Jabardasth New Anchor : జబర్దస్త్ షోకు కొత్త యాంకర్ వస్తుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. యాంకర్ మంజూష అని కొంత మంది.. బిగ్ బాస్ స్రవంతి అని ఇంకొందరు ఇలా ఎవరికి నచ్చినట్టుగా రాసుకొచ్చేశారు. అయితే రష్మీనే రెండు షోలకు వాడేశారు. కానీ ఇప్పుడు రష్మీ తన సినిమా పనులతో బిజీగాఉంటోంది. రెండు షోలను మెయింటైన్ చేయలేకపోతోన్నట్టుగా ఉంది. అందుకే అర్జెంటుగా కొత్త యాంకర్‌ను పట్టినట్టుంది. కానీ ఆమె యాంకర్ అని ప్రేక్షకుడు అనుకోవాలి తప్పా.. ఆమె మాత్రం యాంకరింగ్ చేయలేదు.
ఆమెకు ఒక్క ముక్క తెలుగు సరిగ్గా మాట్లాడటం రావడం లేదు. అయినా తెలుగు మాట్లాడే వాళ్లు తెలుగు యాంకర్లుగా ఉంటున్నారా? రష్మీ మొదట్లో ఎలా ఉండేదో తెలియదా? అని అంటే మాత్రం చేయడానికి ఏమీ లేదు. ఇప్పుడు జబర్దస్త్ షోకు కొత్తగా వచ్చిన సౌమ్య రావ్ అనే నటి.. సీరియల్స్‌తో బిజీగానే ఉంటోంది. తమిళ సీరియల్స్‌లో నటించింది. తెలుగులోనూ ఓ సీరియల్ చేస్తోంది. అయితే ఇప్పుడు జబర్దస్త్ షోకు హోస్ట్‌గా వచ్చింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook