Bullet La Lyrical Song: కిరణ్ అబ్బవరం నటించిన 'సమ్మతమే' సినిమా నుండి `బుల్లెట్ లా` సాంగ్ విడుద‌ల‌..

కిరణ్ అబ్బవరం నటిస్తున్న 'సమ్మతమే' సినిమా నుండి `బుల్లెట్ లా` అనే లిరికల్ సాంగ్ విడుదలైంది. ఆకట్టుకుంటున్న ఈ పాట ఎలా ఉందో మీరే చూడండి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 17, 2022, 03:43 PM IST
  • "సమ్మతమే" నుండి విడుదలైన `బుల్లెట్ లా` సాంగ్
  • ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న కిరణ్ అబ్బవరం
  • ఆకట్టుకుంటున్న టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, ఫస్ట్‌ గ్లింప్స్‌
Bullet La Lyrical Song: కిరణ్ అబ్బవరం నటించిన 'సమ్మతమే' సినిమా నుండి `బుల్లెట్ లా` సాంగ్ విడుద‌ల‌..

Bullet La Lyrical Song 'Sammethame' Movie: యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం విలక్షణమైన సబ్జెక్ట్‌లను ఎంచుకుంటున్నారు. "రాజావారు రాణిగారు", "ఎస్ఆర్ కల్యాణమండపం" సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం మరికొన్ని సినిమాలలో నటిస్తూ ముందుకెళ్తున్నాడు. 

లవ్ స్ట్రోరీలకి చెందిన సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో కిరణ్.. ఇటీవల సెబాస్టియన్ పి.సి 524 సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోకపోయిన.. సస్పెన్స్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ గా మంచి మార్కులే సంపాదించింది. 

అయితే కిరణ్ అబ్బవరం ఇప్పుడు అర్బన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న  "సమ్మతమే" అనే మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నాడు.టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, ఫస్ట్‌ గ్లింప్స్‌ సినిమాపై అంచనాలను పెంచాయి. మొదటి సింగిల్  లిరికల్ వీడియో కూడా చార్ట్‌బస్టర్‌గా మారింది. ఈ రోజు  రొమాంటిక్ మెలోడీగా రూపొందిన `బుల్లెట్ లా` లిరికల్ వీడియోను

ఆవిష్కరించారు. శేఖర్ చంద్ర త‌న వాద్య‌సంగీతంలో ఆక‌ట్టుకునేలా చేశాడు. కిరణ్, చాందిని ఆకర్ష‌ణీయంగా కనిపిస్తున్నారు. దర్శకుడు గోపీనాథ్ రెడ్డి డిఫరెంట్ లవ్ స్టోరీతో వచ్చిన ఆయన సంగీతంలో మంచి అభిరుచి ఉన్నట్టు తెలుస్తోంది. మొదటి సింగిల్ లాగానే ఇది కూడా హిట్‌గా నిలుస్తుంది.

యుజి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కె ప్రవీణ నిర్మించిన “సమ్మతమే” ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. సతీష్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.

తారాగణం: కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి తదితరులు.
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గోపీనాథ్ రెడ్డి
నిర్మాత: కంకణాల ప్రవీణ
బ్యానర్: UG ప్రొడక్షన్స్
సంగీత దర్శకుడు: శేఖర్ చంద్ర
కెమెరా: సతీష్ రెడ్డి మాసం
ఎడిటర్: విల్పవ్ నైషదం
ఆర్ట్ డైరెక్టర్: సుధీర్ మాచర్ల

Also Read: Miss World 2021: మిస్ వరల్డ్‌గా పోలండ్ బ్యూటీ కరోలినా బిలావ్‌స్కా, టాప్ 6కు చేరని భారత మహిళ

Also Read: Vastu Tips For Home: పొరపాటును కూడా ఈ 5 వస్తువులను ఇంట్లో ఉంచకండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News