Deva Katta Funny Post దేవా కట్టా తాజాగా తన కొత్త సినిమా స్క్రిప్ట్ పనుల్లో తలమునకలై ఉన్నాడు. అసలే దేవా కట్టా సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన సినిమాలు కమర్షియల్‌గా సక్సెస్ అవుతాయా? లేదా? అన్నది తరువాత విషయం. ఆయన చిత్రాలు చూస్తే మాత్రం కచ్చితంగా ఆడియెన్స్‌లో కొత్త ఆలోచనలు, సమాజంపై ఉండాల్సి బాధ్యత గురించి మాత్రం తెలుస్తుంది. ఆయన తెరకెక్కించిన ప్రస్థానం ఎప్పుడూ ఓ కల్ట్ క్లాసిక్‌గా నిలిచి ఉంటుంది.
చివరగా ఆయన సాయి ధరమ్ తేజ్‌తో రిపబ్లిక్ అనే సినిమాను తీశాడు. సమాజం కోసం ప్రాణాలు కోల్పోయిన కలెక్టర్ల జీవిత చరిత్రల ఆధారంగా రిపబ్లిక్ సినిమాను తీశాడు. ఈ సినిమా కూడా కమర్షియల్‌గా అంతగా వర్కౌట్ అవ్వకపోయినా కూడా అందరిలోనూ కొన్ని ఆలోచనలు మాత్రం రేకెత్తించినట్టు అయింది. రాజకీయ వ్యవస్థలు, ప్రజా వ్యవస్థలు ఎలా ఉన్నాయో చూపించాడు.
That’s the next script on my 14 feet table….and those beer cans are not mine! 🙅♂️ pic.twitter.com/AdtkOV0vWC
— deva katta (@devakatta) January 19, 2023
ఇప్పుడు దేవా కట్టా తన కొత్త సినిమా ప్రాజెక్ట్ మీద ఫోకస్ పెట్టేశాడు. దీనిలో భాగంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వేశాడు. తన నెక్ట్స్ సినిమాకు జరుగుతున్న స్క్రిప్ట్ పనుల గురించి చెప్పుకొచ్చాడు. అందులో తన టేబుల్ మీదున్న స్క్రిప్ట్ పేపర్స్‌ను చూపించాడు. అందులోనే కొన్ని బీర్ టిన్స్ ఉన్నాయి. ఆ స్క్రిప్ట్ నాదే కానీ.. ఆ బీర్‌లు మాత్రం తనవి కావని చెప్పుకొచ్చాడు. దీంతో దేవా కట్టా సన్నిహితులు, టీం మెంబర్స్ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
దేవా కట్టా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటాడు. సమాజంలో జరిగే దుర్ఘటనల మీద స్పందిస్తూ ఉంటాడు. తనకు నచ్చిన సినిమాల గురించి రాస్తుంటాడు. అలా నెట్టింట్లో దేవా కట్టా ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాడు.
Also Read: Mahesh Babu Son : గౌతమ్ మొదటి సారి ఆ పని చేయబోతోన్నాడు.. నమ్రత పోస్ట్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Deva Katta : ఆ స్క్రిప్ట్ నాదే.. బీర్ బాటిల్స్ నావి కాదు.. దేవా కట్టా పోస్ట్ వైరల్
సినిమా స్క్రిప్ట్ పనుల్లో దేవా కట్టా
ఫన్నీ పోస్ట్ చేసిన క్రేజీ డైరెక్టర్
బీర్ బాటిళ్లపై డైరెక్టర్ కామెంట్స్