Did You Noticed Sukumar mark clue in Pushpa 2 teaser: గత రెండు మూడు రోజుల నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతున్నాడు. అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో పుష్పరాజ్ కి సంబంధించిన వార్తలు వెలువడుతున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగాన్ని చాలా శ్రద్ధగా తెరకెక్కిస్తున్నారు మేకర్స్.
తాజాగా వేర్ ఇస్ పుష్ప అంటూ ఒక చిన్న టీజర్ వీడియో పలు భాషల్లో విడుదల చేయగా అన్ని భాషల్లోనూ ఈ టీజర్ వీడియో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు వెళుతోంది. మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్ ద్వారా అసలు రెండో భాగం సినిమా ఎలా ఉండబోతోంది? కథ ఏమిటి అనే విషయం మీద క్లారిటీ చేశాడు సుకుమార్. మనం కరెక్ట్ గా ఆ వీడియోని గనక పరిశీలిస్తే సుకుమార్ ఈ సినిమా విషయంలో ఒక హింట్ ఇచ్చాడనే ప్రచారం జరుగుతోంది.
Also Read: Priyanka Singh Photos: బిగ్ బాస్ ప్రియాంక సింగ్.. అందాల ఆరబోతలో రాకింగ్.. ముందుకు వంగి మరీ..
మొదటి భాగం టైటిల్స్ లో పుష్ప అనే పదాలని రెడ్ కలర్ లో ఉండేవి కానీ ఈ తాజా టీజర్ రిలీజ్ చేసినప్పుడు మాత్రం ఆ ఎర్ర అక్షరాలు బంగారు రంగులోకి చేంజ్ అవుతున్నాయని అంటున్నారు. బహుశా సుకుమార్ తమ స్టైల్ లో ఈ క్లూ ఇచ్చి ఉండవచ్చని ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది. నిజానికి సుకుమార్ లెక్కల మాస్టర్ కావడంతో ఆయన చేసే సినిమాలు అన్నీ ఏదో ఒక ఆసక్తికరమైన కాన్సెప్ట్ తోనే రూపుదిద్దుకుంటాయి.
అందుకే ఆయన సినిమాల్లో టైటిల్స్ కూడా చాలా విభిన్నంగా క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా విడుదలైన పుష్పా టీజర్ లో కూడా ఈ హింట్ పలువురు అబ్జర్వ్ చేసి సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇలా ఏమి సుకుమార్ ఏమి ప్లాన్ చేసి ఉంటాడా అనే అంశం మీద చర్చ జరుగుతోంది. మీరు కూడా ఆ టీజర్ ని అబ్జర్వ్ చేశారా? అబ్జర్వ్ చేస్తే ఆ అంశం గురించి మీరు ఏమి అనుకుంటున్నారు? మీ ఉద్దేశం ఏమిటో కింద కామెంట్ చేయండి.
Also Read: Punch Prasad Hospitalised: జబర్దస్త్ కమెడియన్ కు అస్వస్థత.. మళ్ళీ హాస్పిటల్లో చేరిన పంచ్ ప్రసాద్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook