Rajamouli in TIME's 100 most influential people in the world: తెలుగు సినీ పరిశ్రమ సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన దర్శక ధీరుడు రాజమౌళి మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. స్టూడెంట్ నెంబర్ సినిమా అంటే కెరీర్ మొదటి నుంచి చేసిన ప్రతి సినిమాతో హిట్ అందుకుంటూ వస్తున్న రాజమౌళి బాహుబలి లాంటి సినిమాతో తెలుగు సినిమా సత్తాని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాడు. ఆ సినిమా జపాన్, చైనా సహాయ పలు దేశాల్లో రిలీజ్ అయి మంచి వసూళ్లు సాధించింది.
ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమ మొత్తానికి గుర్తింపు దక్కే విధంగా ఆస్కార్ కూడా వరించేలా చేశాడు. ఇక గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తూ వస్తున్న రాజమౌళి ఇప్పుడు మరో అరుదైన ఘనత సాధించారు. భారతదేశ నేషనల్ మీడియా టైమ్స్ మ్యాగజైన్ ప్రకటించిన టాప్ 100 వరల్డ్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ జాబితాలో ఆయనకు చోటు దక్కింది. రాజమౌళి కి ఈ అరుదైన ఘనత దక్కడం ప్రతి తెలుగువాడు గర్వించాల్సిన విషయం ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా 200 లకు పైగా దేశాలున్నా ఆ 200 దేశాల నుంచి 100 మందిని సెలెక్ట్ చేస్తే తెలుగు రాష్ట్రాల నుంచి రాజమౌళి ఆ లిస్టులో స్థానం సంపాదించారు.
ఇదీ చదవండి: Shaakuntalam Review: సమంత శాకుంతలం రివ్యూ.. విజువల్ ట్రీటే కానీ?
రాజమౌళి మాత్రమే కాదు ఇండియా నుంచి పలువురు ఇతర సెలబ్రిటీలు సైతం ఈ లిస్టులో ప్లేస్ సంపాదించారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ, పద్మ లక్ష్మి వంటి వారు కూడా ఈ జాబితాలో ఉన్నారు. 2023 ఏడాదికి గాను టైమ్స్ మ్యాగజైన్ నిర్వహించిన ఒక ఆన్లైన్ పోల్‌లో తెలుగు వ్యక్తి ఇలా చోటు దక్కించుకోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. అయితే ఈ విషయం మీద మరో ఆసక్తికరమైన చర్చ కూడా జరుగుతోంది. అదేమిటంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కానీ ఈ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు.
అదే విధంగా టాలీవుడ్ లో స్టార్ హీరోలు గానీ బాలీవుడ్ లో షారుఖ్ మినహా ఇతర స్టార్ హీరోలు లేదా దర్శకేంద్రులు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు. ఇక ఈ జాబితాలో అమెరికన్ ప్రెసిడెంట్ జో బైడెన్, ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ సహా మరి కొంతమంది ప్రముఖులు జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇక రాజమౌళి ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ఆర్ఆర్ఆర్ తరువాత సుదీర్ఘమైన గ్యాప్ తీసుకున్న ఆయన మహేష్ బాబుతో ఒక సినిమా చేయాల్సి ఉంది.
తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతానికి ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. కేఎల్ నారాయణ నిర్మాణంలో ఈ సినిమాని భారీ బడ్జెట్ తో ప్రపంచ స్థాయి సినిమాగా తెరకెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో హాలీవుడ్ తో కూడా రాజమౌళికి పరిచయం ఏర్పడిన నేపథ్యంలో ఈ సినిమాకి హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పనిచేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
ఇదీ చదవండి: Chiranjeevi's Toyota Vellfire: చిరంజీవి కొత్త కారు ఫీచర్స్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే.. లగ్జరీ కార్ల కింగ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook