చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ), దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ( YS Rajasekhar Reddy ) మధ్య ఉన్న స్నేహం గురించి, రాజకీయాల్లో ఉన్నత స్థాయికి ఎదిగే క్రమంలో వారికే తెలియకుండా వారి మధ్య ఏర్పడిన రాజకీయ వైరం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల స్నేహం, వైరం ఆధారంగా ప్రముఖ దర్శకుడు దేవ కట్ట ( Deva Katta ) డైరెక్షన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. Also read : SP Balasubrahmanyam: బాలు ఆరోగ్య పరిస్థితి విషమం.. హెల్త్ బులెటిన్ విడుదల
దేవ కట్ట ఈ ప్రకటన చేసినప్పటి నుంచే ఈ సినిమాపై టాలీవుడ్ ఆడియెన్స్‌లో ఒక రకమైన ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమాకు ఏం పేరు పెడతారు ? నటీనటులు ఎవరు అనే అంశాలు తెలుసుకునేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలావుండగా.. ఇవాళ ఈ సినిమాపై చిత్ర నిర్మాణ సంస్థ ఓ థీమ్ పోస్టర్ విడుదల చేయగా.. దేవ కట్ట ఆ ట్వీట్‌ను రిట్వీట్ చేశాడు. ఈ మోషన్ పోస్టర్ ద్వారా మూవీ వర్కింగ్ టైటిల్‌ని విడుదల చేశారు. Also read : Niharika engagement: నిహారిక ఎంగేజ్‌మెంట్‌కి పవన్ కల్యాణ్ అందుకే రాలేదట
There are no two sides to TRUTH, there is only one side!! Pls checkout the theme poster of INDRAPRASTHAM (working title)! @ProodosP @tchekuri @KrishnavijayL teaser score by #sureshbobbili https://t.co/mh0DZbY2VV
— deva katta (@devakatta) August 14, 2020
కరోనా నుంచి కోలుకుంటున్న యంగ్ హీరోయిన్ప్రపంచంలో జరిగే పోటీలన్నీ విన్నర్స్‌ని ఎంచుకోవడం కోసం జరిగేవే అని.. అలా అనుకోకుండా ఒక పోటీలో ఇద్దరు స్నేహితులు పోటీపడితే ఎలా ఉంటుందనేదే ఈ చిత్ర కథాంశం అంటూ ఈ మోషన్ పోస్టర్ ద్వారా సినిమాపై హైప్ క్రియేట్ చేయడంలో దేవ కట్ట సక్సెస్ అయ్యాడు. దేవ కట్ట ప్రకటించిన ఇంద్రప్రస్థం ( Indraprastam ) అనే వర్కింగ్ టైటిలే సినిమాకు ఫైనల్ టైటిల్ అవుతుందా అనేది వేచిచూడాల్సిందే. Also read :
Indraprastham: చంద్రబాబు, వైఎస్ఆర్ స్నేహంపై సినిమా టైటిల్ ఇదేనా ?