Priyamani CM: ముఖ్యమంత్రి పీఠానికే ఎసరు పెట్టిన ప్రియమణి.. గద్దెనెక్కేందుకు సర్వం సిద్ధం!

Priyamani to play a CM role in Naga Chaitanya #NC22: ఒకప్పటి హీరోయిన్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారడానికి రెడీ అవుతున్న ప్రియమణి ముఖ్యమంత్రి అవబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఆ వివరాలు 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 28, 2022, 03:04 PM IST
 Priyamani CM: ముఖ్యమంత్రి పీఠానికే ఎసరు పెట్టిన ప్రియమణి.. గద్దెనెక్కేందుకు సర్వం సిద్ధం!

Priyamani to play a CM role in Naga Chaitanya #NC22: ప్రియమణి ముఖ్యమంత్రి కాబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అదేంటి సినిమా అవకాశాలు లేక ఇప్పుడిప్పుడే బుల్లితెరపై పలు ప్రోగ్రామ్స్ చేసుకుంటున్న ప్రియమణి ముఖ్యమంత్రి కావడం ఏమిటి? అని ఆలోచిస్తున్నారా అయితే ఇది మొత్తం చదవాల్సిందే. ఈ మధ్యకాలంలో ప్రియమణి వరుసగా వార్తల్లో నిలుస్తోంది. ఆమె తన భర్త ముస్తఫా రాజ్ నుంచి విడిపోతుందని విడాకులు తీసుకునేందుకు సిద్ధంగా ఉందని ఇలా రకరకాల ప్రచారాలు అయితే జరుగుతున్నాయి.

అయితే వాటిని ఆమె టీం ఖండిస్తోంది, అలాగే ప్రియమణి కూడా ఇటీవల ఒక స్పెషల్ పోస్ట్ పెట్టి దాని ఖండించే ప్రయత్నం చేసింది. అసలు విషయం ఏమిటంటే ఇటీవలే సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె నారప్ప లాంటి సినిమాలతో హిట్ అందుకుంది. అలాగే భామాకలాపం అంటూ ఒక లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టుతో కూడా మంచి మార్కులు సంపాదించింది. ప్రస్తుతం ఆమె నాగచైతన్య హీరోగా నటిస్తున్న వెంకట్ ప్రభు సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది.

ఇప్పటి వరకు ఆమె సినిమాలో నటిస్తోందనే విషయం మీద క్లారిటీ ఉంది కానీ ఎలాంటి పాత్ర అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆమె ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. మానాడు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు ప్రస్తుతం నాగచైతన్య హీరోగా ఒక బై లింగ్యువల్ మూవీ చేస్తున్నాడు, ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో ప్రియమణి కూడా భాగమైనట్లు ఆ మధ్య ఒక ప్రకటన ఇచ్చారు.

ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆమె ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నారట. ఈ సినిమాని శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ మీద శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇక నాగచైతన్య ఇటీవల బంగార్రాజు సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. ఇక ఈ సినిమాతో ఖచ్చితంగా మరో హిట్టు అందుకునే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిమానులైతే భావిస్తున్నారు. మొత్తం మీద దర్శకుడు వెంకట్ ప్రభు కూడా తమిళనాడులో మంచి ఫామ్ లో ఉండడంతో ఈ సినిమాతో మంచి తమిళ ఎంట్రీ కూడా దొరికినట్లు అవుతుందని, అక్కినేని అభిమానులు భావిస్తున్నారు చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది.

Also Read: Kantara Domination: దీపావళి నాలుగు సినిమాలను లేపి అవతలేసిన కాంతార.. ఇదెక్కడి మాస్ ర్యాంపేజ్ మావా!

Also Read: Andaru Bagundali Andulo Nenundali: ఆహా'లో నరేష్ - పవిత్ర భార్యాభర్తలుగా నటించిన మూవీ రిలీజ్.. ఎలా ఉందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News