదటిసారి జంటగా కలిసి నటించిన రంగస్థలం సినిమా కోసం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఎంతో మంది తెలుగు ఆడియెన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరైన సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించడం అందుకు ఓ కారణమైతే, చెర్రీని మొదటిసారిగా పూర్తి అచ్చమైన పల్లెటూరి యువకుడిగా, సమంతను అచ్చమైన పల్లెటూరి పడుచు పిల్ల పాత్రలో చూపిస్తూ ఓ పల్లెటూరి నేపథ్యంలో సినిమాను రూపొందించడం మరో కారణం. టాలీవుడ్‌లో మల్టీటాలెంటెడ్ ఆర్టిస్టులుగా పేరున్న సీనియర్ హీరో జగపతి బాబు, యంగ్ హీరో ఆది పినిశెట్టి లాంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఆడియెన్స్‌లో భారీ అంచనాలు వుండటం సహజమే.

ఇన్ని అంచనాల మధ్య రేపు గురువారం రిలీజ్ అవుతున్న రంగస్థలం సినిమా ఎలా వుంటుందా అని ఊపిరి బిగపట్టుకుని ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ వినిపించాడు ప్రముఖ ఫిలిం క్రిటిక్ ఉమెర్ సంధు. యుఏఈ, యుకె దేశాల్లో కూర్చుని సినిమాలకు రివ్యూలు రాస్తోన్న ఈ యంగ్ ఫిలిం క్రిటిక్.. రంగస్థలం సినిమాకు మంచి మార్కులేశాడు. రంగస్థలం పైసా వసూల్ కమెర్షియల్ మసాలా సినిమా అని ఒక్క ముక్కలో కితాబిచ్చాడు. 

 

సుకుమార్ డైరెక్షన్ అదిరిపోగా రామ్ చరణ్, సమంత, జగపతి బాబు అంతే అద్దిరిపోయే పర్ ఫార్మెన్స్ కనబర్చారు అంటూ రంగస్థలంపై ప్రశంసలు గుప్పించాడు ఉమెర్ సంధు. డీఎస్పీ మ్యూజిక్ సైతం సినిమాకు కలిసొచ్చిందన్న ఈ ఫిలిం క్రిటిక్.. రంగస్థలం సినిమాకు 3.5 / 5 రేటింగ్ కూడా ఇచ్చేశాడు. రంగస్థలం ఫస్ట్ రివ్యూగా ఉమెర్ సంధు పోస్ట్ చేసిన ట్వీట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రంగస్థలం కోసం ఎప్పటి నుంచో వేచిచూస్తోన్న అభిమానులకు ఇంతకన్నా గుడ్ న్యూస్ ఇంకేముంటుంది చెప్పండి!! 

 

Trending News