Jio Hotstar Plans: ఓటీటీ రంగం రోజురోజుకూ విస్తృతమౌతోంది. కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ విలీనంతో కొత్తగా జియో హాట్‌స్టార్ ఏర్పడింది. కొత్త ఓటీటీతో ఏకంగా 4 వందల మిలియన్ల యూజర్లతో గూగుల్ యూట్యూబ్‌కు పోటీగా మారింది.
జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ విలీనం పూర్తయి జియో హాట్‌స్టార్ పేరుతో ఓటీటీ స్ట్రీమింగ్ కూడా అందుబాటులో వచ్చేసింది. జియో సినిమా, హాట్ స్టార్ విలీనం తరువాత యూజర్ల సంఖ్య ఏకంగా 4 వందల మిలియన్లకు చేరి యూట్యూబ్ పోటీగా మారింది. పస్తుతం అగ్రగామి ఓటీటీలుగా ఉన్న అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌లకు జియో హాట్‌స్టార్ గట్టి పోటీ ఇచ్చే అవకాశముంది. జియో హాట్‌స్టార్ స్ట్రీమింగ్ జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కంటెంట్ అంతా కన్పిస్తోంది. త్వరలో జియో హాట్‌స్టార్ కొత్త యాప్ కూడా అందుబాటులో వచ్చేస్తోంది. జియో హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.
జియో హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ 149 రూపాయల నుంచి ప్రారంభమౌతుంది. ఇది కేవలం మొబైల్ ఎడిషన్ మాత్రమే. ఇంట్లో టీవీకు పనిచేయద. ఇక మరో ప్లాన్ 299 రూపాయలకు అందుబాటులో ఉంది. ఇది మూడు నెలలు పనిచేస్తుంది. రెండు డివైస్‌లలో వస్తుంది. ఇక మరో ప్లాన్ 499 రూపాయల ప్రీమియం ప్లాన్. ఇది నాలుగు డివైస్‌లలో పనిచేస్తుంది. ఎలాంటి ప్రకటనలు ఉండవు. ఇప్పటికే హాట్‌స్టార్ ప్లాన్ తీసుకున్నవారికి ఎలాంటి సమస్య ఎదురుకాదు. కొత్త యాప్ ఆటోమేటిక్‌గా కన్పిస్తుంది.
Also read: Broadband Plan: 100 ఎంబీపీఎస్ స్పీడ్, ఓటీటీ, టీవీ ఛానెళ్లు ఉచితం, ప్లాన్స్ వివరాలు ఇలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి