Pawan Kalyan about Puspa 2 ticket dates : అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప -2 ది రూల్ ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించి.. విడుదల తేదీ మార్చిన విషయం తెలిసిందే. డిసెంబర్ 6న రావాల్సిన ఈ సినిమా డిసెంబర్ ఐదవ తేదీని థియేటర్లోకి రానుంది. నిజానికి ఈ చిత్రం ఆగస్టు 15న రావాల్సి ఉంది. కానీ అనుకోని కారణాలవల్ల అప్పుడు ఈ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేశారు. ఇక ఈ సినిమా డిసెంబర్ 6న విడుదల కానుంది.. అని ఈ మధ్యనే ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ విడుదల తేదీని కూడా మార్చారు నిర్మాతలు. అయితే ఈసారి పోస్ట్ పోన్ చేయకుండా ఈ సినిమాను ప్రీ పోన్ చెయ్యడంతో.. అల్లు అర్జున్ అభిమానంలో మరింత ఆనందం మొదలైంది.
ఇదిలా ఉండగా ఈ విషయాన్ని వెల్లడించడానికి.. తాజాగా గ్రాండ్ ప్రెస్ మీట్ ను నిర్వహించింది చిత్ర బృందం. ఈ ప్రెస్ మీట్ లో నిర్మాతలను అలానే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్స్ ను.. మీడియా కొన్ని ప్రశ్నలు అడగక వాటికి ఇంట్రెస్టింగ్ సమాధానాలు చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే పుష్ప -2 విజయవంతమైతే పుష్ప 3 కూడా ఉంటుంది.. అని నిర్మాత రవిశంకర్ తెలిపారు. పుష్ప 3 ఉంటుందా అని అడగక మీరు పుష్ప 2 కి కూడా మంచి విజయం అందిస్తే.. అప్పుడు తప్పకుండా పుష్ప 3 ఉంటుందని చెప్పకువచ్చాడు. అంతేకాకుండా తప్పకుండా రెండో భాగంలో మూడో భాగం కి లీడ్ ఉంటుందని కూడా వ్యక్తపరిచారు.
మరోపక్క పుష్ప-2 కర్ణాటకలో 500 సింగిల్ స్క్రీన్ లలో విడుదల అవుతూ ఉండగా.. అక్కడ రూ.30 కోట్లు వసూలు చేస్తే కేజిఎఫ్ 2 ని అధిగమిస్తుందని ..కర్ణాటక డిస్ట్రిబ్యూటర్ వెల్లడించారు. ఇకపోతే నిర్మాత నవీన్ ఎర్నేని కల్కి 2898AD విడుదల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డీసీఎం పవన్ కళ్యాణ్ ని కలిసి.. పెరుగుతున్న సినిమా ఖర్చులు, టికెట్ రేట్ ల గురించి చర్చించగా టికెట్ ధర ₹100 పెంచుకుంటామని అడిగితే.. ఆయన ఒకే చెప్పారు అంటూ తెలిపారు. అంతేకాకుండా అప్పుడు కేవలం వందేనా ఇంకా పెంచుకోండి అని కూడా హామీ ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు.ఈ క్రమ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పెంచిన రేట్లు పుష్ప -2 కి కూడా.. వర్తిస్తాయని వార్తలు వినిపిస్తున్నాయి. కాబట్టి తప్పకుండా పుష్ప 2 సినిమాకి టికెట్ రేట్స్.. విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
పుష్ప ఫ్రాంచైజీ మొదలు కాబోతోందని.. పుష్ప 2 భారీ బ్లాక్ బస్టర్ అవుతుందనే వాగ్దానం తాము చేస్తున్నామని డైరెక్టర్, నిర్మాత తెలిపారు. ఇకపోతే డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కాబోతోందని, అల్లు అర్జున్ పోస్టర్‌తో సహా సినిమా యూనిట్ వెల్లడించారు.
Also read: Maharashtra Elections 2024: మహారాష్ట్రలో ఇండీ కూటమి సీట్ల సర్దుబాటు ఫిక్స్, ఎవరు ఎన్ని సీట్లలో పోటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.