Megastar Chiranjeevi Upcoming Movies: వరుస సినిమాలు లైన్లో పెట్టిన చిరు.. లిస్టు చూసేద్దామా?

Megastar Chiranjeevi Upcoming Movies List and Details: మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాల మీద ఒక లుక్ వేద్దాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 22, 2022, 10:50 AM IST
Megastar Chiranjeevi Upcoming Movies: వరుస సినిమాలు లైన్లో పెట్టిన చిరు.. లిస్టు చూసేద్దామా?

Megastar Chiranjeevi Full Movies List: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరోగా అలాగే ఇతర పాత్రల్లో నటించిన అన్ని సినిమాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆయన ముందుగా పునాది రాళ్లు అనే సినిమాలో నటించారు. కానీ అంతకంటే ముందు ప్రాణం ఖరీదు సినిమా విడుదలైంది. పునాదిరాళ్లు సినిమా కొన్ని అనివార్య కారణాలతో విడుదల ఆలస్యం కావడంతో ప్రాణం ఖరీదు సినిమా ముందుగా విడుదలైంది. తర్వాత మన ఊరి పాండవులు, తాయారమ్మ బంగారయ్య, కుక్క కాటుకు చెప్పు దెబ్బ, కొత్త అల్లుడు, ఐ లవ్ యు, పునాదిరాళ్లు, ఇది కథ కాదు, శ్రీరామబంటు, కోతల రాయుడు, అగ్ని సంస్కారం, కొత్తపేట రౌడీ, చండీప్రియ, ఆరని మంటలు, జాతర, మోసగాడు, పున్నమినాగు, నకిలీ మనిషి, కాళీ, తాతయ్య, ప్రేమ లీలలు, లవ్ ఇన్ సింగపూర్, ప్రేమ తరంగాలు, మొగుడు కావాలి, రక్త బంధం, ఆడవాళ్లు మీకు జోహార్లు, ప్రేమ నాటకం, పార్వతీ పరమేశ్వరులు, 47 రోజులు, తోడుదొంగలు, తిరుగులేని మనిషి, న్యాయం కావాలి, ఊరుకిచ్చిన మాట, రాణిగాజుల రంగమ్మ, శ్రీరస్తు శుభమస్తు, ప్రియ, చట్టానికి కళ్ళు లేవు, కిరాయి రౌడీలు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, శుభలేఖ వంటి సినిమాలు చేశారు. 

తరువాత ఇది పెళ్ళంటారా, సీతాదేవి, రాధా మై డార్లింగ్, టింగు రంగడు, పట్నం వచ్చిన పతివ్రతలు, బిల్లా రంగా, యమకింకరుడు, మొండిఘటం, మంచు పల్లకి, బంధాలు అనుబంధాలు, ప్రేమ పిచ్చోళ్ళు, పల్లెటూరి మొనగాడు, అభిలాష, ఆలయ శిఖరం, శివుడు శివుడు శివుడు, పులి బెబ్బులి,గుడాచారి నం.1, మా ఇంటి ప్రేమాయణం, మగ మహారాజు, ,రోషగాడు, సింహపురి సింహం రాజ, ఖైదీ, మంత్రి గారి వియ్యంకుడు, సంఘర్షణ, అల్లుళ్లున్నారు, గూండా, హీరో, దేవాంతకుడు, మహానగరంలో మాయగాడు, ఛాలెంజ్, ఇంటిగుట్టు, నాగు, అగ్ని గుండం,  రుస్తుం, చట్టంతో పోరాటం, దొంగ, చిరంజీవి, జ్వాలా,  పులి, రక్త సింధూరం, అడవి దొంగ, విజేత, కిరాతకుడు,  కొండవీటి రాజా, మగధీరుడు, వేట,  చంటబ్బాయి, రాక్షసుడు, ధైర్యవంతుడు, చాణక్య శపథం, దొంగ మొగుడు, ఆరాధన, త్రిమూర్తులు, చక్రవర్తి, పసివాడి ప్రాణం వంటి సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించారు. 

, త్రినేత్రుడు, యుద్ధభూమి, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, స్టేట్ రౌడీ, రుద్రనేత్ర, లంకేశ్వరుడు, కొండవీటి దొంగ, జగదేక వీరుడు అతిలోక సుందరి,  కొదమ సింహం, రాజా విక్రమార్క,, స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు, ఆపద్బాంధవుడు, ముఠా మేస్త్రి, మెకానిక్ అల్లుడు, ముగ్గురు మొనగాళ్ళు,  ఎస్పీ పరశురాం, అల్లుడా మజాకా , రిక్షవోడు, హిట్లర్, మాస్టర్, బావగారూ బాగున్నారా?, చూడాలని వుంది, స్నేహం కోసం, విజయ్, అన్నయ్య, హ్యాండ్సప్, మృగరాజు, శ్రీ మంజునాథ, ఇంద్ర, ఠాగూర్, అంజి, శంకర్ దాదా MBBS, అందరివాడు, జై చిరంజీవ, హనుమాన్, స్టాలిన్, శంకర్ దాదా జిందాబాద్, మగధీర అతిథి పాత్ర, జగద్గురు ఆదిశంకర- అతిథి పాత్ర, బ్రూస్ లీ: ది ఫైటర్- అతిథి పాత్ర,  ఖైదీ నం. 150, సైరా నరసింహా రెడ్డి నరసింహారెడ్డి, ఆచార్య అనే సినిమాలు ఇప్పటికే విడుదల అయ్యాయి.

Megastar Chiranjeevi Upcoming Movies List and Details: ఇక మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన 153వ చిత్రంగా గాడ్ ఫాదర్ అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమా లూసిఫర్ అనే మలయాళ సినిమాకు తెలుగు రీమేక్. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాను తెలుగులో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు నయనతార, సత్యదేవ్, సల్మాన్ ఖాన్, సునీల్, సముద్రఖని, పూరి జగన్నాధ్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాను సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఇక 154వ చిత్రంగా బాబీ దర్శకత్వంలో సినిమా రూపొందుతోంది.

వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ఈ సినిమాకి ఫిక్స్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అదేవిధంగా మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 155వ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. అలాగే క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ మీద కేఎస్ రామారావు సహ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. కీర్తి సురేష్ మెగాస్టార్ చెల్లెలి పాత్రలో కనిపిస్తోంది. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వేదాళం అనే సినిమాకు ఇది తెలుగు రీమేక్ గా రూపొందుతోంది. ఈ సినిమాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి యువ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాని ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బడ్జెట్ సినిమాను నిర్మించిన డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిర్మించబోతున్నారు.

Also Read: Megastar Chiranjeevi Birthday Special: మొగల్తూరు టు ఫిలింనగర్.. స్వయంకృషే పెట్టుబడి!

Also Read: Megastar Chiranjeevi Unknown Facts: చిరంజీవికి 10 బిరుదులు.. ఆ షూటింగ్లో విష ప్రయోగం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News