Tribanadhari Barbarik: బార్బరిక్ మూవీ టీజర్.. అదిరిపోయిన డైలాగ్స్

Tribanadhari Barbarik Teaser: బార్బరిక్ మూవీ టీజర్‌ను స్టార్ డైరెక్టర్ మారుతి రిలీజ్ చేశారు. టీజర్‌లో అదిపోయే డైలాగ్స్‌తో మేకర్స్ ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశారు. అన్ని పాత్రలను మరో లెవల్‌లో డిజైన్ చేసినట్లు అర్థమవుతోంది.

Written by - Ashok Krindinti | Last Updated : Jan 3, 2025, 05:26 PM IST
Tribanadhari Barbarik: బార్బరిక్ మూవీ టీజర్.. అదిరిపోయిన డైలాగ్స్

Tribanadhari Barbarik Teaser: స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పకుడిగా  విజయపాల్ రెడ్డి అడిదల నిర్మిస్తున్న ‘బార్బరిక్’ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్నారు. వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఇప్పటికే  రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్‌తో సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఇక తాజాగా ఈ చిత్ర టీజర్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు.

‘స్వీయ నాశనానికి మూడు ద్వారాలున్నాయి.. ఇది నువ్వో నేనో చేసే పని కాదు దిమాక్ ఉన్నోడే చేయాలి.. ఒకడు తాచు పాము తోకని తొక్కాడు.. తొక్కిన వాడ్ని పాము కాటేయబోతోంది.. మరి తొక్కించిన వాడి సంగతేంటి?’.. అంటూ అదిరిపోయే డైలాగ్స్‌తో సాగిన ఈ టీజర్‌లో ఎన్నో హైలెట్స్ ఉన్నాయి. టీజర్‌లో సత్యరాజ్, వశిష్ట, సత్యం రాజేష్ ఇలా చాలా పాత్రలకు ఉన్న ఇంపార్టెన్స్‌ను చూపించారు. ఇక టీజర్ చివర్లో వదిలిన షాట్స్, చూపించిన గెటప్స్ నెక్ట్స్ లెవెల్లో ఉన్నాయి. 

స్టార్ దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ‘బార్బరిక్ సినిమా కోసం నేనేమీ పని చేయలేదు. ఈ టీంకు సలహాలు, సూచనలు మాత్రమే ఇచ్చాను. ఇది చాలా రిస్కీ జానర్ అని చెప్పాను. మోహన్, రాజేష్ చాలా కాన్ఫిడెన్స్‌తో సినిమాను స్టార్ట్ చేశారు. విజయ్ గారు ఈ సినిమా కోసం చాలా ఖర్చు పెట్టారు. విజయ్ గారు అతి తక్కువ టైంలోనే పెద్ద ప్రొడ్యూసర్ కానున్నారు. విజయ్ గారితో కలిసి జీతెలుగుతో మరో సినిమాను చేయబోతున్నాను. మోహన్ లోపలకి బార్బరికుడు వెళ్లిపోయాడు. మోహన్‌లో చాలా ఎనర్జీ ఉంది. ఈ మూవీని చాలా చక్కగా తీశారు. రమేష్ రెడ్డి గారి కెమెరా వర్క్ అద్భుతంగా ఉంది. ఇంఫ్యూజన్ బ్యాండ్‌ ఈ చిత్రానికి మంచి సంగీతాన్ని ఇచ్చారు. ఈ మూవీ చాలా కొత్తగా ఉంటుంది. మైథలాజికల్ పాయింట్‌లో ఉన్న పాత్ర ప్రజెంట్ జనరేషన్‌కి వస్తే ఎలా ఉంటుందో చూపించారు. ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుంది. సత్య రాజ్ గారు బాహుబలి చేశారు.. బార్బరిక్ కూడా చేశారు. ఆయనకు కథ నచ్చితే వెంటనే ఓకే చెబుతారు. ఆయనతో నేను ప్రతిరోజూ పండగే వంటి మంచి సినిమాను చేశాను. ఈ మూవీని అందరూ ఎంకరేజ్ చేయాలి’ అని అన్నారు.

నటుడు సత్య రాజ్ మాట్లాడుతూ.. ‘బార్బరిక్ టీంకు ఇక ప్రతి రోజూ పండుగే. ఇది పక్కా కమర్షియల్ సినిమా. ఇకపై మేం అంతా రాజా సాబ్‌లమే. డైరెక్టర్ మోహన్ నాకు చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ఈ సినిమాకు కథే హీరో. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి, రాజేష్ గారు టీంను చక్కగా చూసుకున్నారు. సత్యం రాజేష్ గారు సినిమాలో నాతో  పాటే ఉంటారు. ఇందులో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఏజ్డ్ యాక్షన్ హీరో అనే ట్యాగ్ కోసం నేను ప్రయత్నిస్తున్నాను. ఈ మూవీతో నాకు ఆ ట్యాగ్ వస్తుంది. నన్ను తెలుగులో డబ్బింగ్ చెప్పమని అన్నారు. హిందీ, కన్నడ, తమిళంలోనూ డబ్బింగ్ చెప్పాను. ఈ సినిమా పెద్ద హిట్ కాబోతోంది’ అని అన్నారు.

నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల మాట్లాడుతూ.. ‘వానర సెల్యూలాయిడ్ అనేది మా తల్లిదండ్రుల పేరు మీదుగా పెట్టాను. మారుతి గారితో కలిసి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఆయనకు ఎప్పుడూ రుణ పడి ఉంటాను. బార్బరిక్ లాంటి పెద్ద సినిమాను చేస్తానని నేను అనుకోలేదు. ఈ మూవీ కోసం ఇంఫ్యూజన్ బాండ్‌ను తీసుకొచ్చాను. సినిమా అద్భుతంగా ఉండబోతోంది’ అని అన్నారు.

దర్శకుడు మోహన్ శ్రీవత్స మాట్లాడుతూ.. ‘బార్బరిక్ టైటిల్ గ్లింప్స్‌కు అద్భుతంగా రెస్పాన్స్ వచ్చింది. సత్యం సుందరం సినిమాను చూస్తే.. సుందరం లాంటి ఇద్దరు వ్యక్తులు ఈ స్టేజ్ మీదున్నారు. విజయ్ గారు నేను చెప్పిన కంటెంట్, కథను నమ్మి నాకు కావాల్సినంత బడ్జెట్ ఇచ్చారు. మారుతి గారు నాకు ఎప్పుడూ సపోర్ట్‌గా ఉంటూ స్పూర్తినింపుతూనే ఉన్నారు. సత్యరాజ్ ఈ పాత్రను చాలా ప్రేమించారు. అర్దరాత్రి దాటినా షూటింగ్ చేస్తూ ఉండేవారు. వర్షంలోనే రాత్రి పూట షూటింగ్ చేస్తుండేవారు. సత్యం రాజేష్ గారు నాకు చాలా సపోర్ట్ చేశారు. వశిష్ట త్వరలోనే స్టార్ అయిపోతారు. సాంచీ చాలా మంచి అమ్మాయి. క్రాంతి కిరణ్ మంచి స్టార్ అయిపోతాడు. బార్బరికుడికి త్రిబాణాస్త్రం ఉన్నట్టు నాకు మూడు అస్త్రాలున్నాయి. ఒకటి డీఓపీ రమేష్, రెండు ఫ్యూజన్ బాండ్, మూడు ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్. ఈ మూడు అస్త్రాలతో నేను ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాను’ అని అన్నారు.

సత్యం రాజేష్ మాట్లాడుతూ.. ‘బార్బరిక్ చిత్రం చాలా బాగుంటుంది. నాకు మంచి పాత్ర వచ్చింది. దీని మీద ఎంత బడ్జెట్ పెట్టారో కూడా ఊహించలేరు. మినీ బాహుబలిలా ఉంటుంది. వశిష్ట, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్, యష్న అద్భుతంగా నటించారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాత రాజేష్ అందరికీ సపోర్ట్‌గా నిలిచారు. సత్యరాజ్ గారు ఏ ఏజ్ యాక్టర్‌లతో నటిస్తే ఆ ఏజ్ యాక్టర్‌లా మారిపోతారు. ఆయనతో నటించడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

హీరోయిన్ సాంచి రాయ్ మాట్లాడుతూ.. ‘బార్బరిక్ టీజర్ అందరికీ నచ్చుతుంది. ఇది నాకు ఫస్ట్ తెలుగు సినిమా. నాకు ఇక్కడ అనంతమైన ప్రేమ లభిస్తుందని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఈ సినిమా పెద్ద హిట్ కాబోతోంది’ అని అన్నారు.
 

Also Read: PF Pensions: EPFO పెన్షన్‌దారులకు బిగ్ గిఫ్ట్.. కొత్త పెన్షన్‌ స్కీమ్‌తో ఆ కష్టాలకు చెక్  

Also Read: Dokka Seethamma Mid Day Meal: ఏపీ విద్యార్థులకు జాక్‌ పాట్‌.. రేపటి నుంచి మధ్యాహ్న భోజనం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

Trending News