Theatre Sound Box Failures: సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన 'డాకు మహారాజ్' సినిమా సంక్రాంతి కానుకగా ఆదివారం జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లతో దూసుకెళ్తోంది. డాకు మహారాజ్ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో కనిపించారని అభిమానులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ మెప్పిస్తోంది. బాలయ్య ఇమేజ్‌కి తగ్గట్టు డైలాగ్, యాక్షన్ ఎపిసోడ్స్ ఉండడంతో బాలయ్య అభిమానులు థియేటర్‌లలో రచ్చ చేస్తున్నారు. సంక్రాంతి పండుగకు బాలయ్య ప్రేక్షకులకు పండుగ అందించాడు.
అయితే సినిమా సెకండ్ హాఫ్‌కు ప్రేక్షకుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. బాలకృష్ణ తన పాత్రకు పూర్తి న్యాయం చేసినా దర్శకుడు కథనంలో విఫలమయ్యాడనే చర్చ జరుగుతోంది. యాక్షన్ సీన్స్, డైలాగ్ డెలివరీ కేకలు.. అరుపులతో థియేటర్‌లు దద్దరిల్లేలా చేస్తున్నారు. బాబీ డియోల్ పాత్రపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. బాబీ డియోల్, బాలకృష్ణ మధ్య వచ్చే సీన్స్.. యాక్షన్ సీన్స్ అదిరిపోయేలా ఉన్నాయి.
Also Read: Game Changer: ఫ్రాడ్ చేసి పరువుతీశారు.. బన్నీ కాళ్లు మొక్కాలి.. గేమ్ ఛేంజర్ పై ఆర్జీవీ ట్వీట్లు
ఆగిపోయిన సినిమా
హైదరాబాద్‌లో ప్రదర్శితమవుతున్న ఓ థియేటర్‌లో సౌండ్ బాక్స్‌లు పగిలిపోయాయి. యాక్షన్ సీన్స్ వచ్చే సమయంలో సౌండ్ బాక్స్‌లు ఆగిపోవడంతో ప్రేక్షకులు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతకీ సౌండ్ రాకపోవడంతో థియేటర్‌లో రచ్చరచ్చ చేశారు. ఫలితంగా సినిమా ఆగిపోయింది. సినిమా ఆగిపోవడంతో అక్కడ కొంత గందరగోళం ఏర్పడింది. అనంతరం ఓ అభిమాని మీడియాతో మాట్లాడుతూ సంగీత దర్శకుడు థమన్‌పై విరుచుకుపడ్డాడు.
మళ్లీ షో వేయాలి
'తమన్ అందించిన సంగీతం వల్ల సినిమా మధ్యలో సౌండ్ బాక్సులు పని చేయలేదు. సినిమా ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి ప్రదర్శించాలని. లేని పక్షంలో మొదటి నుంచి ప్రారంభించాలి' అని డిమాండ్ చేశారు. డాకు మహరాజ్ సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, ప్రత్యేక పాత్రలో ఊర్వశి రౌతలా నటించగా.. బాబీ డియేల్ ప్రధాన విలన్‌గా నటించారు. ఈ సినిమా ప్రేక్షకుల మెప్పు పొందుతూ భారీ కలెక్షన్ల దిశగా దూసుకుపోతుంది.
Oryy malli Speakerlu dengutunnai 🥵@MusicThaman respond avuu ayya@dirbobby #JrNTR #DaakuMahaaraaj #JaiBalayya pic.twitter.com/lDLJZq3e34
— Gajuwaka NTR fans (@GajuwakaNTRfc) January 12, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter