Nagarjuna: కొండా సురేఖ పై పరువు నష్టం.. నాగ్ పిటీషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ..!

Konda Surekha - Nagarjuna: అక్కినేని ఫ్యామిలీ పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల.. ప్రభావం ఇప్పుడల్లా తగ్గేలా లేదు. ముఖ్యంగా ఈ విషయం సద్దుమణుగుతుందేమో అనుకునే లోపు.. నాగార్జున ఏకంగా కోర్టుమెట్లు ఎక్కాడు. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు కాస్తా ప్రస్తుతం పెద్ద దుమారమే రేపుతున్నాయి. తాజాగా కోర్ట్ హియరింగ్ గురించి కొత్త అప్డేట్ కూడా వచ్చింది..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Oct 10, 2024, 11:49 AM IST
Nagarjuna: కొండా సురేఖ పై పరువు నష్టం.. నాగ్ పిటీషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ..!

Nagarjuna Court Hearing : తెలంగాణ మంత్రి కొండా సురేఖ నటుడు అక్కినేని నాగార్జున వివాదం.. ఒక కొలిక్కి వచ్చింది అనుకునే లోపే.. ఇది కాస్త పీక్స్ కి చేరిపోయింది. కొండా సురేఖ నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను భేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పినా ఆయన మాత్రం పరువు నష్టం కేసు వేశారు. ముఖ్యంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఎవరు సమర్ధించకపోవడం గమనార్హం.

ముఖ్యంగా అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టులో ఏకంగా పరువు నష్టం దావా కేస్ వేసే పరిస్థితికి వచ్చింది అంటే ఆ కుటుంబం కొండా సురేఖ మాటల వల్ల ఎంత మానసిక క్షోభ అనుభవించిందో అర్థం అవుతుంది. ఇకపోతే ఇంతటితో ఈ వివాదాన్ని ముగించాలని అధికార కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజ్ఞప్తి చేసినా మరొకవైపు కొండా సురేఖ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నప్పటికీ కూడా నాగార్జున ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. 

అంతేకాదు కాంగ్రెస్ కు  వ్యతిరేకంగా దీని వెనుక ఎవరైనా ఉండి నడిపిస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.  ఎందుకంటే అక్కినేని నాగార్జున మొదట్లో కాంగ్రెస్ ప్రభుత్వంతో సన్నిహితంగా వ్యవహరించినప్పటికీ కూడా.. ఆ తర్వాత ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేయడం దీనికి తోడు కొండ సురేఖ తమ కుటుంబం చేసిన కామెంట్లకు ఆయన పూర్తిస్థాయిలో హర్ట్ అయినట్లు తెలుస్తోంది. 

ఇక ఇప్పుడు దొరికింది అవకాశంగా నాగార్జున రివేంజ్ తీర్చుకోపోతున్నారు అని ఎన్ కన్వెన్షన్ నష్టాన్ని ఇలా పూడ్చుకోబోతున్నారు అంటూ చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా గతంలో నాగార్జున పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ జరపగా.. దానిని తదుపరి రోజుకు వాయిదా వేసింది. ఈ క్రమంలోని నేడు నాగార్జున పిటిషన్ పై నాంపల్లి కోర్టులో మరోసారి విచారణ జరగనుంది. 

మంత్రి కొండా సురేఖ పై పరువు నష్టం పిటిషన్ వేసిన నాగార్జున ఈరోజు రెండో సాక్షి స్టేట్మెంటును కోర్టు రికార్డు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే నాగార్జున మొదటి సాక్షి సుప్రియ స్టేట్మెంటును కోర్టు రికార్డు చేసింది. ఇక ఇప్పుడు రెండో సాక్షితో స్టేట్మెంట్ తీసుకోబోతున్నట్లు సమాచారం. మరి పూర్తి వాంగ్మూలాలు సేకరించిన తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందో చూడాలి.

Also read: Bank Holidays 2024: ఆ 5 రోజులు బ్యాంకులకు సెలవులు, ఏ రాష్ట్రాల్లో ఎప్పుడు సెలవు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News