Hasina Pagal Deewani song trends on YouTube - Watch: బాలీవుడ్ భామ కియారా అద్వానీ (Kiara Advani) లేడీ ఓరియంటెడ్ చిత్రం విడుదలకు ముందే రికార్డులను సృష్టిస్తోంది. అయితే.. కియారా అద్వానీ తాజాగా నటిస్తున్న చిత్రం ‘‘ఇందూ కీ జవానీ’’ ( Indoo Ki Jawani) లోని పాట వచ్చిరాగానే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది. ఈ సినిమాలోని హసీనా పాగల్ దివానీ అనే వీడియో సాంగ్‌ను మంగళవారం (సెప్టెంబరు 15న) చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాటలో కియారా అద్భుతమైన లుక్‌తో అందరూ.. అందరూ కళ్లప్పగించి చూసేలా హుక్ స్టెప్ వేసింది. ఆదిత్యసీల్‌తో కలిసి కియారా అదిరిపోయే స్టెప్పులేస్తున్న ఈ హసీనా పాగల్ దివానీ వీడియో సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది. దీంతోపాటు వీడియో షేరింగ్ సైట్‌లో ఈ పాట 3వ స్థానంలో ఉంది. యూట్యూబ్‌లో ఇప్పటికే ఈ వీడియో సాంగ్‌ను 1కోటి 35లక్షల 50వేల 794 వీక్షణలను సంపాదించింది.
అయితే షబ్బీర్ అహ్మద్ రాసిన హసీనా పాగల్ దివానీ పాటను మికాసింగ్, అసీస్ కౌర్ పాడారు. ఇందూకీ జవానీ చిత్రానికి అభిర్ సేన్‌గుప్తా దర్శకత్వం వహిస్తుండగా.. కియారా అద్వానీ, ఆదిత్య సీల్, మల్లికా దువా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కియారా అద్వానీ ఇప్పటికే అక్షయ్ కుమార్ తో లక్ష్మీబాంబ్ చిత్రంలో నటించింది. దీంతోపాటు తదుపరి చిత్రాలు భూల్ భూలయ్యా-2, షేర్షా సినిమాల్లో నటించనుంది. Also read: Rakul Preet Singh: ఆ వార్తలను నిలువరించాలంటూ.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్
అయితే అంతకుముందు కియారా అద్వానీ టాలీవుడ్‌లో మహేశ్ బాబు సినిమా భరత్ అనే నేనుతో అరంగ్రేటం చేసింది. ఆ తర్వాత వినయ విధెయ రామలో రామ్ చరణ్ సరసన నటించింది. ఆ తర్వాత ఈ భామ బాలీవుడ్ (Bollywood) చిత్రాల్లోనే నటిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే ఈ పాట టాలీవుడ్ సినిమా రవితేజ ఇడియట్‌లోని చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే పాటకు రిమిక్స్ చేసినట్లుంది. Also read: MP Sanjay Raut: భాబిజీ పాపడ్ తిని కరోనా నుంచి కోలుకున్నారా..?
Kiara Advani: రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టిస్తున్న హసీనా సాంగ్