Kantara OTT Release: ఓటీటీలోకి కాంతార.. అఫీషియల్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడు ఎందులో అంటే?

  Kantara to stream on Amazon Prime Video: కన్నడలో రూపొందించబడిన కాంతార సినిమా సూపర్ హిట్ గా నిలుస్తూ తమిళ, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో కూడా దూసుకుపోతోంది. ఇక ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతుంది, ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 23, 2022, 04:58 PM IST
  • ఓటీటీలో రిలీజ్ కాబోతున్న కాంతార
  • అఫీషియల్ గా అనౌన్స్ చేసిన అమెజాన్ ప్రైమ్
  • హిందీ విషయంలో లేని క్లారిటీ
Kantara OTT Release: ఓటీటీలోకి కాంతార.. అఫీషియల్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడు ఎందులో అంటే?

Kantara to stream on Amazon Prime Video from 24th November: చిన్న సినిమాగా మొదలై కోట్లు కొల్లగొట్టిన కాంతార సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కన్నడ సినీ హీరో కం డైరెక్టర్ రిషబ్ శెట్టి దర్శకత్వంలో ఈ కాంతార అనే సినిమా రూపొందింది. ఆయనే స్వయంగా హీరోగా నటించిన ఈ సినిమాలో సప్తమి గౌడ హీరోయిన్గా నటించింది. అచ్యుత్ కుమార్, కిషోర్ కుమార్ వంటి వారు ఇతర కీలకపాత్రలలో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 30వ తేదీన కన్నడ నాట రిలీజ్ సూపర్ హిట్ అయింది.

ఈ సినిమా కేవలం 14 కోట్ల రూపాయలతోనే తీసిన ఇప్పటివరకు దాదాపుగా 400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. ఆ తరువాత తమిళ, మలయాళ, తెలుగు హినిదీ భాషల్లో కూడా రిలీజ్ చేయడంతో అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తున్నారు. అయితే ఈ సినిమా ధియేటర్లలో చూసి అబ్బురు పడిన వారంతా కూడా మళ్లీ మళ్లీ థియేటర్లకు వెళ్లి చూడడంతో ఆ మేర వసూళ్లు సాధ్యమయ్యాయి అని చెబుతున్నారు. ఇక తెలుగు హక్కులు కేవలం రెండు కోట్ల రూపాయలకు కొనుగోలు చేస్తే ఇప్పటివరకు ఈ సినిమా 66 కోట్లు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది.

ఇక ఈ సినిమా ధియేటర్లో చూసినవారు సైతం ఓటీటీలో ఎప్పుడు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఎప్పుడు చూడాలా అని ఎదురుచూస్తున్న పరిస్థితుల్లో ఎట్టకేలకు ఈ సినిమాని స్ట్రీమ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ. నవంబర్ 24వ తేదీ అంటే ఈరోజు అర్ధరాత్రి 12 గంటల తర్వాత నుంచి కాంతార సినిమా మీ అందరికీ అందుబాటులోకి రాబోతోంది అంటూ అమెజాన్ ప్రైమ్ సంస్థ అధికారికంగా సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రకటించింది. ఇక దీంతో ఈ సినిమా అభిమానులందరూ ఒకరకంగా ఆనందంగా ఆనంద పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.

మంగళూరు ప్రాంతానికి చెందిన రిషబ్ శెట్టి తాను చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చిన భూత కోలా అనే ఒక దైవిక పూజను ఈ సినిమా కథగా రాసుకున్నారు పంజుర్లి అనే దైవ ఆత్మ గురించి ఈ సినిమా మొత్తం సాగుతుంది. ఇక ఈ సినిమా మొత్తానికి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా ప్లస్ అయింది. అజనీష్ లోకనాధ్ ఇచ్చిన సంగీతం కూడా బాగా కుదరడంతో ఈ సినిమా ఎక్కడ అడ్డు అదుపు లేకుండా ముందుకు వెళుతోంది. ఇక మీరు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నట్లయితే అమెజాన్ ప్రైమ్ వీడియో యాప్ లో లేదా కంప్యూటర్ ద్వారా కూడా వీక్షించవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఒకవేళ లేకపోతే వెంటనే ఖాతా తీసేసుకోండి మరి.

Also Read: Krish New Look: డైరెక్టర్ క్రిష్ బట్టతలపై మొలకలొచ్చాయ్... న్యూ లుక్ చూశారా?

Also Read: Temper Climax: పూరీ అనుకున్నది ఒక్కటి అయ్యిందొక్కటి.. వంశీ ఆ పని చేసి ఉండకపోతే డిజాస్టరే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News