Preminchoddu Movie OTT: అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస కీలక పాత్రల్లో నటించిన మూవీ ‘ప్రేమించొద్దు’.. ‘డోంట్ లవ్ అనేది ట్యాగ్ లైన్. శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. బస్తీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యూత్‌ఫుల్ లవ్‌స్టోరీగా రూపొందిన థియేటర్ ప్రేక్షకులను మెప్పించింది. తెలిసీ తెలియని వయసులో ప్రేమించొద్దు అనే కాన్సెప్ట్‌తో నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రా అండ్ రాస్టిక్గా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. స్కూల్, కాలేజ్ ఏజ్‌లో ప్రేమ పేరుతో చదువులను నిర్లక్ష్యం చేయడం.. ఆ ప్రేమ కారణంగా ఎదురయ్యే పరిణామాలను చక్కగా వెండితెరపై చూపించారు. ఈ మూవీని 'బి సినీ ఈటీ' (Bcineet) కంపెనీ ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ విడుదల చేస్తోంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అమెజాన్ ప్రైమ్, బి సినీ ఈటీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత శిరిన్ శ్రీరామ్ మాట్లాడుతూ ‘‘వైవిధ్యమైన ప్రేమకథా చిత్రంగా ప్రేమించొద్దు- డోంట్ లవ్ మూవీని తెరకెక్కించాం. థియేటర్స్‌లో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్, బి సినీ ఈటీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రేమించొద్దు సినిమా ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పి అదే కథలో మార్పులు చేర్పులు చేసుకొని బేబీ సినిమా తీశారు. నా సినిమా కథను దొంగిలించారని తెలుగు సినిమా 'బేబీ' నిర్మాతలపై నేను పోలీస్ స్టేషన్లో క్రిమినల్ ఫిర్యాదు చేసిన విషయం నా సర్కిల్లోని చాలా మందికి, అలాగే సినీ వర్గాల్లోని వారికి తెలుసు. నేను ఇప్పుడు కోర్టులో కేసును కొనసాగిస్తున్నాను. ఇలాంటి నేపథ్యంలో ప్రేక్షకుల సహకారం నాకెంతో అవసరం. అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
నటీనటులు:
అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస, యశ్వంత్ పెండ్యాల, సంతోషి తాళ్ల, సోనాలి గర్జె, లహరి జులురి, శ్రద్ధా సాయి, వల్లీ శ్రీగాయత్రి, లక్ష్మీకాంత్ దేవ్ తదితరులు
సాంకేతిక వర్గం:
==> రైటింగ్, ఎడిటింగ్, ప్రొడ్యూసర్, దర్శకత్వం- శిరిన్ శ్రీరామ్
==> మ్యూజిక్ ప్రోగ్రామింగ్ - జునైద్ కుమార్
==> బ్యాగ్రౌండ్ స్కోర్ - కమ్రాన్
==> సాంగ్స్ కంపోజింగ్ - చైతన్య స్రవంతి
==> సినిమాటోగ్రఫీ అండ్ కలర్ - హర్ష కొడాలి
==> స్క్రీన్ ప్లే - శిరిన్ శ్రీరామ్, రాహుల్ రాజ్ వనం
==> అసోసియేట్ డైరెక్టర్ - సోనాలి గర్జె,
==> పబ్లిసిటీ డిజైన్ - అజయ్(ఏజే ఆర్ట్స్),
==> PRO- చంద్ర వట్టికూటి, మోహన్ తుమ్మల.