Karthika Deepam 2: కార్తీక్‌ పోలీస్‌ కంప్లైంట్‌.. జ్యోత్స్న అరెస్ట్‌, దశరథ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి..

Karthika Deepam 2 Today January 18th Episode: కాశీని డబ్బు అడగకపోవడానికి కారణాలు చెబుతాడు కార్తీక్‌. నీకు వెనుక ముందు సాయం చేసేవారు ఎవరూ లేరు కదా అంటాడు.దీంతో కాశీ కన్నీరు పెట్టుకుంటాడు. మంచోళ్లకే దేవుడు కష్టాలు పెడతాడు అంటాడు. ముందు నేను ఇల్లు తర్వాత కట్టుకుంటాను కానీ, ముందు శౌర్యకు ఆపరేషన్ చేయించు అంటాడు.

Written by - Renuka Godugu | Last Updated : Jan 18, 2025, 10:31 AM IST
Karthika Deepam 2: కార్తీక్‌ పోలీస్‌ కంప్లైంట్‌.. జ్యోత్స్న అరెస్ట్‌, దశరథ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి..

Karthika Deepam 2 Today January 18th Episode:  తీసుకుంటాను కాశీ, తీసుకుంటాను కానీ, ఈ విషయాలు ఎవరికీ తెలియకూడదు అంటాడు. ముఖ్యంగా మీ అక్కకు తెలియకూడదు అంటాడు. అక్కకు నేను అబ్దం చెప్పలేను అంటాడు కాశి. అయితే, నువ్వు వెళ్లిపో అంటాడు కార్తీక్‌ లేదు బావ అలా అంటావు. శౌర్యకు అలా అవుతే ఎలా అంటాడు. భగవంతుడు నా ప్రాణాల్ని తక్కెట్లో పెట్టి డబ్బుతో తూకం పెట్టాడు. నేను ఓడిపోను మా ముగ్గురిదీ ఒక్కటే ప్రాణం. కూతురు ప్రాణాలు దక్కించుకోకపోతే తండ్రిని ఎలా అవుతాను అంటాడు.

ఎలా చేస్తావు బావ? ఏం చేస్తావు? అంటాడు ఏదో ఒకటి చేస్తాను అంటాడు కార్తీక్‌. అవును నువ్వేంటి వర్కింగ్‌ అవర్స్‌ బయట తిరుగుతున్నావు? అంటాడు కార్తీక్‌.. నాన్న కనిపించడంలేదు అందుకే వెతుకుతున్నా. నిన్న రాత్రి నుంచి ఫోన్‌ కూడా లేదు భయంగా ఉంది బావ అంటాడు కాశీ. అయితే, పోలీస్ కంప్లైంట్‌ ఇద్దాం పదా అంటాడు కార్తీక్‌. ఇద్దరూ కలిసి వెళతారు. ఇంటి వద్ద దాసు ఏమయ్యాడు? కాశీ నుంచి కాల్‌ రాలేదు  ఇంత వరకు ఏ లోకల్‌ న్యూస్‌లో కూడా చచ్చినట్లు వార్త రాలేదు అని అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తుంది జ్యోత్స్న.

దాసును ఎవరైనా కాపాడారా? ఇంకా అక్కడే ఉన్నాడా? నేను కొట్టిన దెబ్బకు గ్రానీ కొడుకు బతకడం కష్టం అనుకుంటుంది. అప్పుడే పారు వచ్చి నా కొడుకును ఏంచేశావే అంటుంది ఏంటి గ్రానీ అలా అంటున్నావ్‌ అంటుంది జో. చిన్న పని ఉండి నా కొడుక్కి ఫోన్‌ చేశా వాడి ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ వస్తుంది. ఏదో ఉంది దాసు ఇంటికి రావడం నన్ను కలవకుండా నిన్ను కలవడం ఎందుకు అని అడిగితే ఏదో సమాధానం చెప్పడం అంటుంది పారు. నీకు ఏదైనా డౌట్‌ ఉంటే నీ కొడుకునే వెళ్లి అడుగు ఆ నిజాలు తెలుస్తాయి. అది అడుగుదామని కాల్‌ చేస్తే వాడి ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ వస్తోంది అంటుంది పారు. ఇదంతా పక్కనుంచి దశరథ వింటాడు. దాసు ఓ విషయం ఎందుకు అన్నయ్యకు చెప్పాలి అన్నాడు. జ్యోత్స్న బతిమిలాడటానికి దాసు చెబుతా అన్నడానికి ఏదో సంబంధం ఉంది. ఇది జ్యోత్స్న కావాలని చేసిన పని, పిన్నికి సంబంధంలేదు. ఈ విషయం జో ను అడిగినా తెలీదు. దాసు మాత్రమే చెప్పాలి అనుకుంటాడు. పారు కూడా నువ్వు చెప్పకపోయినా నిజాలు తెలుస్తాయి అని చెప్పి వెళ్లిపోతుంది. 

రోడ్డుపై దీప నడుచుకుంటూ వెళ్తుంది. నాకు తెలియనివ్వడం లేదు కానీ, శౌర్యకు ఏదో జరుగుతుంది అని ఆలోచిస్తుంది. అక్కడ ఓ ఇంట్లో రౌడీలు పిల్లవాడిని ఎత్తుకు వెళుతుంటాడు. తల్లిదండ్రుల వద్ద నుంచి లాక్కొని మరి పారిపోతుంటారు. అప్పుడే దీప వస్తుంది. వాళ్ల కళ్లలో కారం చల్లుతుంది. ఆ పిల్లవాడిని కాపాడుతుంది. వారు డబ్బున్నవారిలా కనిపిస్తారు. తల్లిదండ్రులు దీప వద్దకు వచ్చి సమయానికి వచ్చావమ్మ.. ఒక్కగానొక్క వారసుడు వీడిపోతే ఆస్తి దక్కించుకోవడానికి ఇలా చేస్తున్నారమ్మ అంటాడు. నీ రుణం మేమెప్పుడూ తీర్చుకోలేమమ్మ అని ఆ బాబు తల్లి అంటుంది. అయ్యో వద్దమ్మ.. ఏదో బాబును కాపాడాను జాగ్రత్త అంటుంది దీప. వాళ్లు కూడా థ్యాంక్స్‌ చెబుతారు.

ఇంట్లో శివన్నారాయణ జో కు రెస్టారెంట్‌ బిజినెస్‌ గురించి టిప్స్‌ చెబుతుంటాడు. అప్పుడే కాశి వస్తాడు. జో కంగారుపడుతుంది. శివన్నారాయణ ఆగు అక్కడ అంటాడు. నానమ్మతో మాట్లాడాలి అంటాడు కాశి. వీడికి ఈ మధ్య పైత్యం ఎక్కువైందిలేండి నాతో మాట్లాడట్లేదు అంటుంది పారు. నానమ్మ నాన్న నిన్నటి నుంచి కనిపించడంలేదు అంటాడు. దాసు కనిపించడం లేదా? అంటుంది సుమిత్ర. దాసు ఎలాగో దేశదిమ్మరే కదా ఏ రోడ్డు పట్టుకుని తిరుగుతున్నాడో అంటాడు శివన్నారాయణ. 

ఇదీ చదవండి: పెళ్లయిన 2 నెలలకే శుభవార్త చెప్పిన శోభిత..  నమ్మలేకపోతున్నా అంటూ వైరల్‌ పోస్ట్‌..!  

కాశి ఇంట్లో ఏమైన గొడవ జరిగిందా అంటుంది పారు. లేదు నానమ్మ నా గురించి నీకు తెలుసు కదా అంటాడు కాశి. మరి దాసు కూడా ఎవరినీ ఏ ఒక్కమాట కూడా అనడు కదా అంటుంది సుమిత్ర. మనిషి మంచివాడే కానీ రోజులే మంచివి లేవు కదా సుమిత్ర అంటాడు దశరథ. పారు కూడా కంగారు పడుతుంది. ఒంటి మీద నగలు ఉన్నాయా? చేతిలో డబ్బులు ఉన్నాయా? ఆ మనిషి ఏ గుడి దగ్గరో ఉండొచ్చు అంటాడు శివన్నారాయణ. పోలీస్‌ కంప్లైంట్‌ ఇవ్వు అంటుంది సుమిత్ర.. ఏంటి మమ్మి చిన్నపిల్లాడా అంటుంది జో. 

దశరథ ఆయన ఎక్కడ ఉన్నాడు నీకు తెలుసా? అని గట్టిగా నిలదీస్తాడు. దానికి ఎలా తెలుసు అంటాడు శివన్నారాయణ. ఏమో తెలిసే మాట్లాడుతుందేమో అంటాడు. ఏ జ్యోత్స్న నిన్నగాని మొన్న గాని దాసును ఎక్కడైనా చూశావా? అంటాడు దశరథ. లేదు డాడీ అంటుంది. నాన్న గురించి కార్తీక్‌ బావకు చెప్పా.. దగ్గరుండి బావే కంప్లైంట్‌ ఇచ్చా అంటాడు కాశి. ఏంట్రా ఇది మనిషి కనిపించకపోవడం ఏంటి? అని కన్నీటిపర్యంతమవుతుంది దీప. నువ్వు నాన్నను చివరిసారి ఎప్పుడు చూశావు నానమ్మ అంటాడు కాశి. అప్పుడు పారు ఆలోచిస్తుంది. నేను వాడిని చూసిన విషయం చెబితే జో ను కలిసిన విషయం తెలుస్తుంది అని చూడలేదు అంటుంది.

ఇదీ చదవండి: ఆధార్‌ కార్డు ద్వారా రూ.2,00,000 రుణం.. ఇలా సింపుల్‌గా దరఖాస్తు చేసుకోండి..  

సరే నానమ్మ నేనైతే పోలీస్‌ కంప్లైంట్‌ ఇచ్చా. వైజాగ్‌ వెళితే నాకు చెప్పేవాడు కానీ చెప్పలేదు. నాన్న గురించి ఏమైనా తెలిస్తే నాకు ఫోన్‌ చేయ్‌ అంటాడు కాశి. కంగారు పడకు దాసు వస్తాడు లే అంటుంది సుమిత్ర. ఈరోజు చూస్తాను రేపు పేపర్‌లో ప్రకటన ఇస్తా అని వెళ్లిపోతాడు కాశి. నా అయోమయం కొడుకు ఎక్కడికి వెళ్లాడో, ఏమయ్యోడో అని ఆలోచిస్తు బాధపడుతుంది గ్రానీ. ఇక సుమిత్ర దాసు ఎక్కడకు వెళ్లాడండి అంటుంది దశరథతో .. నాకు మాత్రం ఏం తెలుసు సుమిత్ర అంటాడు.

పోలీసులు ఎక్కడున్నా వెతికి పట్టుకుంటారు లే అని వెళ్లిపోతుంది. దశరథ కాశిగాడు ఏదో చెప్పాడు అని అనవసరంగా ఆలోచించకు అంటాడు శివన్నారాయణ. వాడు కనబడకుండా పోతేనే మనకు మంచిది అంటాడు. ఇప్పుడు పోలీస్‌ కంప్లైంట్ ఇస్తే నా ఫింగర్‌ ప్రింట్‌ దొరికిపోతుందా? అని జో ఆలోచిస్తుంది. ఏం జ్యోత్స్న నువ్వు దాసును చూశావా అంటాడు దశరథ. నాకేం తెలీదు అని కంగారు పడి వెళ్లిపోతుంది. దశరథ కూడా ఆలోచిస్తాడు పోలీసులకు తెలిస్తే మొదట నన్ను ఎంక్వైరీ చేస్తారు. కాశీని ఆపాలంటే ఏంచేయాలి? దాసును ఏం చేస్తే దాసును కాపాడతాను. పోలీసులకు తెలిస్తే జ్యోత్స్నను అరెస్ట్‌ చేస్తారు. ఇప్పుడు దాసును నేనేం ఏం చేయాలి? అని ఆలోచిస్తుంటాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News