Nandini Reddy Sorry to Telugu Audience: కేజీఎఫ్ 2 సినిమా గురించి ప్రస్తావిస్తూ యంగ్ ఫిలిం డైరెక్టర్ వెంకటేష్ మహా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కేరాఫ్ కంచరపాలెం ,ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంకటేష్ మహా ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఆ వెబ్ సిరీస్ మార్చి 9వ తేదీ నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే తాజాగా ఒక సీనియర్ జర్నలిస్ట్ ఐదుగురు దర్శకులతో కలిసి ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూ నిర్వహించింది.
అందులో నందిని రెడ్డి, వెంకటేష్ మహా, మోహన్ కృష్ణ ఇంద్రగంటి, శివ నిర్వాణ, వివేక్ ఆత్రేయ వంటి సెన్సిబుల్ డైరెక్టర్లు ఉన్నారు. కమర్షియల్ సినిమాల గురించి చర్చ జరుగుతున్న సమయంలో వెంకటేష్ మహా కెజిఎఫ్ 2 గురించి దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. అది ఆయన అభిప్రాయం అనుకోవచ్చు. కానీ అందులో హీరో పాత్రను నీచ్ కమిన్ కుత్తే అని ప్రస్తావిస్తూ మాట్లాడడం తెలుగు వారికి కూడా ఏ మాత్రం నచ్చడం లేదు. దీంతో ఆయనని దారుణంగా ట్రోల్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
అంతేకాక ఆయన మాట్లాడుతున్న సమయంలో పక్కనే ఉన్న మోహన్ కృష్ణ ఇంద్రగంటి, నందిని రెడ్డి, వివేకాత్రేయ వంటి వారు కూడా నవ్వడంతో వారి మీద కూడా ట్రోలింగ్ జరుగుతుంది. ఈక్రమంలో ఈ విషయం మీద నందిని రెడ్డి క్షమాపణలు చెప్పింది. హిట్ అయిన ప్రతి కమర్షియల్ సినిమా వెనుక ఆడియన్స్ ఉన్నారు, వారి ప్రేమ ఉంది. ఆ సినిమా విషయంలో వారు పెట్టిన ఎఫర్ట్ లో ఏదో ఒక విషయం ప్రేక్షకులకు వచ్చిందని అర్థం. ఇక మా మధ్య జరిగిన సంభాషణ ఎవరినీ కించపరచాలని కాదు కమర్షియల్ సినిమా అనే ఒక కాన్సెప్ట్ మీద ఒక హెల్తీ డిస్కషన్ చేశాం కానీ అది ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించండి అంటూ ఆమె రాసుకువచ్చారు.
ఒక నెటిజన్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ మేడం మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది, మీ కొత్త సినిమాకి కూడా వెళ్దాం అనుకున్నా పూణేలో థియేటర్ ఎక్కడున్నా పర్లేదు వెళ్దాం ఫ్యామిలీ ఎంటర్టైనర్ కదా అనుకున్నా. బట్ ఒక డైరెక్టర్ వేరే డైరెక్టర్ సినిమాని ఆడియన్స్ దీనిని ఎందుకు చూశారురా అని అంటే దానికి మీరు నవ్వడం ఎలా ఉంది అంటే ప్రశాంత్ నీల్ నే కాదు మీరు మా ఆడియన్స్ ని అవమానించినట్లుగా అనిపిస్తుంది అంటూ కామెంట్ చేశాడు. దానికి నందిని రెడ్డి ఎక్స్ట్రీమ్లీ సారీ అండి, అతని వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ కి నవ్వు వచ్చింది. అదలా జరిగిపోయింది తప్ప మేము కావాలని చేసింది కాదు కానీ అది బయటకు ఎలా వచ్చిందనేది నాకు ఇప్పుడే అర్థం అవుతుంది అంటూ ఆమె కామెంట్ చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి