Kajal Aggarwal: కాజల్ చేసిన పెద్ద తప్పు…ముందు గొయ్యి.. వెనక నుయ్యిలా.. మారిన పరిస్థితి..

Satyabhama Collections: బాబు పుట్టాక.. కొంత సినిమాల.. నుండి బ్రేక్ తీసుకున్న కాజల్ కి.. మంచి ఆఫర్లు రావడం లేదు అని టాక్ నడుస్తోంది. దానికి తోడు.. తాజాగా ఇప్పుడు కాజల్.. సత్యభామ సినిమాతో.. పెద్ద రిస్క్ చేసింది. ఆ రిస్క్ ఆమెకే బీభత్సంగా.. బ్యాక్ ఫైర్ అయ్యింది. ఇప్పుడు కాజల్ కెరియర్ పరిస్థితి ఏంటి అని.. కాజల్ తో పాటు ఫ్యాన్స్ కూడా కంగారుపడుతున్నారు.   

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 18, 2024, 02:18 PM IST
Kajal Aggarwal: కాజల్ చేసిన పెద్ద తప్పు…ముందు గొయ్యి.. వెనక నుయ్యిలా.. మారిన పరిస్థితి..

Kajal Aggarwal Next Movie: 2020లో గౌతమ్ తో పెళ్లికి ముందు వరకు.. కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలో ఉన్న బిజీ హీరోయిన్లలో.. ఒకరు. కానీ పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్.. సినిమాల స్పీడు తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే 2022లో పండంటి మగ బిడ్డకి.. జన్మనిచ్చిన కాజల్ అగర్వాల్.. ఎక్కువ కాలం సినిమాల నుంచి దూరం కాలేదు.. కానీ బాబు పుట్టాక కాజల్ చేసిన సినిమాలు చాలా తక్కువ. 

డెలివరీ సమయంలో సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్న కాజల్ అగర్వాల్.. త్వరగానే తిరిగి షూటింగ్ లకి వచ్చింది.. కానీ ఆమెకి ఆఫర్లు మాత్రమే.. రావడం లేదు. భగవంత్ కేసరి సినిమాలో.. ఆమెది పెద్ద చెప్పుకోదగ్గ పాత్ర కాదు. 

భారతీయుడు 3 సినిమాలో కూడా కాజల్ అగర్వాల్ నటిస్తోంది కానీ.. అసలు ఇంకా భారతీయుడు 2 సినిమా కూడా రిలీజ్ కాలేదు కాబట్టి.. దాని రెండవ భాగం ఎప్పటికి విడుదలవుతుందో.. ఇంకా క్లారిటీ లేదు. మరోవైపు కన్నప్ప సినిమాలో కూడా కాజల్ నటిస్తోంది కానీ.. ఈ సినిమాలో కూడా ఆమె పాత్రకి అంత స్కోప్ ఉన్నట్టు కనిపించడం లేదు. 

ఇలా ఏదో పేరుకి.. చిన్నాచితక పాత్రలు వస్తున్నాయి.. ఈ క్రమంలో తాజాగా.. కాజల్ చేసిన ఒక పని వల్ల..ప్రస్తుతం ఈ హీరోయిన్ కి పూర్తిగా అవకాశాలు..ఆగిపోయేలాగా కనిపిస్తున్నాయి. కెరియర్ లో ఇప్పటిదాకా ఎప్పుడు చేయనటువంటి కాజల్.. ఈ మధ్యనే సత్యభామ.. అనే ఫిమేల్ సెంట్రిక్ సినిమాలో నటించింది. సినిమా హిట్ అయితే అనుష్క, నయనతార వంటి హీరోయిన్ల లాగా.. అటు ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు చేసుకుంటూ.. ఇటు కమర్షియల్ సినిమాలతో కూడా ప్రేక్షకులను అలరించవచ్చు. 

కానీ కాజల్ అగర్వాల్.. పరిస్థితిలో మాత్రం అలా జరగలేదు. సత్యాభామ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీంతో కాజల్ నెక్స్ట్ సినిమాల మీద కూడా.. ఆ ఎఫెక్ట్ పడబోతుంది అని కొందరు చెబుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు చేయడం.. కాజల్ మొదలు పెట్టేసింది కాబట్టి.. ఇకపై ఆమె వద్దకు వచ్చే డైరెక్టర్లు.. కమర్షియల్ సినిమాలతో రావడానికి కొంచెం ఆలోచిస్తారు. 

ఇక మరోవైపు ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు.. అయినా వస్తాయా అంటే.. సత్యభామ సినిమా ఫ్లాప్ అయ్యాక మళ్లీ అలాంటి సినిమాలు.. రావడం కొంచెం కష్టమే. చూస్తూ ఉంటే ఇప్పటిదాకా వచ్చిన సినిమాలు కూడా.. కాజల్ కి వస్తాయా లేదా అని.. అభిమానులు కంగారు పడుతున్నారు. 

ఈ నేపథ్యంలో సత్యభామ లాంటి సినిమాలో కాజల్ నటించడమే.. ఆమె తన కెరియర్ లో చేసిన పెద్ద మిస్టేక్ అని.. మరికొందరు తేల్చి చెప్పేస్తున్నారు. ఏదేమైనా కాజల్ అగర్వాల్ కి ఒక్క బ్లాక్ బస్టర్ సినిమా పడినా.. కూడా మళ్లీ పరిస్థితులు మారే అవకాశం ఉంది. మరి కాజల్ కి ఆ బ్లాక్ బస్టర్ ఏ సినిమాతో వస్తుందో చూడాలి.

Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News