Radhika Kumaraswamy film illegally uploaded on youtube: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సతీమణి రాధికా కుమారస్వామి నటిగాను, నిర్మాతగా పేరు ప్రఖ్యాతలు సాధించారు. ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాటినుంచి కీలకమైన నిర్ణయాలు తీసుకోని సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇదిలాఉంటే.. రాధిక 2013లో `స్వీటీ నాన్న జోడీ` అనే కన్నడ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించి బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను సైతం రాబట్టింది. అయితే రాధిక కుమారస్వామి రూ. 3 కోట్లతో రూపొందిన ఈ చిత్ర డిజిటల్ హక్కులను ఆమె ఇంకా ఎవ్వరికీ విక్రయించలేదు. ఈ క్రమంలో స్వీటీ నాన్న జోడి సినిమాను రాధికా అనుమతి లేకుండా, హక్కులు పొందకుండా డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రాధికా సదరు చానల్‌పై చట్టపరమైన చర్యలకు దిగారు. ఈ మేరకు ఆమె బెంగళూరు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. Also read: Vijayashanti: వారు చనిపోతే.. సుశాంత్ కేసులా దర్యాప్తు జరిగిందా?
అయితే.. రాధికా కుమారస్వామి పెళ్లైన నాటి నుంచి ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఆమె మళ్లీ సినిమాల్లో చురుకుగా మారడంతోపాటు.. పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. Also read: విశాఖపట్నం వచ్చినప్పుడు కలుస్తానమ్మా: పవన్ కల్యాణ్