Game Changer vs Sankranthiki Vastunnam: టాలీవుడ్ సినీ పరిశ్రమకు సంక్రాంతి పండుగ ఎప్పుడూ అతిపెద్ద పండుగ అని చెప్పవచ్చు. సీనియర్ హీరోలను మొదలుకొని యంగ్ హీరోల వరకు ఈ సంక్రాంతికి తమ సినిమాలను విడుదల చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా సంక్రాంతికి వచ్చిన సినిమాలకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. అందుకే ఈ సంక్రాంతికి తన సినిమాలను విడుదల చేయాలని ఆలోచిస్తూ ఉంటారు.
ఇక అందులో భాగంగానే ప్రముఖ నిర్మాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు ఈ సంక్రాంతిని భారీగా వాడుకున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆయన రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమాను జనవరి 10వ తేదీన విడుదల చేశారు. ఈ సినిమా మొదటిరోజు రూ.186 కోట్లు కలెక్షన్స్ వసూలు చేసిందని పోస్టర్స్ రివీల్ చేశారు. కానీ సినిమా ఘోరమైన డిజాస్టర్ ను చవి చూసింది. దీంతో దిల్ రాజు పని అయిపోయిందని అందరూ అనుకున్నారు.
దీనికి తోడు ఇదే సంక్రాంతికి జనవరి 14వ తేదీన అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాను విడుదల. చేశారు ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అంతేకాదు రూ.300 కోట్ల కలెక్షన్స్ దిశగా అడుగులు వేస్తోంది. అంతేకాదు 13వ రోజు తెలుగు రాష్ట్రాలలో రూ.6.77 కోట్లు వసూలు చేసి బాహుబలి 2 రికార్డులను కూడా బ్రేక్ చేసింది.
అయితే ఇక్కడ గేమ్ ఛేంజర్ నష్టాలను ఆయన పూడ్చలేకపోయారని, దానివల్ల బయ్యర్స్ నష్టపోయారని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు నిజం బయటపడింది. దిల్ రాజు గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం హక్కులను కలిపి ప్రతి ఏరియాలో కూడా ఒకే కొనుగోలుదారునికి విక్రయించడం వల్ల బయ్యర్స్ భారీగా సేవ్ అయినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల హక్కులు దాదాపు రూ.170 కోట్లకు అమ్ముడుపోయాయి.
ఇప్పటివరకు ఆంధ్ర, తెలంగాణలో రెండు చిత్రాల ఉమ్మడి వాట జిఎస్టి తో కలిపి రూ.185 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. మొత్తానికి అయితే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ గేమ్ ఛేంజర్ సినిమా వ్యాపార నిష్పత్తిని సమర్థవంతంగా భర్తీ చేసిందని అటు కొనుగోలుదారులకు కూడా ఉపశమనం కలిగించిందని చెప్పవచ్చు. ఇక ఏది ఏమైనా దిల్ రాజు ఆలోచనకు, టాలెంట్ కి ఇండస్ట్రీ కూడా ఫిదా అవుతుందని చెప్పవచ్చు.
Also Read: Rythu Bharosa: రైతులకు భారీ శుభవార్త.. బ్యాంకుల్లో రూ.569 కోట్లు పెట్టుబడి సహాయం జమ
Also Read: Pay Revision Commission: 'రెండు పీఆర్సీలు పెండింగ్.. ఆర్టీసీ విలీనం కోసం 15 రోజులే గడువు: జేఏసీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.