Star War: స్టార్ ఫ్యామిలీస్‌లో స్టార్ వార్.. ఫ్యాన్స్ అంతా పరేషాన్!

Pawan Kalyan Vs Allu Arjun And Balayya Vs Jr NTR: ఇప్పుడు ఆ రెండు స్టార్‌ ఫ్యామిలీస్‌లో ఊహించని వార్‌ నడుస్తోంది. ఈ వార్‌ హెచ్చు తగ్గులకు కారణాలేంటి.. ఇంతకీ ఆ రెండు ఫ్యామీలేవరివి.. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి. 

Written by - Indupriyal Radha Krishna | Last Updated : Aug 26, 2024, 02:07 PM IST
Star War: స్టార్ ఫ్యామిలీస్‌లో స్టార్ వార్.. ఫ్యాన్స్ అంతా పరేషాన్!

 

Pawan Kalyan Vs Allu Arjun And Balayya Vs Jr NTR: సినిమా పరిశ్రమలోనే ఆ రెండు కుటుంబాలదే హవా..సినీ పరిశ్రమకు వారసత్వంగా వస్తున్న ఆ రెండు కుటుంబాలు. ఎంతో మంది హీరోలను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత వారిది. జనరేషన్స్ మారినా ఆ కుటుంబాల ఫాలోయింగ్ మాత్రం తగ్గడం లేదు. అయితే ఈ రెండు కుటుంబాలకు ఇప్పుడు ఒక సమస్య వచ్చి పడుతుందట. సొంత ఫ్యామిలో హీరోల నుంచే ఇగో ప్రాబ్లం వస్తుండడంతో ఆ స్టార్ ఫ్యామిలీ ఫ్యాన్స్ పరేషాన్ అవుతున్నారట. మొన్నటి వరకు ఒక్కటిగా ఉన్న ఆ ఫ్యాన్స్ గ్రూప్ ఇప్పుడు ఎవరికి వారుగా మారుతున్నారట. తమ హీరోను కించపరిస్తే ఎంత వారినైనా అందులోను సొంతవారిని కూడా వదలబోమని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఆ స్టార్ ఫ్యామిలీస్ ఏంటి... ఆ హీరోలు ఎవరు..ఏంటా కథ..

టాలీవుడ్ లో నందమూరి, మెగా ఫ్యామిలీల పెత్తనం ఎప్పటి నుంచో ఉంది. ఆ కుటుంబాల నుంచి అనేక మంది హీరోలు సినీ పరిశ్రమను ఏలుతున్నారు. ఆ రెండు కుటుంబాలకు సంబంధించిన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ వారి ప్రోగ్రాం అయిన ఇసుకేస్తే రాలనంత జనం వస్తుంటారు. ఈ స్టార్  ఫ్యామిలీస్ లోని హీరోలందరికి కలిపి ఒక పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటు నందమూరి ఐనా అటు మెగా ఫ్యామిలీ ఐనా వారి ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా ఉండదు. మొదటి తరంలో నందమూరి కుటుంబం నుంచి సీనియర్ ఎన్టీఆర్ ఉండగా, ఇక మెగా స్టార్ ఫ్యామిలీకీ పెద్ద దిక్కుగా ఇండస్ట్రీలో అలనాటి హాస్య నటుడు అల్లు రామలింగయ్య ఉండే వారు. ఇక రెండో తరం వచ్చే సరికి ఎన్టీఆర్ వారసుడిగా బాలకృష్ణ, మెగ ఫ్యామిలీ నుంచి చిరంజీవి ఓ రేంజ్‌లో తమ సినిమాలతో అభిమానులను ఉర్రతలూగించారు. 

వీరి కుటుంబాల నుంచే మూడో తరంగా  అనేక మంది హీరోలు వచ్చారు. నందమూరి కుటుంబం నుంచి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నిలదొక్కుకాగా మిగితా వారు మాత్రం అడపాదడపా సినీమాలు తీస్తూ ఉండిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ తరంలో టాప్ హీరోగా ఉంటూ వస్తున్నారు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి మాత్రం స్టార్ హీరోలు కొంత ఎక్కువనే చెప్పవచ్చు.  పవన్ కళ్యాణ్‌, రామ్ చరణ్‌, బన్నీతో పాటు వరుణ్‌ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం హీరోలుగా సినీ పరిశ్రమలో ఉన్నారు. వీరిలో మాత్రం చిరంజీవి తరువా అంతటి ఫ్యాన్ ఫాలో కలిగిన వారు మాత్రం పవన్ కళ్యాణ్‌, రాం చరణ్‌, బన్నీ మాత్రమే. ఇలా ఈ రెండు కుటుంబాలకు సినీ పరిశ్రమలో ఒక కాంబో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో వీళ్ల సినిమా ఏది రిలీజ్ ఐనా సినిమా థియేటర్లలో హంగామా అంతా ఇంతా కాదు.పెద్ద పెద్ద కటౌట్లు, పాలాభిషేకాలు, విజుల్లు, పేపర్ల విసరడాలు ఇలా ఫ్యాన్స్ సంబరం అంతా ఇంతా కాదు.

అయితే ఇంతలా పెద్ద మాస్ ఫాలోయింగ్ కలిగిన ఆ స్టార్ కుటుంబాలకు ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చి పడుతుందట. ఒకటే కుటుంబం నుంచి బడా హీరోలు ఎక్కువ అవుతుండడంతో ఆ ఫ్యాన్స్ మధ్యనే కోల్డ్ వార్ మొదలవుతుందంట. మొదట్లో కేవలం ఫ్యాన్స్ మధ్యలో మాత్రమే ఉండే ఈ ఫ్యాన్స్ వార్ ఇప్పుడు ఏకంగా హీరోల మధ్య కూడా మొదలవుతుందనే ప్రచారం సినీ పరిశ్రమలో జోరగా జరుగుతుంది. దీనికి బలం చేకూర్చేలా కొన్ని సంఘటనలు కూడా ఇటీవల చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా నందమూరి కుటుంబంలో బాలకృష్ణ వర్సెస్ జూ. ఎన్టీఆర్ గా నడుస్తుందని సిని పరిశ్రమలో లోలోన గుస గుస వినపడుతున్నాయి. నందమూరి కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాలకు జూ.ఎన్టీఆర్ చాలా రోజులుగా దూరంగా ఉంటూ వస్తున్నారు. జూ. ఎన్టీఆర్, అతని సోదరుడు కళ్యాణ్ రామ్ కూడా నందమూరి ఫ్యామిలీతో అంతంతంగానే సంబంధాలు కొనసాగిస్తున్నట్లు ఇండస్ట్రీలో వినికిడి. నందమూరి కుటుంబానికి బేసిక్ గా నే రాజకీయ నేపథ్యం ఉండడంతో ఇవి సినీ పరిశ్రమతో పాటు రాజకీయాలపై కూడా ప్రభావం చూపేలా అభిమానుల తీరు మారింది. తాజాగా ఏపీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో చాలా చోట్ల తమ అభిమాన నేత జూ. ఎన్టీఆర్ సీఎం కావాలంటూ పలు చోట్ల బ్యానర్ల ప్రదర్శన, కటౌట్లు పెట్టడంలో రాజకీయాల్లో కలకలం సృష్టించింది.

అందునా సీనియర్ ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ పార్టీకీ నాయకత్వం వహించాలంటూ కూడా అభిమానులు పలు చోట్ల బ్యానర్ లో ప్రదర్శించారు. దీనిపై చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబాలు ఒకింత అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఇంత జరుగుతున్నా జూ.ఎన్టీఆర్ ఏనాడు నోరు మెదపలేదు. ఇలా నందమూరి కుటుంబంలోనే రెండు వర్గాలుగా మారియి ఒకటి బాలకృష్ణ వర్గం కాగా, మరొకటి జూ.ఎన్టీఆర్ వర్గం. ఇలా ఒకటే స్టార్ ఫ్యామిలీకి చెందిన అభిమానులు ఇప్పుడు రెండు వర్గాలుగా మారారు. సీనియర్ ఎన్టీఆర్ విషయంలో వీరు ఒక్కతాటిపై ఉన్నా బాలకృష్ణ,, జూ. ఎన్టీఆర్ వరకు వచ్చే సరికి మాత్రం ఎవరికి వారే యమునా తీరేగా ఉంటున్నారు.దీంతో ఏ హీరో అభిమానులు ఆ హీరోకు జై కొడుతున్నారు. కొన్ని సందర్భాల్లో వీరి మధ్య ఇగోల వల్ల చిన్న పాటి అలజడి కూడా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇక మెగా స్టార్ ఫ్యామిలీదీ మరో కథ. సినీ పరిశ్రమలో ఎక్కువ మంది వారసత్వ హీరోలను అందించిన కుటుంబం  మెగా కంపౌండ్. అలాంటి మెగా ఫ్యామిలీలో కూడా టాప్ హీరోల మధ్య బాగా గ్యాప్ వచ్చిందనే ప్రచారం జరుగుతుంది. మొదట్లో చిరంజీవి సినిమాలన్నీ అల్లు అరవింద్ నిర్మాతగా ఉన్న గీతా ఆర్ట్స్ లో సినిమాలు తీసేవారు. కానీ తర్వాత క్రమంలో రామ్ చరణ్‌ నేతృత్వంలోని కొణిదెల ఆర్ట్స్ లో సినిమాలు తీయడం స్టార్ చేశారు. గీతా ఆర్ట్స్ లో ఎక్కువ భాగం అల్లు అర్జున్ సినిమాలు తీయడం మొదలు పెట్టారు. సొంతంగా బ్యానర్ క్రియేట్ చేయడంతో మెగా కుటుంబంగా ఉన్న కొణిదెల, అల్లు కుటుంబాల మధ్య ఏదైనా గ్యాప్ వచ్చిందా అన్న సందేహాలు కలిగాయి.

దీనికి తోడు అల్లు అర్జున్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మధ్య కోల్డ్ వార్ కూడా ఆ కుటుంబాన్ని బాగా డిస్టర్బ్ చేశాయి. మెగా ఫ్యామిలీ ఏ సినిమా ఫంక్షన్ ఐనా అక్కడకు పవర్ స్టార్ పవన్ అభిమానులు వచ్చి రచ్చ చేసేవారు. పవన్ రాకున్న పవర్ స్టార్ నినాదాలు చేయడం మెగా కుటుంబంలోని హీరోలు కూడా కొంత అసౌకర్యంగా ఫీలయ్యేవారు.ఓ దశలో చిరంజీవి మాట్లాడుతుండగా కూడా ఇలానే పవన్ అభిమానులు నినాదాలు చేశారు. దీంతో నాగబాబు సహా అల్లు అర్జున్ లు నేరుగానే పవన్ అభిమానులపై సీరియస్ అవడం అప్పట్లో పెద్ద సంచలనంగా  మారింది. ఇదే సమయంల అల్లు అర్జున్ ఒక ఫంక్షన్ లో అందరి మెగా హీరోల పేర్లు చెప్పి పవన్ కళ్యాణ్‌ పేరు చెప్పలేదు. దీంతో పవన్ అభిమానులు పవర్ స్టార్ అని నినాదాలు చేసినా అల్లు అర్జున్ నేను చెప్పను బ్రదర్ అని అనడంతో అభిమానుల్లో తీవ్ర ఆగ్రహం తెప్పించింది. అప్పటి నుంచి అల్లు అర్జున్ ,పవన్  అభిమానుల మధ్య గ్యాప్ ఏర్పడింది. సోషల్ మీడియా వేదికగా ఈ ఇద్దరి హీరోల అభిమానులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి  పోసుకోవడం మొదలు పెట్టారు.

ఇది ఇలా ఉండగానే తాజాగా ఏపీలో జరిగిన ఎన్నికలు కూడా అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్‌ మధ్య మరింత గ్యాప్ ను పెంచాయి. పవన్ కళ్యాణ్‌ కూటమి తరుపున బరిలో ఉండగానే, అల్లు అర్జున్ మాత్రం వైసీపీకీ చెందిన ఒక లీడర్ కు ప్రచారం చేయడంపై పవన్ అభిమానులు తీవ్రంగా తప్పబట్టారు. దీంతో సినిమా పరంగా మొదలైన వార్ రాజకీయాలకు కూడా చేరింది. ఇదే సమయంలో రాజకీయంగా  పవన్ కళ్యాణ్‌ కు చిరంజీవి కుటుంబం మొత్తం అండగా నిలబడగా  అల్లు ప్యామిలీ మాత్రం కొంత దూరంగా ఉన్నట్లు కనిపించింది. ఎన్నికల్లో కూటమి దిగ్విజయం సాధించిన తరువాత పవన్ కళ్యాణ్‌ కు చిరంజీవి కుటుంబం మొత్తం కలిసి సంబురాలు చేసుకున్నారు. దీనికి అల్లు కుటుంబం దూరంగా ఉండడం అనేక సందేహాలకు తావిచ్చింది. ఇన్ని రోజులు బయట అనుకున్నట్లుగానే మెగా ఫ్యామిలీతో అల్లు కుటుంబం తెగతెంపులు చేసుకోబోతుందా అన్న ప్రచారానికి బలం ఇచ్చినట్లు అయ్యింది. ఇంతటితో ఈ వార్ ఆగలేదు. 

ఇన్ని రోజులు ఈ వార్ పై మౌనరంగా ఉంటూ వచ్చిన పవన్ కళ్యాణ్‌ చేసిన కొన్ని కామెంట్స్ బన్నీనీ బాగా ఇరిటేట్ చేశాయి. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు అల్లు అర్జున్ ను చేసినవే అని బన్నీ ప్యాన్స్ సీరియస్ అవుతున్నారు. ఒకప్పుడు హీరోలు చెట్లు పెంచమని చెప్పేవారు కానీ  ఇప్పుడు హీరోలు మాత్రం చెట్లు నరికి వ్యాపారం చేయాలని చెప్పడం ఏంటి ..ఇదేమీ హీరోయిజం అని పవన్ ప్రశ్నించారు. అయితే ఈ వ్యాఖ్యలు బన్నీనీ టార్గెట్ చేసినట్లుగా ఉన్నాయనేది బన్నీ ఫ్యాన్స్ మనోగతం. అల్లు అర్జున్ రీసెంట్ గా తీసిన పుష్ప సినిమా క్యారెక్టర్ ను ఉద్దేశించి పవన్ ఈ వ్యాఖ్యలు చేశారనేది సినీ పరిశ్రమలో ప్రచారం. ఈ వ్యాఖ్యలు ఈ రెండు కుటుంబాల మధ్య మరింత అగాధాన్ని పెంచేలా చేశాయి. ఇక అప్పటి నుంచి ఈ ఇద్దరి హీరోల నడుమ  రచ్చ కొనసాగుతూనే ఉంది.

ఇలా ఇటు నందమూరి ,అటు మెగా స్టార్ ఫ్యామిలీలో సొంత హీరోల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుతో అభిమానులు నలిగిపోతున్నారు. ఒకప్పుడు ఫ్యామిలీకీ హోల్ సేల్ ఫ్యాన్స్ గా ఉన్న మనం ఇలా హీరోల మధ్య గ్యాప్  తో విడిపోవడం ఎంత వరకు కరెక్ట్ అనే భావన అభిమానుల్లో ఉంది. ఫ్యామిలీలో ఒక్కడే స్టార్ హీరో ఉన్నప్పుడు బాగా ఉండేది. ఇప్పుడు అందరూ స్టార్ హీరోలు అయ్యేసరికి ఎవరి ఫ్యాన్ ఫాలోయింగ్ వారికి పెరిగి అది హీరోల మధ్య ఆధిపత్యపోరుకు దారితీస్తుందనేది ఫ్యాన్స్ టాక్. ఇప్పటికైనా సొంత ఫ్యామిలీలో ఉన్న చిన్న చిన్న ఇష్యూస్ ను సెటిల్ చేసుకొని మళ్లీ అందరం కలిసి సందడి చేయాలని నందమూరి, మెగా ఫ్యామిలీస్ కోరకుంటున్నారు. ఫ్యాన్స్ భావిస్తున్నట్లుగా ఈ హీరోలంతా కలిసి మళ్లీ ఏకమవుతారా లేక ఎప్పటిలాగే తమ అభిమాన హీరోకు మద్దతుగా ఇతర హీరోలపై వార్ ప్రకటిస్తారో వేచి చూడాలి.

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News