MAA Elections 2021 Mohan Babu Final Request to Voters to vote Manchu Vishnu in Movie Artists Association elections: మరికొన్ని గంటల్లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు జరగనున్నాయి. గత కొన్ని రోజలుగా మా ఎన్నికల అంశం సినీ ఇండస్ట్రీతో పాటు తెలుగు రాష్ట్రాలో హాట్ టాపిక్ మారింది. అటు ప్రకాశ్‌రాజ్ (Prakash Raj) ప్యానెల్, ఇటు మంచు విష్ణు (Manchu Vishnu) ప్యానెల్ ల మధ్య మాటల యుద్ధం మామూలుగా లేదు. ఈ రెండు ప్యానెల్స్ చివరి క్షణం వరకు ‘మా’ సభ్యులను ఆకట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.
ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు రెండు వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో తన కుమారుడు మంచు విష్ణుకు ఓటు వేయాలంటూ మోహన్‌బాబు (Mohan Babu) ‘మా’ సభ్యులను (Maa Members) కోరారు. ఈ మేరకు వారికి పంపిన వాయిస్ మెస్సేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వాయిస్ మెస్సేజ్‌లో (voice message) మోహన్‌బాబు ఇలా చెప్పారు..
Also Read : Weird Ritual: ఛత్తీస్‌గఢ్‌లో వింత ఆచారం..వరుడికి గిఫ్ట్‌గా 21 విషపూరిత పాములు
తెలుగు వాళ్లు ఒకటిగా ఉండాలనే ఉద్దేశంతో ‘మా’ (MAA) ఏర్పాటు చేశారన్నారు. ప్రస్తుతం ‘మా’ ఎన్నికల పరిస్థితి చూస్తే తన మనసుకు కష్టంగా ఉందని తెలిపారు. అసలు ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకుందామని పెద్దలు అనేవారని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు కొంతమంది సభ్యులు రోడ్డునపడి నవ్వులపాలవుతున్నారన్నారు. ఎవరు ఏం చేసినా ‘మా’ అనేది ఒక కుటుంబం అని అన్నారు మోహన్‌బాబు ( Mohan Babu). ఇక విష్ణు గెలిచాక రెండు రాష్ట్రాల సీఎంలను (CM) కలుస్తారన్నారు. సినీ పరిశ్రమ కష్టాలను వారికి చెప్పుకుందామన్నారు. మేనిఫెస్టోలోని హామీలను విష్ణు నెరవేరుస్తాడనే నమ్మకం ఉందన్నారు. విష్ణు మీ కుటుంబ సభ్యుడు.. ఓటు వేసే ముందు మనస్సాక్షితో ఆలోచించి ఓటు వేయండి అని కోరారు. మా ఎన్నికల (MAA Elections) నేపథ్యంలో.. ‘మా’ సభ్యులకు మోహన్‌బాబు ప్రత్యేకంగా పంపిన వాయిస్ మెస్సేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : Update on MAA Election Results: రేపే 'మా' ఎన్నికలు.. రేపే ఫలితాల వెల్లడి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook