Nandamuri Balakrishna Remuneration : బాలయ్య రెమ్యూనరేషన్ మరీ అంత తక్కువా?.. చిరంజీవిని అందుకోలేనంత దూరంలో

Nandamuri Balakrishna Remuneration నందమూరి బాలకృష్ణ రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం చర్చ నడుస్తోంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న బాలయ్య అత్యంత తక్కువ మొత్తంలో తీసుకుంటున్నాడట.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 5, 2022, 01:20 PM IST
  • సీనియర్ హీరోల దూకుడు
  • చిరంజీవి వర్సెస్ బాలయ్య
  • రెమ్యూనరేషన్లో చిరు టాప్
Nandamuri Balakrishna Remuneration : బాలయ్య రెమ్యూనరేషన్ మరీ అంత తక్కువా?.. చిరంజీవిని అందుకోలేనంత దూరంలో

Nandamuri Balakrishna Remuneration : నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫాంలో ఉన్నాడు. అఖండ సినిమాతో తిరుగులేని హిట్ కొట్టేశాడు. అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. అయితే కరోనా సమయంలో సినిమా విడుదల అవ్వడం, ఏపీలో తక్కువ టికెట్ రేట్లు ఉండటంతో అఖండ భారీ లాభాలు రాలేదు. కానీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అయింది. సినిమా ఎంత పెద్ద హిట్ అయినా కూడా బాలయ్య మాత్రం ఎక్కువ రెమ్యూనరేషన్ అడగలేదట. కేవలం ఎనిమిది కోట్లు మాత్రం పుచ్చుకున్నాడని టాక్.

అఖండ తరువాత అయినా బాలయ్య రెమ్యూనరేషన్ పెంచుతాడని అంతా అనుకున్నారట. కానీ బాలయ్య మాత్రం ఎక్కువ రెమ్యూనరేషన్ అడగడం లేదు. కేవలం రెండు కోట్లు పెంచాడట. గోపీచంద్ మలినేని తీస్తోన్న వీర సింహారెడ్డి కోసం ముందుగా ఎనిమిది కోట్లే అనుకున్నారట. కానీ అఖండ హిట్టుతో పన్నెండు కోట్ల రెమ్యూనరేషన్ అడిగినట్టు తెలుస్తోంది. ఆ మొత్తాన్ని ఇచ్చేందుకు నిర్మాతలు కూడా అంగీకరించాడట. అయితే అనిల్ రావిపూడితో చేయబోతోన్న సినిమాకు ముందుగా పన్నెండు కోట్లు ఇస్తామని అన్నారట. కానీ మళ్లీ ఇప్పుడు ఆ మొత్తాన్ని కూడా పెంచుతున్నారట నిర్మాతలు.

ఇలా బాలయ్య మాత్రం చాలా నెమ్మదిగా, తక్కువ మొత్తంలోనే రెమ్యూనరేషన్ పెంచుతున్నాడు. అది నిర్మాతలకు పెద్ద భారంగా కూడా అనిపించడం లేనట్టుగా ఉంది.కానీ చిరంజీవి మాత్రం ఏకంగా నలభై యాభై కోట్లు తీసుకుంటున్నాడట. కానీ ఆ సినిమాలు లాభాలు మాత్రం గడించడం లేదు. అయినా చిరు సినిమాలు అంటే అందులో కొణిదెల ప్రొడక్షన్స్ కూడా భాగస్వామిగా ఉంటుంది కాబట్టి.. పెద్ద ప్రభావం ఏమీ కనిపించడం లేదని తెలుస్తోంది.

చిరంజీవి రెమ్యూనరేషన్, బాలయ్య రెమ్యూనరేష్‌ మధ్య తేడా మాత్రం చాలానే ఉంది. బాలయ్య ఒక వేళ అంతగా డిమాండ్ చేస్తే.. నిర్మాతలు ముందుకు వస్తారా? లేదా? అన్నది చూడాలి. కానీ మొన్నీ మధ్య బాలయ్య చేసిన యాడ్ కోసం దాదాపు పదిహేను కోట్లకు పైగా తీసుకున్నాడనే టాక్ వచ్చింది. ఆ మొత్తాన్ని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికే ఇచ్చేశాడన్న సంగతి తెలిసిందే.

Also Read : చంటి బిడ్డతో ఫోటో షేర్ చేసిన రానా భార్య.. శుభాకాంక్షలు వెల్లువ.. అసలు విషయం ఇదే!

Also Read : Jabardasth Varsha Emmanuel : పిచ్చి ముదిరింది.. స్టేజ్ మీదే వర్ష మెడలో తాళి కట్టిన ఇమాన్యుయేల్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News