Game Changer Success Celebrations: ఆర్ఆర్ఆర్, ఆచార్య మూవీల తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’. ఈ సినిమాకు అన్ని చోట్ల మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. ‘గేమ్ చేంజర్’ మూవీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలైంది. అంతేకాదు హిందీలో డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అంతేకాదు తొలిరోజున వరల్డ్ వైడ్‌గా రూ.186 కోట్లు కలెక్షన్స్ వచ్చినట్టు చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది. సంక్రాంతి పండుగ సీజన్ కావటంతో రెండో రోజున కూడా వసూళ్ల పరంగా ఇటు సౌత్‌లోనూ.. అటు నార్త్‌లోనూ మంచి బుకింగ్స్ తో గేమ్ చేంజర్ దూసుకుపోతుంది.
‘గేమ్ చేంజర్’ సినిమాలో రామ చరణ్ ప్రజా నాయకుడు అప్పన్నగా.. స్టైలిష్ లుక్‌లో కనిపిస్తూ ప్రజా సమస్యలపై పోరాడే కలెక్టర్ రామ్ నందన్ అనే రెండు పాత్రల్లో చరణ్ చూపించిన నటనకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే ఇక డాన్సుల విషయంలో మెగాపవర్ జోష్ చూపించారు. కియారా అద్వానీ గ్లామర్ లుక్స్, అంజలి, శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, జయరాం, సునీల్ తదితరుల నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. వెండితెరపై ప్రతీ సన్నివేశాన్ని ఎంతో గ్రాండియర్‌గా శంకర్ తెరకెక్కించిన తీరు, దిల్‌రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్ మేకింగ్ ఎక్స్‌ట్రార్డినరీ అని అందరు మెచ్చుకుంటున్నారు. అనౌన్స్మెంట్ రోజు నుంచే సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.
Visuals from the celebrations of #GameChanger success and #RamCharan waving the fans with happiness 👋 pic.twitter.com/AWGqrJ0MGW
— Dileep Kumar Kandula (@TheLeapKandula) January 11, 2025
రామ్ చరణ్‌ను శంకర్ ఎలా ప్రెజంట్ చేసిన విధానంపై అక్కడక్కడ విమర్శలు వచ్చినా.. ఓవరాల్ గా ఈ సినిమాకు కలెక్షన్స్ మాత్రం అదిరిపోతున్నాయి. అందరి అంచనాలను మించుతూ శంకర్ మాస్టర్ టేకింగ్, రామ్ చరణ్ పెర్ఫామెన్స్‌తో గేమ్ చేంజర్ నెక్ట్స్ రేంజ్‌లో సంక్రాంతి విన్నర్‌గా కలెక్షన్స్ కొల్లగొడుతోంది. ఈ నేపథ్యంలో సక్సెస్‌ను చిత్ర యూనిట్ కంటే అభిమానులే ఘనంగా సెలబ్రేట్ చేసుకోవటం విశేషం. గేమ్ చేంజర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోన్న ఫ్యాన్స్ రామ్ చరణ్ ఇంటికి చేరుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఫ్యాన్స్‌ను కలిసిన రామ్ చరణ్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
ఇదీ చదవండి: Prabhas Marriage: ప్రభాస్ మ్యారేజ్ ఫిక్స్.. డార్లింగ్ చేసుకోబోయేది ఈమెనే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.