Trivikram Srinivas:
ప్రస్తుతం టాలీవుడ్ లో లీడింగ్ నిర్మాతల్లో ఒకరు నాగవంశీ. పెద్ద హీరోలు.. చిన్న హీరోలు అని తేడా లేకుండా అందరి హీరోలతో సినిమాలు చేస్తూ సూపర్ హిట్లు అందుకుంటున్నారు. ఈ క్రమంలో నాగ వంశీ ఎన్నో అంచనాల మధ్య విడుదల చేసిన గుంటూరు కారం చిత్రం మాత్రం ప్టాప్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో నాగ వంశీ ఈ మధ్య సోషల్ మీడియాలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో గుంటూరు కారం చిత్రం గురించి అలానే పలు తెలుగు చిత్రాల గురించి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు.
ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న రివ్యూయర్ కి
నాగవంశీకి మధ్య.. ఒక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ జరగగా అది కాస్త పూర్తిగా డిబేట్ గా మారింది. ముందుగా నాగ వంశీ ప్రభాస్ సలార్ సినిమాలో ఎలివేషన్స్ సీన్స్ గురించి మెచ్చుకోగా.. రివ్యూయర్ మాత్రం అసలు ప్రభాస్ టాటూ చూసి అక్కడ ఉన్న వాళ్ళు భయపడడం ఎందుకు.. కాల్చిపడేయకుండా అని అడిగారు. అందుకు సమాధానంగా నాగవంశీ సినీ ప్రేక్షకులకు ఎలివేషన్స్ నచ్చుతాయని.. లాజిక్స్ అక్కడ ఆలోచించడం అనవసరం అని తన సమాధానం ఇచ్చారు. అంతేకాదు అలాంటి సీన్స్ వల్లే ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని.. సలార్ సినిమా అందుకే అన్ని కలెక్షన్స్ తెచ్చుకోగలిగిందని తెలియజేశారు.
కాగా గుంటూరు కారం చిత్రం గురించి టాపిక్ రాగా.. కొంతమంది మహేష్ బాబు గుంటూరు కారం సినిమా మాస్ చిత్రం అనుకున్నారని కానీ థియేటర్ కి వచ్చాక అది కాస్త ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వారికి అనిపించి ఉండొచ్చని.. మరి కొంతమంది ఫ్యామిలీ సినిమా అనుకుంటే అది వారికి ఫుల్ లెంగ్త్ లో నచ్చుండకపోవచ్చు అని చెప్పుకొచ్చారు. ఇక ఈ మధ్య మహేష్ బాబు సినిమాలలో లాస్ట్ పాట బాగా మాస్ గా ఉంది బ్లాక్ బస్టర్ అవుతుండటం వల్ల.. గుంటూరు కారంలో కూడా చివర్లో కుర్చీ మడత పెట్టి పాట పెట్టమని చెప్పారు. అక్కడ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలి అని చూసాం కానీ ఆ టైంలో శ్రీ లీల చీర కట్టుకుంటుందా ఇక్కడ పాటెందుకు వస్తుంది అనే లాజిక్స్ ఆలోచించలేదని చెప్పుకొచ్చారు.
A Producer & A Reviewer discussing about Logics in Films - 1st time anukunta ilanti interview 🤯#Salaar gurinchi correct ga chepparu @vamsi84 garu❤️
He also talks about the issues with #GunturKaaram & #BheemlaNayak #Prabhas #MaheshBabu #PawanKalyan pic.twitter.com/Sd9FIBgJvR— Ayyo (@AyyAyy0) March 26, 2024
కాగా రివ్యూయర్ త్రివిక్రమ్ ఇటీవల సినిమాల గురించి టాపిక్ తీసుకొని వచ్చి త్రివిక్రమ్ బ్రో చిత్రం కూడా సరిగ్గా తీయలేకపోయారు అనే టాక్ ఉంది అనగా.. నాగ వంశీ ఆ విషయంపై కొంచెం ఘాటుగానే స్పందించారు.
పవన్ కళ్యాణ్ బ్రో సినిమాకు అసలు త్రివిక్రమ్ కి సంబంధం లేదని. భీమ్లా నాయక్ చిత్రంలో అన్న త్రివిక్రమ్ ఇన్వాల్వ్ అయ్యారు కానీ బ్రో సినిమా టైంలో త్రివిక్రమ్.. గుంటూరు కారం చిత్రం పనుల్లో బిజీగా ఉన్నారు అని తెలియజేశారు. మొత్తానికి నాగ వంశీ చేసిన ఈ కామెంట్స్ అన్ని ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Also Read: Love Guru Trailer: 'లవ్‌గురు'తో వస్తున్న బిచ్చగాడు హీరో.. ట్రైలర్ చూస్తే నవ్వులే
Also Read: Whatsapp New Feature: వాట్సప్ AI ఫోటో ఎడిటింగ్ ఫీచర్, ఎలా పనిచేస్తుందంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter