Karthika Deepam 2: జోత్స్నకు చెమటలు పట్టించిన దశరథ.. చేసిన పాపం దాచేశాడు, దీప నుంచి శౌర్య దూరం..

Karthika Deepam 2 Today 17th Episode: ఇంటికి వచ్చిన దశరథను ఎక్కడికి వెళ్లారు అడుగుతుంది సుమిత్ర. దశరథ జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. మన రూమ్‌ డోర్‌ లాక్‌ చేసింది మీరేనా? అంటుంది. ఇవన్నీ ఎవరు చేశారు నాకు అర్థం కావడం లేదు అంటుంది. ఆ పనిచేశా డాడీని చూస్తే నాపై డౌట్ వచ్చిందేమో అనిపిస్తుంది అని జో మనస్సులో అనుకుంటుంది. నువ్వు మొబైల్‌ మర్చిపోయావు ఏమో, పనిమనిషి డోర్‌ లాక్‌ చేసినట్లుంది ఏం జ్యోత్స్న అంటాడు. 

Written by - Renuka Godugu | Last Updated : Jan 17, 2025, 10:43 AM IST
Karthika Deepam 2: జోత్స్నకు చెమటలు పట్టించిన దశరథ.. చేసిన పాపం దాచేశాడు, దీప నుంచి శౌర్య దూరం..

Karthika Deepam 2 Today 17th Episode: శివన్నారాయణ ఏంట్రా కొత్తగా మాట్లాడుతున్నావ్‌ అంటాడు. కొత్త విషయాలు తెలిసినప్పుడు కొత్తగానే ఉంటుంది అంటాడు దశరథ. చేతికి రక్తం అంటుకుంటుంది. ఏంటండి ఇది అంటుంది సుమిత్ర దారిలో ఒకరికి యాక్సిడెంట్‌ జరిగితే హెల్ప్‌ చేశా అప్పుడు అంటుకున్నట్లుంది ఈ బ్లడ్‌ అంటాడు. అంతేనా అంటుంది పారు. ఎవరో దానిన పోయేవాడికి జరిగిందా? అంటుంది. ముందెళ్లి ఆ రక్తాన్ని కడుక్కుని రా అంటాడు శివన్నారాయణ. అంటిన రక్తాన్ని కడుక్కోగలం కానీ, చేసిన పాపం పోదు కదా అంటాడు దశరథ. డాడీ అంతా చూసినట్లు మాట్లాడుతున్నాడు దాసు చచ్చిపోయాడా? బతికాడా? డాడీ కాపాడింది దాసును కాదు కదా అని ఆలోచిస్తుంది జో.

మరోవైపు శౌర్యకు మందులు ఇస్తుంది దీప. శౌర్య మెడలో లాకెట్‌ ఉంటుంది. దీప చూసి ఒకసారి ముట్టుకోవద్దంటే మళ్లీ ఎందుకు తీసుకున్నావ్ అంటుంది దీప. నాన్నే ఇచ్చాడు అంటుంది శౌర్య. నేనే ఇచ్చాను దీప అంటాడు కార్తీక్‌. బాబు ఇది మీ ప్రాణదాతది ఎవరికీ ఇవ్వను అన్నారు అంటుంది దీప. ఇప్పటి నుంచి ఇది నాదేనట అంటుంది శౌర్య. ఇప్పటికీ రెండు మూడుసార్లు శౌర్య బతిమిలాడినా ఇవ్వలేదు ఇప్పుడు ఎందుకు ఇచ్చారు అని దీప ఆలోచిస్తుంది.

సరే పడుకుందామని ముగ్గురూ పడుకుంటారు. కార్తీక్‌ ఏదో ఆలోచించడాన్ని దీప గమనిస్తుంది. కార్తీక్‌ బాబు ఏదో అర్జంట్‌ పని ఉంది అని వెళ్లారు అంటుంది. తెలిసిన వారిని కలవాలని వెళ్లాను దీప అంటాడు. దీప.. వాడు నా ఫ్రెండే నువ్వు నా మాట కాదనవని సరే అన్నాను. వాడు భార్యను తీసుకెళ్లి బెంగుళూరుకు వెళ్లాడు. అమ్మ,  కూతురు ఉన్నారు. వాడికి తోడుగా శౌర్యను వదలమన్నాడు. వాళ్లింటికి శౌర్యను ఎలా పంపిస్తాం బాబు అంటుంది దీప. వాళ్లది పెద్ద ఇల్లు, స్విమ్మింగ్ పూల్ అన్ని ఉంటాయి. పాపం వాడి కూతురుకు ఫ్రెండ్‌ లేకపోయే సరికి అడిగాడు. రేపు మార్నింగ్‌ వెళ్లాలి అంటాడు. వద్దు బాబు మీ ఫ్రెండ్‌కు సారీ చెప్పండి. ఆరోగ్యం బాగులేని శౌర్యను ఎలా పంపిస్తాం బాబు అంటుంది. ఆరోగ్యం బాగు చేయడానికే దీప అంటాడు కార్తీక్‌. అక్కడికి వెళ్తే నయం అవుతుందా? అడుగుతుంది దీప నయమవుతుంది అంటాడు.

మీ మాటలు నాకు అర్థం కావడం లేదు బాబు అంటుంది దీప. ఇప్పటి వరకు తను మంచి ఇంట్లో ఉంది కదా.. వాతావరణం మారేసరికి అలా అయింది అన్నాడు అవును కదా.. రౌడీ అంటాడు. అవును డాక్టర్‌ చెప్పారు అంటుంది. మంచి వాతావరణం ఉంటే శౌర్యకు నయం అవుతుంది దీప అంటాడు. డాక్టర్‌ ఎందుకు అలా చెప్పారు అంటుంది. నువ్వు మాట్లాడు రౌడీ అంటాడు. నాన్న ఎప్పుడూ నిజమే చెప్తాడు, నాన్న ఎప్పుడూ నిజమే చెప్తాడు అంటుంది. గంటసేపు లేకపోతే బాధపడతావు వారం రోజులు ఉంటావా అంటుంది దీప. ఉండగలదు అంటాడు కార్తీక్‌. శౌర్యను కూడా చెప్పమని సైగ చేస్తాడు హా.. ఉండగలను అంటుంది శౌర్య. సరే కార్తీక్‌ బాబు అంటుంది దీప. మరి మనుకు శౌర్యను మనం చూడాలంటే అంటుంది. చూడాలంటే మనం వెళ్దాం దీప అంటాడు ఆలోచిస్తూ పడుకుంటాడు. కార్తీక్‌ బాబు చెప్పుకోలేని ఏదో బాధ ఉంది అనుకుంటుంది దీప.

తెల్లవారుతుంది.. డాక్టర్‌ కార్తీక్‌కు ఫోన్‌ చేస్తాడు. కార్తీక్.. ఇప్పుడే స్పెషలిస్టుతో మాట్లాడా పాపను ఆసుపత్రిలో జాయిన్‌ చేయించాలి. దీనికి కనీసం రూ.5 లక్షలు కట్టాలి అంటాడు. సరే రెడీ చేస్తాను అని ఫోన్‌ కట్‌ చేస్తాడు కార్తీక్‌. అప్పుడే దీప అంతా వింటుంది. రూ.5 లక్షలు ఎవరికి కట్టాలి బాబు ఫోన్‌లో ఎవరితో అంటున్నారు, ఎవరికి అంటుంది దీప. అది.. రెస్టారెంట్‌కు ఐదు లక్షలు కావాలి దీప అంటాడు. మరి ఆ విషయం చెప్పలేదు అంటుంది. శౌర్యను ఫ్రెండ్‌ ఇంటికి తీసుకువెళ్తా అన్నారు అంటుంది దీప. అన్ని గుచ్చి గుచ్చి అడుగుతావు దీప అంటాడు నేను బయటకు వెళ్లాలి అని వెళ్లిపోతాడు. కార్తీక్‌ బాబు ఎవరిని కలవడానికి వెళ్తున్నాడు అనుకుంటుంది. 

కార్తీక్‌ ఓ ఫ్రెండ్‌ను కలుస్తాడు. డబ్బు అడుగుతాడు. ఫ్రెండ్‌ అంటే బాగుండాలి అని కోరుకున్నా.. నీ తాతతో చాలెంజ్‌ చేశావు మీ తాతకు సారీ చెప్పి కలువు. ఇప్పటికైనా మీ తాతను కలువు అంటాడు అప్పుడు నువ్వు ఇలా నీకు సూట్‌ అవ్వని స్థాయిలో ఉండవు అని సలహా ఇస్తాడు. నువ్వు నన్ను చూసి ఫ్రెండ్‌షిప్‌ చేశావు అనకున్నా కానీ, స్థాయిని చూసి అనుకోలేదు. నీలా బతకడం నాకు రాదురా.. నావల్ల కాదు అంటాడు కార్తీక్‌. రేయ్‌ నువ్వు నీ మరదలిని పెళ్లి చేసుకుంటే బాగుండేదిరా అంటాడు ఫ్రెండ్.. సారీ రా.. నీ టైమ్‌ వేస్ట్‌ చేసినందుకు అంటాడు కార్తీక్‌. అన్నీ పోగుట్టుకున్నా ఇలా ఈగోతో ఉంటే నువ్వు ఇంకా కిందికి పడిపోతావు. నా మాట విను అప్పుడు నన్ను కలువు లేదంటే బై అని చెప్పి వెళ్లిపోతాడు కార్తీక్‌ ఫ్రెండ్‌.

Read Also: ఈ 7 ఫుడ్స్ మీకు ప్రమాదకరం.. సైలెంట్‌గా మిమ్మల్ని క్యాన్సర్ రోగిగా మారుస్తాయి..

Read Also: తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఈనెల 20 నుంచి మళ్లీ పాత పద్ధతిలోనే దర్శనాలు..!
ఐదు లక్షల అప్పుడు అడిగితే దానికి తప్ప అన్నిటికీ సమాధానం చెప్పాడు అని కార్తీక్ సైకిల్ తీసుకుని వెళ్లబోతుంటే కాశీ కార్తీక్‌ వెనుకే ఉండి అంతా వింటాడు. అతడిని ఎందుకు అడుగుతున్నావ్‌ నేను లేనా? అంటాడు కార్తీక్‌. నాకు అర్జంట్‌ రూ.5 లక్షలు కావాలి అంటాడు బిజినెస్‌కా అంటాడు కాశీ. బతికించడానికి నా కూతుర్ని అంటాడు విషయం కాశీకి చెప్పేస్తాడు. శౌర్యు ఇంత పెద్ద ప్రాబ్లెమ్‌ ఉందని అక్కకు తెలుసా? ఇంత బాధను ఒక్కడివీ ఎలా తట్టుకుంటున్నావ్‌ బావ అంటాడు. ఏడ్చే టైమ్‌ కూడా లేదు  అంటాడు. మరి నన్ను ఎందుకు అడగలేదు బావ అంటాడు కాశి ఎదుటి వారి అవసరాలు ఏంటో తెలియనప్పుడు ఏం మొహం పెట్టుకుని అడుగుతాం అంటాడు కార్తీక్.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News