Manchu Family Dispute : మంచు మనోజ్ చిన్న వాడన్న విష్ణు.. తనకేమీ తెలియదన్న మంచు లక్ష్మీ

Mohan Babu and Vishnu on Manchu Manoj మంచు వారి కుటుంబం పరువు, మర్యాద అంతా కూడా రోడ్డు మీదకు వచ్చినట్టు అయింది. మంచు మనోజ్, విష్ణుల గొడవకు సంబంధించిన వీడియో ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 24, 2023, 01:36 PM IST
  • మంటగలిసిన మంచు వారి మర్యాదలు
  • అన్నాదమ్ముల గొడవలతో రచ్చ రచ్చ
  • స్పందించిన మంచు లక్ష్మీ, విష్ణు
Manchu Family Dispute : మంచు మనోజ్ చిన్న వాడన్న విష్ణు.. తనకేమీ తెలియదన్న మంచు లక్ష్మీ

Mohan Vishnu on Manchu Manoj మంచు మనోజ్ షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఇంత వరకు గుట్టుగా ఉన్న మంచు వారి విభేదాలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. నడి రోడ్డు మీద మంచు వారి గౌరవం పోయినట్టుగా అయింది. మంచు మనోజ్, మంచు విష్ణుల ఇలా గొడవ పడటంపై మోహన్ బాబు స్పందించాడు. సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అంటూ మోహన్ బాబు చెప్పుకొచ్చాడు.

అయితే ఈ గొడవ మీద, మనోజ్ షేర్ చేసిన వీడియో మీద మంచు విష్ణు స్పందించాడు. ఇది చాలా చిన్న గొడవ అని, దానికి మనోజ్ స్పందించాల్సిన అవసరం లేదని, మనోజ్ ఇంకా చిన్న వాడని మంచు విష్ణు మీడియాతో మాట్లాడాడు. సారథి వాగ్వాదాన్ని మనోజ్ ఆపలేకపోయాడని విష్ణు అన్నాడు.

ఇక ఇదే వివాదం మీద మంచు లక్ష్మీ స్పందించింది. ఈ గొడవ గురించి తనకేమీ తెలియదని, తాను ఏ వీడియో చూడలేదని, మనోజ్ పెట్టిన పోస్ట్ గురించి తనకు తెలియదని, వివాదం గురించి తెలిశాక మాట్లాడతాను అని క్లారిటీగా చెప్పింది మంచు లక్ష్మీ.

మంచు ఫ్యామిలీ మీద ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు అందరికీ తెలిసిందే. ఒక తల్లి కడుపున బిడ్డలే గొడవలు పడుతుంటే.. సవతి బిడ్డలు ఇలా గొడవలు పడటంలో ఆశ్చర్యం ఏముందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మోహన్ బాబు మొదటి భార్యకు మంచు విష్ణు, మంచు లక్ష్మీలు సంతానం కలగగా.. రెండో భార్యకు మంచు మనోజ్ పుట్టాడు. మొత్తానికి ఇప్పుడు మంచు వారి మధ్య విబేధాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. మంచు ఫ్యామిలీ మీద జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.

Also Read:  Manchu Manoj Vs Manchu Vishnu: రోడ్డున పడ్డ మంచు గౌరవం?.. ఇంటిపై దాడులు చేస్తాడు మంచు విష్ణు వీడియో షేర్ చేసిన మనోజ్

Also Read: Manchu Family Fighting : మంచు బ్రదర్స్ వివాదం.. రంగంలోకి మోహన్ బాబు?.. వెనక్కి తగ్గిన మనోజ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News